పెళ్లికి ముందే లవర్‌తో అనసూయ.. ఓ రేంజ్‌లో ఎంజాయ్.. ఇంతకీ అతడిని గుర్తుపట్టారా?

ఒకప్పుడు తెలుగు పరిశ్రమలో లోకల్ అమ్మాయిలు పెద్దగా ఉండేవారు కాదు. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం అలాంటి వారి సంఖ్య బాగానే పెరిగిపోయింది. ముఖ్యంగా కొందరు ముద్దుగుమ్మలు తమదైన రీతిలో అలరిస్తూ హైలైట్ అవుతోన్నారు. అందులో అనసూయ భరద్వాజ్ పేరు ముందుగా చెప్పుకోవాలి. అంతలా ఈ అమ్మడు మొదట యాంకర్‌గా, తర్వాత నటిగా తనదైన మార్కును చూపిస్తూ దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ అభిమానులను అలరిస్తోంది. ఇలా తాజాగా అనసూయ భరద్వాజ్ కొన్ని పిక్స్ షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి!

యాంకర్‌గా.. గ్యాప్ ఇచ్చి
అనసూయ భరద్వాజ్ 'జబర్ధస్త్' షోతో ఎంట్రీ ఇచ్చి తనదైన గ్లామర్, హోస్టింగ్‌తో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఆ తర్వాత చాలా కాలం పాటు వరుసగా షోల మీద షోలు చేసి హవాను చూపించింది. అలా ఎన్నో ఏళ్ల పాటు బుల్లితెరపై సత్తా చాటుకుంది. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం అనసూయ టెలివిజన్ రంగానికి, యాంకరింగ్‌కు పూర్తిగా దూరమైపోయింది.

Anchor Anasuya and Her Husband Special Photos Viral In Internet

ఆ సినిమాల్లో సందడిగా
టీవీ రంగంలో చాలా కాలం పాటు సత్తా చాటిన అనసూయ.. ఈ మధ్య కాలంలో మాత్రం దక్షిణాదిలోని చాలా భాషల్లో సినిమాలు చేస్తూ వెళ్తోంది. ఈ క్రమంలోనే గత ఏడాది 'మైఖేల్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే, వరుసగా 'రంగమార్తాండ', 'విమానం', 'పెద కాపు 1', 'ప్రేమ విమానం' వంటి మూవీలలో అదిరిపోయే పాత్రలను చేసి ఆకట్టుకుంది.

ఆ భారీ ప్రాజెక్టులతోనూ
యాంకరింగ్ కంటే సినిమాల ద్వారానే హైలైట్ అయిన అనసూయ భరద్వాజ్.. ఇప్పుడు కూడా తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నటిస్తోంది. ఇలా ప్రస్తుతం ఈ సుందరాంగి 'హరిహర వీరమల్లు', 'పుష్ప 2' వంటి భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. అలాగే, తమిళంలో 'ఫ్లాష్‌బ్యాక్' సహా కొన్ని సినిమాలు చేస్తోంది. ఇలా పలు భాషల చిత్రాలతో తీరిక లేకుండా ఉంటోంది.

Anchor Anasuya and Her Husband Special Photos Viral In Internet

సోషల్ మీడియాలోనూ
ఏమాత్రం ఖాళీ లేకుండా వరుసగా సినిమాలు చేస్తోన్నా.. సోషల్ మీడియాలో అనసూయ భరద్వాజ్ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తన ఫొటోలు, వీడియోలను తన ఖాతాల్లో షేర్ చేస్తోంది. అదే సమయంలో తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలతో పాటు కెరీర్ సంబంధిత విశేషాలను పంచుకుంటూ.. ఫాలోయింగ్‌ను బాగా పెంచుకుంటోంది.

గ్లామర్, రొమాంటిక్‌వి
సోషల్ మీడియాలో అనసూయ భరద్వాజ్ ఎలాంటి రచ్చ చేస్తుందో అందరికీ తెలిసిందే. అంతలా ఈ అమ్మడు నిత్యం హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఫలితంగా సోషల్ మీడియాలో తన గ్లామర్‌తో సంచలనం సృష్టిస్తోంది. ఇక, ఈ మధ్యన అయితే అనసూయ తన ఫ్యామిలీతో టూర్‌కు వెళ్లిన ఫొటోలు వదిలింది. అలాగే, భర్తతో ఉన్న పిక్స్ కూడా షేర్ చేస్తోంది.

Anchor Anasuya and Her Husband Special Photos Viral In Internet

అప్పటి పిక్స్ వైరల్‌గా
అనసూయ భరద్వాజ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె తన మొదటి ప్రియుడు అంటే భర్త సుశాంక్ భరద్వాజ్‌తో కలిసి లవ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించింది. వీటిలో వీళ్లిద్దరూ గుర్తు పట్టలేనట్లుగా ఉన్నారు. దీంతో అనసూయ షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చి ఫుల్ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X