అనసూయతో అసభ్యంగా ప్రవర్తించిన బిగ్ బాస్ నటుడు.. వెనకాల నుంచి వచ్చి
బుల్లితెర ప్రేక్షకులకు అనసూయ పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇంట్లో సాంగ్స్, తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ ఆడియన్స్ను ఆకట్టుకుంది. మరోవైపు తన డ్రెస్సింగ్ స్టైల్ తోను ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంది. ఇక కొన్నాళ్లు టెలివిజన్ షోస్కు దూరంగా ఉన్న అనసూయ మళ్లీ ఇప్పుడు కొత్త షో ద్వారా ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే తాజాగా ఒక వేదికపై అనసూయతో బిగ్ బాస్ నటుడు ప్రవర్తించిన తీరు అందరిని షాక్ కు గురి చేసింది.
మళ్లీ బుల్లితెరకు రీఎంట్రీ..
జబర్దస్త్ యాంకర్ గా అనసూయ భరద్వాజ్ తన కెరియర్ను ప్రారంభించింది. అంతకుముందు సినిమాలు అవకాశాల కోసం ప్రయత్నించింది. కానీ పెద్దగా ఆఫర్లు అందుకోలేకపోయింది. ఓ ఛానల్లో న్యూస్ రీడర్ గాను అనసూయ పనిచేసింది. ఎట్టకేలకు జబర్దస్త్ కామెడీ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ గా పరిచయమైంది. అప్పటినుంచి అంతకంతకు తన క్రేజ్ పెంచుకుంటూ పోయింది. తక్కువ సమయంలోనే స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. టెలివిజన్ రంగంలో తనకంటూ స్పెషల్ క్రేజ్ ను సొంతం చేసుకుంది.

ఇంట్రో డ్యాన్స్ లో అనసూయ షాక్..
జబర్దస్త్ షో నుంచి వెళ్లిపోయిన తర్వాత అనసూయ భరద్వాజ్ కొన్నాళ్లపాటు తెలుగు సినిమాలో కీలక పాత్రలో నటిస్తూ వెండితెరపై మెరిసింది. ఇక ఇటీవల మళ్ళీ తిరిగి రీ ఎంట్రీ ఇచ్చింది. కిర్రాక్ బాయ్స్ ఖిలాడి లేడీస్ సీజన్ 2 గేమ్ షో కు ఫిమేల్ జడ్జిగా ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఈ షోకు సంబంధించిన లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు. అందులో అనసూయ భరద్వాజ్ ఇంట్రడక్షన్ షాట్ లో చాలా ఎనర్జీగా కనిపించారు. ఇదే సమయంలో బిగ్బాస్ నటుడు పృథ్వి కాస్త అత్యుత్సాహం చూపించినట్టుగా కనిపించింది.
బిగ్ బాస్ నటుడు చేసిందీదే..
కిర్రాక్ బాయ్స్ ఖిలాడి లేడీస్ సీజన్ 2 కు సంబంధించిన ప్రోమోలో బిగ్ బాస్ కంటెస్టెంట్ పృద్వి కాస్త అత్యుత్సాహం చూపించారు. అనసూయ భరద్వాజ్ ఫుల్ ఎనర్జీతో డాన్స్ చేయబోతుంటే.. వెనుక నుంచి ఊహించని విధంగా అనసూయ భరద్వాజ్ ను నడుం పట్టుకుని పైకి లేపుతాడు. మా ఇంట్లో సాంగ్ కు అనసూయను పైకి లేపి గాల్లో తిప్పుతాడు. దీంతో ఆ షోలోని కంటెస్టెంట్లు అందరూ షాక్ అవుతారు. అనసూయ కూడా భయపడుతుంది. కానీ కెమెరాలు ఉండడంతో నవ్వుతూ కనిపిస్తుంది. ఆ తర్వాత పృథ్విని ఏంటిదని అందరూ ప్రశ్నిస్తారు. మధ్యలో శ్రీముఖి జోక్యం చేసుకొని సీరియస్ కాకుండా చూసుకుంటుంది. అయితే అది చూపిన కొందరు మాత్రం అనసూయతో అతను అసభ్యంగానే ప్రవర్తించాడని, ఆమె అనుమతి లేకుండా సడెన్ గా ఎలా లిఫ్ట్ చేస్తాడని ప్రశ్నిస్తున్నారు.
ఈరోజు రాత్రి 9 గంటలకు..
ఈ షోకు సంబంధించిన లేటెస్ట్ ఫుల్ ఎపిసోడ్ ఈరోజు రాత్రి 9 గంటలకు స్టార్ మాలో ప్రసారం కానుంది. అలాగే రేపు రాత్రి 9గంటలకు కూడా ప్రసారం అవుతుంది. ప్రతి శని, ఆది వారాల్లో కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ లేడీస్ సీజన్ 2 ప్రసారం అవుతూ వస్తోంది. ఇందులో 8 మంది లేడీ కంటెస్టెంట్లు, 8 మంది మేల్ కంటెస్టెంట్లు పార్టిసీపేట్ చేస్తున్నారు. మొదటి సీజన్ లో కిర్రాక్ బాయ్స్ టీమ్ టైటిల్ ను గెలుచుకుంది. ఈసారి లేడీస్ టీమ్ బాగా పెర్ఫామ్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











