హాట్ యాంకర్ అనసూయకు అవమానం..? క్షమాపణలు కోరుతూ

తన హాలిడే ట్రిప్‌లో భాగంగా హాట్ యాంకర్‌ అనసూయకి ఊహించని చేదు అనుభవం ఎదురైందని తెలుస్తోంది. సోషల్ మీడియాలో హీరోయిన్ల కంటే ఎక్కువ ఆక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను నెటిజన్ల ముందుంచడం అనసూయ స్టైల్. అది మంచైనా, చెడు అయినా, లేక చెడు అనుభవమైనా? ఏదైనా కూడా ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకొని భారం దించేసుకుంటుంది అనసూయ. ఈ నేపథ్యంలో ఆమె చేసిన తాజా ట్వీట్ పలు అనుమానాలకు తావిస్తోంది.

ఎండలు మండుతుండటంతో చల్లగా సేద తీరేందుకు గాను తన కుటుంబంతో కలిసి ఇటీవలే వెకేషన్ ట్రిప్ కి వెళ్ళింది అనసూయ. జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలోని గుల్మార్గ్ ప్రాంతంలో గల మంచు కొండల్లో హాయిగా విహరిస్తోంది. ఈ మేరకు అందుకు సంబందించిన ఫోటోలు ఎప్పటికప్పుడు ట్విట్టర్ లో పోస్ట్ చేస్తోంది. అయితే ఈ మధ్యలో తాజాగా తాను విమానయాన సంస్థ స్పైస్ జెట్ నుంచి క్షమాపణలు కోరుతున్నట్లుగా అనసూయ చేసిన ఓ ట్వీట్ చూసి ఆశ్చర్యపోయారంతా. 'స్పైస్ జెట్ సారీ కోసం ఎదురుచూస్తున్నా' అంటూ ఆమె ట్వీట్ చేయడం వెనుక ఆంతర్యం ఏమై ఉంటుందా అనే అనుమానాలు మొదలయ్యాయి.

Anasuya faces unfortunate activity in her holiday trip. She wants sorry from Spice jet.

కాగా అనసూయ చేసిన ట్వీట్ పై స్పైస్ జెట్ సంస్థ కూడా స్పందించింది. అసలేం జరిగిందనే దానిపై పూర్తి సమాచారం మాకు ఇవ్వండి అంటూ రియాక్ట్ అయింది. ప్రస్తుతం ఈ ఇష్యు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అనసూయకు స్పైస్ జెట్ కలిగించిన ఇబ్బంది ఏంటా? అని ఆలోచిస్తున్నారంతా. వేసవి సెలవులకని వెళ్లిన అనసూయకు స్పైస్‌జెట్ సర్వీసుల్లో ఏదో ఇబ్బంది కలిగి ఉండొచ్చని, అందుకే ఆమె క్షమాపణలు కోరుతుందని కొందరి వాదన. ఇటీవలే రంగస్థలంలో రంగమ్మత్తగా ఆకట్టుకున్న అనసూయ ఆ తర్వాత వరుస సినిమాలకు కమిట్ అవుతోంది. ఈమె ప్రధాన పాత్రలో కథనం చిత్రం రూపుదిద్దుకుంది. ఈ సినిమా విడుదల తేదీ ఖరారు కావాల్సి ఉంది. మహేష్ 26 లో కూడా అనసూయ కీలక పాత్రలో కనిపించనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X