హాట్ యాంకర్ అనసూయ, గంటకు రూ.1 లక్ష?

చలాకీ తనం, వాక్ చాతుర్యం మాత్రమే కాదు...సెక్సీగా మత్తెక్కించే అందం ఆమె సొంతం. ఆమె వేసే మోడ్రన్, చిట్టిపొట్టి కురచ దుస్తువులు ఆమె సెక్సీ ఆటిట్యూడ్‌కు మరింత వన్నెతుస్తుంటాయి. దీంతో ఈవెంట్ ఆర్గనైజర్లంతా ఆమెతో యాంకరింగ్ చేయించడానికే మెగ్గు చూపుతున్నారు.
ఇదే అదునుగా తన రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిందట అనసూయ. సినిమా ఫంక్షన్లు, ఇతర ఈవెంట్లకు యాంకరింగ్ చేయడానికి గంటకు రూ. లక్ష చొప్పున వసూలు చేస్తోందట. పలువురు ఈవెంట్ ఆర్గనైజర్లు కూడా ఆమె అడిగిన మొత్తం ముట్టజెప్పడానికి ఏమాత్రం వెనకాడటం లేదని ఫిల్మ్ నగర్ టాక్. సాధారణంగా ఇతర యాంకర్లు గంటకు రూ. 30 నుంచి 50 వరకు చార్జ్ చేస్తున్నట్లు సమాచారం.
మరో వైపు తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడానికి సోషల్ నెట్వర్కింగ్ అకౌంట్ కూడా మెయింటేన్ చేస్తోంది అనసూయ. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవాలనే లక్ష్యంతోనే అనసూయ ముందుకు సాగుతోందని, ప్రస్తుతం ఆమె ఐటం సాంగుల అవకాశాల కోసం ఎదురు చూస్తోందని ఫిల్మ్ నగర్ టాక్.


Click it and Unblock the Notifications











