For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇంతమంది బుర్రలేని వాళ్లా.. వెధవ.. వేళ్లు నొప్పేస్తున్నాయి.. అనసూయ ఫైర్

  |

  ప్రాణాంతక కరోనావైరస్ కారణంగా అన్ని రంగాలు మూతపడిపోతున్నాయి. సినీ, టెలివిజన్ రంగాలపై కూడా ఎఫెక్ట్ పడింది. దాంతో సీరియల్స్ ప్రసారాలు, షూటింగులను నిలిపివేస్తూ పలు సంఘాలు నిర్ణయం తీసుకొన్నాయి. ప్రభుత్వ సూచనలతో షూటింగ్‌లను వాయిదా వేయడంతో కార్మికులు, కళకారులకు కష్టాలు వచ్చి పడ్డాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో అనసూయ చేసిన కామెంట్లపై నెటిజన్లు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇంతకు అనసూయ చేసిన కామెంట్లు ఏమిటంటే..

  మీపై గౌరవం ఉంది.. కానీ

  మీపై గౌరవం ఉంది.. కానీ

  షూటింగ్‌లు నిలిపివేయడంపై మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి అనసూయ ట్వీట్ చేస్తూ.. సార్ మీరున్నా.. ప్రభుత్వమన్నా గౌరవం ఉంది. ప్రభుత్వ, ప్రజల ప్రయోజనాలకు కట్టుబడి ఉంటాం. కానీ నెలసరి ఆదాయంపై ఆధారపడి ఉన్న మాకు ఇబ్బందిగా ఉంది. ప్రతీ నెల అద్దె, కరెంట్ బిల్లులు, ఇతర ఈఎంఐలు చెల్లించాలి. కాబట్టి మా పరిస్థితిని అర్ధం చేసుకొని మాకు వెసలుబాటు కల్పించండి అంటూ అనసూయ భరద్వాజ్ ట్వీట్ చేశారు.

  మీకు ట్వీట్ ఎలా పెట్టాలని ఉంది..

  మీకు ట్వీట్ ఎలా పెట్టాలని ఉంది..

  అయితే అనసూయ ట్వీట్‌పై నెటిజన్లు రియాక్ట్ అవుతూ.. అలాంటి ట్వీట్ మీకు ఎలా పెట్టాలని అనిపించింది అంటూ ప్రశ్నించాడు. ఒక వారం వర్క్ లేదు అంటే.. ఒక నెల గడవడానికి కష్టంగా ఉందంటే మేము నమ్మలేం అంటూ ప్రశ్నించాడు. దానికి అనసూయ సమాధానం ఇస్తూ.. నమ్మాలండి.. 10 రోజుల్లో నెలన్నరకు సరిపడే షూట్ చేస్తాం. అవన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. అలాంటి పరిస్థితిని మీరే అర్ధం చేసుకోండి అంటూ అనసూయ రిప్లై ఇచ్చింది.

  మీ వద్ద బ్యాంక్ బ్యాలెన్స్ లేదంటే నమ్మం

  మీ వద్ద బ్యాంక్ బ్యాలెన్స్ లేదంటే నమ్మం

  పది రోజులు పని లేకపోతే కష్టాలంటే నమ్మడం కష్టం. మీ వద్ద, మీ భర్త వద్ద బ్యాంక్ బ్యాలెన్స్ లేదంటే మేము నమ్మలేం. మీ మాటలు చూస్తే మాకు జాలిగా ఉంది అని మరో నెటిజన్ ప్రశ్నించాడు. దానికి సమాధానం ఇస్తూ.. 10 రోజుల్లో కరోనావైరస్ తగ్గుముఖం పడుతుందని గ్యారెంటీ ఇస్తారా? అని అనసూయ ఎదురు ప్రశ్న వేశారు.

  ఇంతమంది బుర్రలేని వాళ్లా

  ఇంతమంది బుర్రలేని వాళ్లా

  అనసూయ ట్వీట్ల రిప్లైలపై అనేక మంది స్పందించడంతో ఆమె కొంత అసహనానికి గురయ్యారు. ఏంటీ ఇంత మంది బుర్రలేని వాళ్లా? ఇంత మంది వితండవాదులా? మనకు అని నేను పోస్టు పెడితే.. నాకు అనేసుకొని ఏదో మాట్లాడుతున్నారు. సెన్స్ అనేది ఉంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదుగా. నేను భయపడుతున్నది రాబోయే రోజుల్లో పరిస్థితి గురించి అని అనసూయ తన ట్వీట్‌లో పేర్కొన్నది.

  Anchor Anasuya Bharadwaj Strong Warning || మర్యాదగా కామెంట్స్ డిలీట్ చెయ్యండి..!
  వెధవ అకౌంట్లు అంటూ..

  వెధవ అకౌంట్లు అంటూ..

  ఇక తనపై ట్వీట్ల దాడి చేసిన కొందర్ని అనసూయ అన్‌ఫాలో చేసింది. నిన్నట్నుంచి ట్విట్టర్‌లో వెధవ అకౌంట్లు బ్లాక్ చేసి చేసి వేళ్లు నొప్పేస్తన్నాయంటే నమ్మండి. తప్పదు కదా.. నా పేజ్‌లో వాళ్ల బుర్రలేని తనం ఏమిటి; నాకు ప్రశాంతత, బాధ్యతగా ఉండే ఫాలోవర్స్ కావాలి అని అనసూయ ట్వీట్‌లో పేర్కొన్నారు.

  English summary
  Anchor Anasuya serious over Netizens in twitter on coronavirus issue. She tweeted to KTR that Sir..with due respect & will to abide by the Govt..just to throw light..considering some professions..if we can’t go to work..we don’t make our incomes..but we have to bear monthly mandatory expenses like house rent, power bills,EMIs etc..request you to consider such situations🙏🏻
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X