భర్తతో ముందే ఒప్పందం.. అందుకే బుల్లితెరపై అనసూయ హంగామా

టెలివిజన్ రంగంలో అనసూయ భరద్వాజ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. తన అందం, అభినయం, టాలెంట్ తో బుల్లితెరపై చెరగని ముద్ర వేసుకుంది. తెలుగు టీవీ పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా అనసూయ భరద్వాజ్ కు 'జబర్దస్త్' కామెడీ షోతో మంచి గుర్తింపు వచ్చింది. ఈ కామెడీ షోకు యాంకర్ గా వ్యవహరించి తన సత్తా చాటుకుంది. అతి తక్కువ సమయంలోనే బుల్లితెర ఆడియెన్స్ ను తనవైపునకు తిప్పుకుంది. యాంకర్ గా తనకున్న నైపుణ్యంతో లక్షలాది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం బుల్లితెర ను వీడి వెండితెరపై విభిన్న పాత్రలతో అలరిస్తోంది. అయితే అనసూయ భరద్వాజ్ టెలివిజన్ రంగంలో అడుగు పెట్టే ముందు తన భర్తతో జరిగిన ఓ సంభాషణను తాజా ఇంటర్వ్యూలో వెల్లడింది.

అనసూయ భరద్వాజ్ గురించి..
బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు అనసూయ భరద్వాజ్. 1985 మే 15న వైజాగ్ లో పుట్టి. అక్కడే ఎంబీఏ కూడా పూర్తి చేసుకుంది. ఆ తర్వాత టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. తొలుత ప్రముఖ ఛానెల్ లో న్యూస్ రీడర్ గా పనిచేసింది. అలా మొదలైన అనసూయ కెరీయర్ 'జబర్దస్త్' కామెడీషోతో మలుపు తిరిగింది. అంతకు ముందే 2003లో జూనియర్ ఎన్టీఆర్ 'నాగ' చిత్రంలో న్యాయ విద్యార్థిని పాత్రలో ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత పెద్దగా సినిమా అవకాశాలేమీ రాలేదు. 2013లో జబర్దస్త్ యాంకర్ గా ఎంపికై టెలివిజన్ రంగంలో సంచలనంగా మారింది.

Anasuya got Permission from her husband

అనసూయపై వచ్చిన ఫిర్యాదులు..
టెలివిజన్ రంగంలో జబర్దస్త్ యాంకర్ గా అనసూయ భరద్వాజ్ సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆమె ముఖ్యంగా తన వస్ర్తధారణ, ఇంట్రో సాంగ్స్ తో క్రేజ్ పొందింది. ఇదే సమయంలో ట్రోల్స్ ను కూడా ఎదుర్కొంది. అప్పటికే పెళ్లైన అనసూయ భరద్వాజ్ ఇలాంటి దుస్తుల్లో కనిపించడం ఏంటనీ, తీరు మార్చుకోవాలని, వారి ఇంట్లో వారు ఆమెను ఏం అనడం లేదా? అని కొన్ని ప్రశ్నలు సోషల్ మీడియా నుంచి ఉత్ప్నమయ్యాయి. అయితే వాటన్నింటికి అనసూయ ఎప్పటికప్పుడు ధీటుగా బదులిస్తూనే వస్తోంది. ఎవరెన్ని రకాలుగా తనను వెనక్కి లాగే ప్రయత్నం చేసినా తన లక్ష్యం వైపునకు దూసుకెళ్తూనే ఉంది. అయితే తాజా ఇంటర్వ్యూలో మరోసారి తన కుటుంబం ఎంతలా సహకరిస్తుందో చెప్పుకొచ్చింది.

15 ఏళ్ల సమయం అడిగాను..
టెలివిజన్ రంగంలో కాస్తో కూస్తో తనకున్న నైపుణ్యంతో సంపాదించుకునేందుకు తన భర్త నుంచి ముందే అనుమతి తీసుకున్నానని అనసూయ చెప్పుకొచ్చింది. ఇంట్లో భార్యగా, కోడలిగా, తల్లిగా, ఒక మహిళగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉన్నానని చెప్పింది. అందుకే తన కుటుంబం మొత్తం తన వృత్తికి ఎంతో సహకరిస్తారని చెప్పింది. ఇక తన భర్త సుశాంక్ భరద్వాజ్ తో ముందే అనుమతి తీసుకొని టెలివిజన్ రంగంలో అడుగు పెట్టినట్టు చెప్పుకొచ్చింది. 15 ఏళ్ల వరకు తనకు కెరీయర్ ఉంటుందని ముందే పర్మిషన్ తీసుకున్నానని చెప్పింది. ఇక ఒక మహిళా అనసూయ టెలివిజన్ రంగంలో ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎదగడం పట్ల పలువురు సినీ ప్రముఖులు, తెలుగు ఆడియెన్స్ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

అనసూయ భరద్వాజ్ కు గుర్తింపు తెచ్చిన సినిమాలు..
ఓవైపు యాంకర్ గా బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసి.. మరోవైపు వెండితెరపైనా కూడా అలరిస్తూ వస్తోంది. 'క్షణం', 'రంగస్థలం', 'పుష్ఫ', 'ఖిలాడీ' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. చివరిగా పుష్ప 2, రాజాకార్ వంటి చిత్రాల్లో నటించింది. నెక్ట్స్ పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు : పార్ట్ 1' చిత్రంతో అలరించబోతోంది. అలాగే ఫ్లాష్ బ్యాక్, వోల్ఫ్ అనే చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X