జబర్దస్త్ నుంచి యాంకర్ అనసూయ తప్పుకుందా? అసలు నిజం ఇదే!
తెలుగు టెలివిజన్ రంగంలో పాపులర్ అయిన జబర్దస్త్ షో పేరు వినగానే కడుపుబ్బా నవ్వించే కామెడీ స్కిట్లు మాత్రమే కాదు... యాంకర్ అనసూయ గ్లామర్ సైతం కళ్ల ముందు మెదలుతుంది. జబర్దస్త్ ఇంత పెద్ద హిట్టవ్వడంలో అనసూయ అందం, ఆమె చేసే చలాకీ యాకరింగ్ పాత్ర కూడా ఎంతో కొంత ఉందని చెప్పక తప్పదు.
గత ఐదేళ్లుగా అనసూయ 'జబర్దస్త్ కామెడీ షో' హోస్ట్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతో ఎంతో పాటు మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. సినిమా అవకాశాలు వస్తున్నప్పటికీ ఆమె 'జబర్దస్త్'ను వదిలిపెట్టలేదు.

జబర్దస్త్ షో నుంచి అనసూయ తప్పకున్నట్లు ప్రచారం
రెండు వారాలుగా అనసూయ జబర్దస్త్ షోలో కనిపించక పోవడంతో ఆమె ఈ కార్యక్రమానికి గుడ్ బై చెప్పినట్లు ప్రచారం మొదలైంది. అయితే ఇందులో వాస్తవం లేదు అంటున్నారు షో నిర్వాహకులు.

అసలు నిజం ఇదే
కొన్ని అనివార్య కారణాల వల్ల అనసూయ రెండు వారాలు ఈ షో హోస్ట్ చేయలేని పరిస్థితి నెలకొంది. అందుకే ఆమె స్థానంలో వర్షిణి హోస్ట్‌గా వచ్చిందట.

అనసూయ నుంచి ఎలాంటి ప్రకటన లేదు
జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకున్నట్లు అనసూయ నుంచి ఎలాంటి అఫీషియల్ ప్రకటన ఇప్పటి వరకు రాలేదు. ఓ వైపు షోలో ఆమె కనిపించక పోవడం, బయట రకరకాల పుకార్లు వినిపిస్తుండటంతో ఆమె అభిమానులు అయోమయంలో పడ్డారు.
అనసూయ ‘జబర్దస్త్' చివరి పోస్ట్ ఇదే...
అనసూయ తన టీవీ షోలకు సంబంధించిన ప్రతి ఎపిసోడ్లోనూ సరికొత్త డిజైన్ డ్రెస్సు ధరించి దర్శనమిస్తుంటారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, ఏ షోలో వాటిని ధరించాను అనే విషయాలు సైతం సోషల్ మీడియా పేజీ ద్వారా అభిమానులకు తెలియజేస్తారు. నవంబర్ 8 తర్వాత జబర్దస్త్ షోకు సంబంధించిన అప్డేట్ అనసూయ నుంచి రాక పోవడం కూడా ఆమె ఈ కామెడీ షోకు దూరం అయ్యారనే వార్తలకు బలం చేకూరుస్తోంది.

అనసూయ బిజీ బిజీ
అనసూయ ప్రస్తుతం ‘రంగస్థలం ది డాన్స్ వార్' అనే టీవీ షో హోస్ట్ చేస్తుండటంతో పాటు... యాత్ర, సచ్చిందిరా గొర్రె, కథనం అనే చిత్రాల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











