Just In
- 47 min ago
నా ఫస్ట్ లవ్ నా హార్ట్ బ్రేక్.. అన్ని విషయాలు ఒకరికే తెలుసు.. గుట్టువిప్పిన సమంత
- 53 min ago
Check 2nd day collections: నితిన్ మూవీ పరిస్థితి ఏమిటి? లాభాల్లోకి రావాలంటే..
- 1 hr ago
అమితాబ్‌కు మరోసారి సర్జరీ.. ఆందోళనలో ఫ్యాన్స్
- 1 hr ago
మరోసారి మీ పాదాలను తాకాలని ఉంది.. ఎస్పీబీని తలుచుకుంటూ సునీత ఎమోషనల్
Don't Miss!
- Sports
ప్చ్.. ఈసారి కూడా హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు లేవు!
- News
ఇస్రో నయా రికార్డ్: ఇక కమర్షియల్ రూట్: అమేజాన్-1 కక్ష్యలోకి
- Finance
అమెరికాకు భారీగా అప్పులు, చైనా, జపాన్ నుండే ఎక్కువ: భారత్‌కు ఎంత చెల్లించాలంటే
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
శృతిమించిన హైపర్ ఆది.. హీరోయిన్‌తో రొమాన్స్.. అనసూయ ఫైర్
బుల్లితెరపై జబర్దస్త్ సృష్టించే సంచలనాలు అన్నీ ఇన్నీ కాదు. చిన్న వారి నుంచి పండు ముసలోళ్ల వరకు జబర్దస్త్ షోకు మరీ ముఖ్యంగా హైపర్ ఆది పంచ్‌లకు ఫ్యాన్స్ ఉంటారు. ఈ మధ్య హైపర్ ఆది ఒక్కో సెలెబ్రిటీని పట్టుకొచ్చి స్పెషల్ ట్రీట్ ఇస్తున్నాడు. ఫేడవుట్ అయిన భామలు, ఫామ్‌లో ఉన్న యాంకర్లు ఇలా, సీనియర్ ఆర్టిస్ట్‌లను ఇలా ఎవ్వరిని పడితే వారిని దింపుతున్నాడు. అయితే యంగ్ భామలు వచ్చినప్పుడు ఆది చేసే రొమాన్స్ మాత్రం శృతిమించితోంది.
ఈవారం మంజూషాను..
ఒకప్పటి యాంకర్స్‌లో మంజూషానే మోస్ట్ గ్లామరస్. ఇప్పటికీ అడపాదడపా సక్సెస్ ఈవెంట్స్ చేస్తూ బిజీగానే గడిపేస్తోంది. తాజాగా ప్రసారమైన జబర్దస్త్‌లో షోలో మంజూషాను దింపి.. ఆమె నోటితో బావా అనిపించేశాడు. ఇలా తన మనసులోని కోరికను చెబుతున్నాడో.. స్కిట్‌లో భాగంగా చేస్తున్నాడో కానీ హైపర్ ఆది మాత్రం ఇలా ఎవరో ఒకర్నీ తీసుకొచ్చి ఊపేస్తున్నాడు.

తాజాగా మాదవీలతా..
నచ్చావులే సినిమాతో పరిచయం అయిన మాధవీలతా.. మళ్లీ ఆ రేంజ్ సక్సెస్‌ను అందుకోలేకపోయింది. నానితో చేసిన స్నేహితుడా సినిమానూ నటించింది. అయితే అది కూడా ఫ్లాప్ కావడంతో పెద్దగా కెరీర్‌కు యూజ్ కాలేదు. ఆ తర్వాత రాజకీయాలు అంటూ బీజేపీలోకి వెళ్లిపోయింది. మీటూలో ఆరోపణలు చేయడం, రాజకీయాల్లోకి వెళ్లడంతో దాదాపు సినీ ఇండస్ట్రీకి దూరంగానే ఉంటోంది.
జబర్దస్త్‌లో ఎంట్రీ..
వచ్చే వారం ప్రసారం కానున్న షోలో హైపర్ ఆది స్కిట్‌లో మాధవీలతా మెరవనుంది. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ప్రోమోలో హైపర్ ఆది, మాధవీలతతో బాగానే రొమాన్స్ చేసినట్టు తెగ ఆడిపాడాడు.

అనసూయ ఫైర్..
హైపర్ ఆది రొమాన్స్‌తో రెచ్చిపోతోంటే.. అనసూయ కోపంగా ఉన్నట్టు చూపించారు. ఇక చాలు అంటూ కాస్త గట్టిగానే అరిచింది. ఆమెను పట్టుకోనివ్వదు.. వేరే వారిని పట్టుకుంటే ఉండనివ్వదు అంటూ హైపర్ ఆది కౌంటర్ వేయగా.. ఇక్కడేదో కాలుతున్న వాసన వస్తుందే అంటూ అనసూయపై రోజా సెటైర్ వేసింది.