ప్రతీసారి అడుగుతుంటే ఇబ్బందిగా ఉంది.. ఆ మధురానుభూతి కోసం ఎన్నిసార్లైనా సిద్ధమే.. అనసూయ
Recommended Video
బుల్లితెరపై తన కెరీర్ ప్రారంభించిన హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ బెస్ట్ హోస్ట్‌గా ప్రశంసలందుకుంటూ వెండితెరపై కాలు మోపింది. ఓ బుల్లితెర యాంకర్ వెండితెరపై నిలదొక్కుకోవడం కష్టమే అనుకున్నారంతా. కానీ సినిమా సినిమాకు తన లోని నటనా ప్రతిభను మెరుగుపరుస్తూ ఆశ్చర్యపరుస్తోంది అనసూయ. పెళ్లై ఇద్దరు పిల్లల్లునా కూడా హాట్ హాట్ ఫొటోస్‌తో కవ్వించే ఈ భామ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన సంతానం విషయమై ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

శశాంక్ భరద్వాజ్‌తో వివాహం
1985 మే 15 వ తేదీన జన్మించిన అనసూయ శశాంక్ భరద్వాజ్‌ని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. అయినప్పటికీ యంగ్ లుక్ లో మెరిసిపోతూ పలు సినిమాలు, టీవీ షోస్ ద్వారా ఆకట్టుకుంటోంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన విశేషాలను పంచుకుంటోంది.

అమ్మ కావడమే ఓ మధురానుభూతి
ఈ సృష్టిలో అమ్మ కావడమనేదే ఓ మధురానుభూతి అని అంటోంది అనసూయ. అమ్మయ్యే అదృష్టాన్ని పొందినప్పటికీ తనకు ఇద్దరూ మగపిల్లలే కావడం, ఆడపిల్లకు జన్మనివ్వక పోవడం ఆమెకు వెలితిగా ఉందట. ఈ విషయాన్ని స్వయంగా తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో వెల్లడించింది అనసూయ.

మొదట అబ్బాయే కావాలనిపించింది
మా అమ్మానాన్నలకు మేం ముగ్గురం ఆడపిల్లలమే కావడంతో తనకు మొదటి సంతానం అబ్బాయే కావాలనిపించిందని, అయితే రెండో సారి మాత్రం అమ్మాయి కావాలనుకుంటే మళ్లీ అబ్బాయే పుట్టాడని ఆమె చెప్పుకొచ్చింది. అమ్మ కావడమే ఓ అదృష్టమని, పిల్లలు లేని వారికి ఆ బాదేంటో తెలుస్తుందని అనసూయ పేర్కొంది.

ఎన్నిసార్లైనా సిద్ధమే.. వీలు కుదిరితే కనేస్తా
తాను ఆడపిల్లకు జన్మనిచ్చే వరకు ఎన్నిసార్లైనా తల్లి కావడానికి సిద్దమే అని అనసూయ చెప్పుకురావడం గమనార్హం. బయటకెళ్లిన ప్రతీసారి మీకెంతమంది పిల్లలు అని అడుగుతుంటే ఇద్దరు అబ్బాయిలే అని చెప్పటం కష్టంగా ఉందని, అందుకే పిల్లల్ని కనాలనిపించి వీలు కుదిరితే ఆడపిల్లకు జన్మనివ్వడానికి ట్రై చేస్తానని, అమ్మ కావడమేనే ఓ దీవెన అని అనసూయ తెలిపింది.

అనసూయ
పలు టీవీ షోస్ తో ఆకట్టుకున్న అనసూయ ఇటీవలే రంగస్థలం లో రంగమ్మత్తగా నటించి యాక్టర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే వెంకీ, వరుణ్ తేజ్ ఎఫ్ 2 చిత్రంలో కూడా బెస్ట్ పర్ ఫార్మెన్స్ తో అలరించిన ఈ భామకు వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











