అలీతో అనసూయ, వీడియో వైరల్.. ఈ రోజు డ్రైఫ్రూట్స్ ఇవ్వలేదేంటి!
Recommended Video

కమెడియన్ అలీ ఎక్కడున్నా అక్కడ కామెడీ పంచులు పేలుతుంటాయి. అలీ ఉన్న చోట వాతావరణం చాలా సందడిగా ఉంటుంది. తనదైన శైలిలో కామెడీ చేస్తూ అందరిని ఉషారెత్తించడం అలికి వెన్నతో పెట్టిన విద్య. ఇలా కామెడీ చేసే సందర్భాల్లో కొన్నిసార్లు అదుపు తప్పి విమర్శలపాలైన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా యాంకర్ అనసూయ, అలీ మధ్య సరదాగా జరిగిన సంభాషణకు సంబందించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

డ్రామా జూనియర్స్ సెట్‌లో
డ్రామా జూనియర్స్ షో షూటింగ్ జరుగుతున్న సమయంలో అలీ, అనసూయ మధ్య సరదా సంభాషణ చోటు చేసుకున్నాయి. షూటింగ్ గ్యాప్ లో అనసూయ సెల్ఫీ వీడియో చేస్తూ అలీతో ముచ్చటించింది. హాయ్ అలీ గారూ.. ఏంటి ఇంత స్మార్ట్ గా ఉన్నారు అని అడిగింది. మీరు అంత అందంగా ఉండడం వలన మీ పక్కనే ఉన్న పిలక జుట్టు వేసుకున్న ఉన్న నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అంటూ సరదాగా వ్యాఖ్యానించింది.

ఓపెన్ హార్ట్
ఇప్పటికి ఇంత అందంగా ఉంటున్నారు. సీక్రెట్ ఏంటి అని అడిగింది. ఇందులో సీక్రెట్ అంటూ ఏమీ లేదు. నేను ఎప్పుడూ ఓపెన్ హార్ట్ తో ఉంటాను అని అలీ తెలిపాడు. మీరెప్పుడూ ఓపెన్ హార్ట్ తో ఉంటారనే విషయం నాక్కూడా తెలుసు. మీతో ఉన్నప్పుడు అలాగే అనిపిస్తుంది అని అలీ మంచితనం గురించి అనసూయ తెలిపింది.

డ్రైఫ్రూట్స్ ఇవ్వలేదేంటి
ఈ రోజు నాకు డ్రైఫ్రూట్స్ ఇవ్వలేదేంటి అని అనసూయ అడగగా.. తీసుకురాలేదు.. మరచిపోయి అని అలీ సమాధానం ఇచ్చాడు. అయ్యో ఈ రోజు ఇద్దరం మిస్సవుతున్నామే.. అయితే బన్ తిందాం అని అలీతో తెలిపింది. వీడియో చివర్లో ఇది డ్రామా జూనియర్స్ సెట్స్ లో ఫన్ అని అనసూయ తెలిపింది. అనసూయ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. కొన్ని సార్లు అనసూయ పెట్టె పోస్టులు వివాదం అవుతుండడంతో నెటిజన్ల నుంచి ట్రోలింగ్ ఎదుర్కొంటోంది.

విమర్శలు ఎదుర్కొంటూ
పలు ఈవెంట్స్ లో అలీ చేసిన ప్రసంగాలు ఇప్పటికే ఎంత రచ్చ చేశాయో అందరికి తెలిసిందే. కొన్నిరోజుల క్రితం లవర్స్ డే ప్రీరిలీజ్ ఈవెంట్ లో అలీ యాంకర్ సుమతో చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. రాజీవ్ కనకాల గురించి అలీ డబుల్ మీనింగ్ తో చేసిన వ్యాఖ్యలపై పెద్ద వివాదమే సాగింది.


Click it and Unblock the Notifications











