ఆ స్క్రీన్ షాట్స్ ఉన్నాయ్.. అందర్నీ గమనిస్తున్నా.. ఏ ఒక్కరినీ వదిలిపెట్టనంటోన్న అనసూయ
అనసూయ అంటేనే వివాదం.. వివాదాలంటేనే అనసూయ. అనసూయ మాట్లాడినా, కామెంట్ చేసినా, కనబడినా వివాదంగానే మారుతుంది. సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్‌కు గురయ్యే టాలీవుడ్ సెలెబ్రిటీ ఎవరయ్యా అని అంటే అది కేవలం అనసూయనే. అనసూయకు సరిసమానంగా రష్మీపై నెగెటివ్ కామెంట్స్ వచ్చినా.. అనసూయనే ఎక్కువ మొత్తంలో ఫోకస్ అవుతుంది. తాజాగా తనపై వచ్చే ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్స్, వాటి వల్ల కలిగిన దుష్పరిణామాలు, తీసుకున్న చర్యలన్నింటినీ వివరించింది.

తాజాగా ఓ షోలో..
అనసూయ తాజాగా అలీతో సరదాగా షోలో అతిథిగా విచ్చేసింది. అనసూయ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, బాధలు, కన్నీళ్ల గురించి తెలిపింది. ట్రోలింగ్ వల్ల ఎంత క్షోభపడిందో చెబుతూ కన్నీరు పెట్టుకుంది. ఇదే సందర్భంగా ట్రోలర్స్‌కు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది.

అలా మొదలైంది..
అత్తారింటికి దారేది సినిమాలోని ఇట్స్ టైం టు పార్టీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆ పాట రిలీజ్ అయ్యాక.. ఆ సాంగ్ చేయకపోవడం మంచిదైంది.. గుంపులో గోవిందలా అయ్యేది అని పెట్టిన ట్వీట్‌తో తనపై ట్రోలింగ్ మొదలైందని అనసూయ చెప్పుకొచ్చింది.

ట్రోలింగ్ వల్ల డిప్రెషన్..
ట్రోలింగ్ వల్ల డిప్రెషన్‌లోకి వెళ్లాను.. ఎన్నో రోజులు ఏడ్చుకుంటూ ఉన్నాను. ఆ సమయంలో మా ఫ్యామిలీ, భర్త అందరూ తోడుగా ఉన్నారు. అందుకే నేను వాటి నుంచి బయటపడ్డాను. ట్రోల్స్ చేసే వారు మా ఆయన్ని, పిల్లలను, ఫ్యామిలీ మెంబర్స్‌ను మధ్యలోకి తీసుకొస్తారు అంటూ అనసూయ కాస్త ఎమోషనల్ అయింది.

ఇప్పుడు అలా కాదు..
కానీ ఇప్పుడు మాత్రం మారిపోయాను. ట్రోలింగ్ విని విని రాటు తేలిపోయాను.. ఇప్పుడు రెబల్‌గా తయారయ్యాను. నేనే ధీటుగా సమాధానం ఇస్తున్నాను అంటూ అనసూయ చెప్పుకొచ్చింది. ఎంతో సున్నితంగా ఉన్న అనసూయ ట్రోలర్స్ వల్లే ఇలా తయారైందట.
Recommended Video

ఏ ఒక్కరినీ వదిలిపెట్టను..
ట్రోల్స్ చేసే వారంతా కీ బోర్డ్ వారియర్స్.. ఎదురుగా వచ్చి ఒక్కరూ కూడా మాట్లాడరు.. అంత ధైర్యం ఉండదు.. నేను అందర్నీ గమనిస్తున్నా.. ప్రతీ ఒక్కరి స్క్రీన్ షాట్స్, కామెంట్స్ అన్ని ఉన్నాయి.. నా వద్ద ఎఫ్ఐఆర్ పేపర్స్ కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. కోవిడ్ వల్ల వాటిని ముందుకు తీసుకువెళ్లడం లేదు. ప్రతీ ఒక్కరూ మూల్యం చెల్లించాల్సిందే. ఏ ఒక్కర్నీ వదిలిపెట్టను అని అనసూయ వార్నింగ్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











