ఆ మాట అనడంతో హర్ట్.. హైపర్ ఆదిని చితకబాదిన అనసూయ.. హీటెక్కిన వ్యవహారం
హైపర్ ఆది, అనసూయ కాంబోకి బుల్లితెరపై ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. జబర్దస్త్ షోలో హైపర్ ఆది అనసూయ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవుతూఉంటుంది. మధ్య మధ్యలో పండుగకు వచ్చే స్పెషల్ ఈవెంట్లలోనూ రచ్చ చేస్తుంటారు. అయితే హైపర్ ఆది మాత్రం ప్రతీసారి తన స్కిట్‌లో అనసూయపై స్పెషల్ ఫోకస్ పెడుతుంటాడు. అనసూయ అయినా పంచ్‌లు వేయాలి లేదా అనసూయ మీదైనా పంచ్‌లు వేయాలి.

సరసాలు ఆడుతూ..
ఆ మధ్య అనసూయ హైపర్ ఆది వ్యవహారం కూడా కాస్త తేడా కొడుతుండేది. స్కిట్లలో డబుల్ మీనింగ్ డైలాగ్‌లు శ్రుతి మించేవి. అనసూయతో హైపర్ ఆది సరసాలు ఆడేవాడు. మధ్యలో అనసూయ భర్తను కూడా తీసుకొచ్చేవాడు. అలా ప్రతీసారి అనసూయ తన స్కిట్లలో ఆది బాగానే వాడేస్తుంటాడు.

తాజాగా అలా..
వచ్చే వారానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. హైపర్ ఆది అనసూయలు భార్యభర్తలుగా నటించినట్టున్నారు. ఈ క్రమంలో అనసూయ మాట్లాడుతూ... 'నానమ్మ తాతయ్య ఖాళీగా ఉన్నారట.. ఓ మనవడ్ని ఇస్తే ఆడుకుంటామని అంటున్నారు' అంటూ రెచ్చిపోయింది.

అందుకోసమేనా?
ఇక హైపర్ ఆది తానేమీ తక్కువ తినలేదన్నట్టుగా.. 'వాళ్లు ఖాళీగా ఉంటే వాళ్లనే ఓ కొడుకుని కనమను.. మనకి అంత సీన్ లేదని చెప్పండి' అంటూ అనసూయకు కౌంటర్ వేశాడు. మళ్లీ అందుకుని ఈ మధ్య పైన పటారం అనే పాట చేశావ్ అది నన్ను ఉద్దేశించేనా? అని మరో సెటైర్ వేస్తాడు.

ఆ మాట అనడంతో..
నన్ను చూస్తే ఏమనిపిస్తుంది? అని అనసూయను ఆది అడగడంతో.. ఉప్పెన స్టైల్లో అనసూయ సిగ్గు పడుతూ.. ఎప్పటికీ ముసలోడు కాకూడదు అని డైలాగ్ కొట్టేసింది. నుమ్ మాత్రం ముసలిదానివి అయిపోవచ్చు.. నేను మాత్రం అవ్వకూడదా? అంటూ ఆది దిమ్మతిరిగే పంచ్ వేశాడు.

చితకబాదిన అనసూయ..
దీంతో వయసు గురించి అలా అనడంతో.. నన్ను అంత మాట అంటావా అంటూ ఆదిని స్టేజ్ మీదే చితకబాదేసింది. మొత్తానికి ఇలా ఈ ఇద్దరి వ్యవహారం ఆన్ స్క్రీన్ మీద హాట్ టాపిక్ అవుతోంది. హైపర్ ఆది, అనసూయ కలిసి స్కిట్ వేసిన ప్రతీ సారి కూడా ఏదో ఒకటి వైరల్ అవుతుంటుంది.


Click it and Unblock the Notifications











