For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నీ రేటేంతో చెప్పు నెటిజన్ ప్రశ్న.. అనసూయ ఎలాంటి జవాబిచ్చిందంటే?

  |

  లైగర్ రిలీజ్ ఆ తర్వాత ఆ సినిమా, విజయ్ దేవరకొండను పరోక్షంగా స్పందిస్తూ యాంకర్, యాక్టర్ అనసూయ భరద్వాజ్ ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించడం ఆసక్తిగా మారింది. గత మూడు రోజులుగా వరుసగా ట్వీట్లు చేస్తూ ఆమె తన సహనాన్ని, తన బాధను, తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నది. అయితే నెటిజన్లు ఆమెను ఆంటీ అంటూ వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నా ట్వీట్లు చేయడం ఆపడం లేదు. వరుసగా ట్వీట్లు చేస్తూ అనసూయ ఎలాంటి వాదనలకు దిగిందంటే..

   అంటీ అని పిలిస్తే రెస్పెక్ట్ లేనట్టా?

  అంటీ అని పిలిస్తే రెస్పెక్ట్ లేనట్టా?

  అనసూయను ఓ నెటిజన్ ప్రశ్నిస్తూ.. ఆంటీ అని పిలిస్తే రెస్పెక్ట్ లేనట్టా అని అంటే.. ఇలా వితండ వాదాలు చేస్తే మీకొచ్చె లాభం ఏమిటి? నా పిల్లల ఫ్రెండ్స్, మా చుట్టాల్లో పిల్లలు, నేను వరకు అంటీఅయితే నన్ను వారికి ఆంటీనే. కానీ ఇక్కడ మీరతంతా చూసేది నా వయస్సును. నున్న హేళన చేయడానికి చేస్తే పని. మీ ఉద్దేశాలు వేరు. అది తప్పు. అది అగౌరవ పరచడం అని అంటున్నాను అని అనసూయ ఘాటుగా స్పందించింది.

  కర్మ సిద్దాంతం వెంటాడుతుంది


  అక్క అనొద్దు.. ఆంటో వద్దు.. ఓసేయ్ లాంటి పదాలు వాడాలా అని ఓ నెటిజన్ అంటే.. ఇలాంటి వారికి మీరు బుద్ది చెప్పండి. నేను కర్మ సిద్దాంతం అని చెబుతున్నాను కదా.. అదే మిమ్మల్ని కాపాడుతుంది. చూస్తు ఉండండి.. వత్తాసు పలకండి. కర్మ ఏదో రోజు మీకు గుణపాటం నేర్పుతుంది అని అనసూయ మరో ట్వీట్‌కు బదులు ఇచ్చింది.

  చెల్లినో.. మీ భార్యనో అడగండి.


  ఓ నెటిజన్ చేసిన దారుణమైన ట్వీట్‌కు అనసూయ బదులిస్తూ.. నేనంటే మీకు చాలా లోకువ కదండి.. మీ చెల్లినో.. లేక మీకు పెళ్లై మీ భార్యనో లేదా చెల్లినో.. రోజుకు మీ రేటెంత అంటే ఎలా ఉంటుంది. అదే ఆఫీసులో రోజుకు ఎంత అని అడిగితే.. వాళ్లు మీకు ఏం చెబుతారు అని అనసూయ నిలదీసింది. మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. నేను చాలా విలువైన దానిని అంటూ జవాబిచ్చింది.

  తెర మీద, బయటా అని


  అయితే టెలివిజన్ షోలో అనసూయతో కిక్కు అనే వీడియో గురించి ఓ నెటిజన్ స్పందిస్తూ.. తెర మీద, బయటా అని డిఫరెన్స్ ఏంటీ మేడమ్... తెర కోసం క్యారెక్టర్ ని అమ్మేస్తారా ఎవరైనా అని నెటిజన్ ప్రశ్నిస్తే.. ఎంత మాటా.. తెర కోసం క్యారెక్టర్ ప్లే చేస్తాం. టీవీలో అక్కడికి అనుగుణంగా.. మూవీలో అక్కడికి అనుగుణంగా.. మీరే మేము తెర మీద చేసేవన్నీ మా క్యారెక్టర్ జడ్జిమెంట్‌తో ముడిపెడుతారా? అన్యాయమండీ.. అమ్మడం ఏమిటి అంటూ అనసూయ ఘాటుగా స్పందించింది.

  జబర్దస్త్.. మూవీస్ గురించి అనసూయ వివరణ

  జబర్దస్త్.. మూవీస్ గురించి అనసూయ వివరణ


  నెటిజన్ చేసిన ట్వీట్లకు అనసూయ సమాధానం ఇస్తూ.. జబర్దస్త్.. మూవీస్, ఇతర టీవీ షోలు నా జీవితంలో భాగం. అవి నా జీవితం కాదు. నా ప్రయారిటీలు వేరే ఉన్నాయి. మీరు ఊహించుకొన్నట్టు నా ప్రయారిటీలు అవి కావు. ఇంతకు మీరంతా నా కంటే ఖాళీగా ఉన్నారనేది తెలుస్తున్నది అంటూ అనసూయ సెటైర్ వేసింది.

  ముగింపు ఎప్పుడంటే?


  ఇలా అనసూయ, నెటిజన్లతో గొడవకు దిగడంపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. దీనికి ముగింపు లేదా అనసూయ గారు అంటే.. మీ చేతుల్లోనే ఉన్నది. ఆన్‌లైన్ వేధింపులు, వయస్సును టార్గెట్ చేస్తూ... చేసిన ప్రతీ వ్యక్తి మీదైన రీతిలో జవావుబ చెప్పండి. ఖండించండి. అసలు చేసత్ూ పోతే వారికి తప్పని.. తెలిసివచ్చి వాడి వికృత చర్యలు ఆపినప్పుడు.. ముగింపు ఉంటుంది. లేదా చివరికి చట్ట ప్రకారం శిక్ష పుడుతుంది అని అనసూయ ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది.

  English summary
  Actor and Anchor Anasuya Bhardwaj sharp reaction on Age shame trolls. She said, calling Aunty is objectable.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X