భర్తతో రొమాంటిక్‌గా అనసూయ: డ్రెస్ ఉన్నా లేనట్లే.. ఈ వీడియో చూశారంటే!

సాధారణంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో వేరే ప్రాంతాల భామలే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నారు. తద్వారా ఎన్నో అవకాశాలను దక్కించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొందరు లోకల్ బ్యూటీలు తమదైన రీతిలో సత్తా చాటుతోన్నారు.

అలాంటి వారిలో ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ఒకరు. చాలా ఏళ్లుగా వరుసగా షోలు, సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న ఈ భామ.. పర్సనల్ లైఫ్‌నూ ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా భర్తతో తీసుకున్న వీడియోను అనసూయ షేర్ చేసింది. దాన్ని మీరే చూసేయండి మరి!

Anchor Anasuya and Her Husband Special Video Goes Viral

అప్పుడే సెన్సేషన్‌గా మారి: సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే అనసూయ న్యూస్ ప్రజెంటర్‌గా ఫేమస్ అయింది. ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి కొన్ని షోలు చేసింది. ఈ క్రమంలోనే జబర్ధస్త్‌తో యాంకర్‌గా మారింది. అందులో తనదైన అందం, హోస్టింగ్‌తో అలరించింది. ఫలితంగా చాలా తక్కువ సమయంలోనే అనసూయ భరద్వాజ్ సెన్సేషన్‌గా మారిపోయిందని చెప్పుకోవచ్చు.

Anchor Anasuya and Her Husband Special Video Goes Viral

ఆ సినిమాలతో పాపులర్‌గా: యాంకర్‌గా యమ పాపులర్ అయిన తర్వాత అనసూయ భరద్వాజ్.. 'సోగ్గాడే చిన్ని నాయన'తో సినిమాల్లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. దీని తర్వాత ఆమె వరుసగా 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం', 'థ్యాంక్యూ బ్రదర్', 'ఖిలాడీ', 'పుష్ప' సహా ఎన్నో చిత్రాల్లో అదిరిపోయే పాత్రలతో అలరించింది. తద్వారా మంచి పేరు తెచ్చుకుంది.

Anchor Anasuya and Her Husband Special Video Goes Viral

భారీ ఆఫర్లతో సత్తా చాటేలా: గతంలో షోలు, సినిమాలు చేసిన అనసూయ.. ఈ మధ్య కాలంలో బుల్లితెరకు గ్యాప్ ఇచ్చింది. ఇక, గత ఏడాది ఈ సుందరాంగి 'మైఖేల్', 'రంగమార్తాండ', 'విమానం', 'పెద కాపు 1' అనే సినిమాలతో సందడి చేసింది. కానీ, ఇవేమీ విజయాలను మాత్రం అందుకోలేదు. ఇక, ఇప్పుడు అనసూయ 'పుష్ప 2' సహా ఎన్నో భారీ ప్రాజెక్టులను చేస్తూ బిజీగా గడుపుతోంది.

Anchor Anasuya and Her Husband Special Video Goes Viral

ఈ మధ్య ఫ్యామిలీతో చిల్: చాలా కాలం పాటు ఏమాత్రం బ్రేక్ లేకుండా సినిమాలు చేసిన అనసూయ భరద్వాజ్.. ఇప్పుడు మాత్రం షూటింగ్ లేని సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి చిల్ అవుతూ ఉంటోంది. మరీ ముఖ్యంగా తన భర్త సుశాంక్, పిల్లలతో కలిసి తరచూ ట్రిప్‌లకు చెక్కేస్తుంది. ఇందులో భాగంగానే ఇటీవలే తన హజ్బెండ్‌తో కలిసి అనసూయ పలుమార్లు వెకేషన్‌కు వెళ్లి ఎంజాయ్ చేసింది.

Anchor Anasuya and Her Husband Special Video Goes Viral

అందులో యమ యాక్టివ్: టాలీవుడ్‌లో ఏ హీరోయిన్ చేయని విధంగా వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న అనసూయ భరద్వాజ్.. సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తన ఫొటోలు, వీడియోలను తన ఖాతాల్లో షేర్ చేస్తుంటోంది. అదే సమయంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు కెరీర్ విశేషాలను సైతం పంచుకుంటోంది.

Anchor Anasuya and Her Husband Special Video Goes Viral

గ్లామర్ ట్రీట్‌తో కవ్వింపు: షోలలో చేస్తున్నప్పటి నుంచే స్క్రీన్‌పై తనదైన అందంతో మాయ చేసిన అనసూయ భరద్వాజ్.. సోషల్ మీడియాలోనూ అదే పంథాను ఫాలో అవుతోంది. ఇందులో భాగంగానే ఈ ముద్దుగుమ్మ తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. ఫలితంగా ఇంటర్నెట్‌ను అనసూయ ఊపేస్తోంది. అదే సమయంలో దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయిపోతోంది.

రొమాంటిక్ వీడియో షేర్: ఈ మధ్యన అనసూయ భరద్వాజ్ భర్తతో ఎక్కువ సమయాన్ని గడుపుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఓ ట్రిప్‌కు వెళ్లిన సమయంలో తీసుకున్న రొమాంటిక్ వీడియోను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇందులో అనసూయ బ్యాక్‌లెస్ డ్రెస్‌లో కనిపించింది. అలాగే, భర్తతో రొమాంటిక్‌గా ఫోజులు ఇచ్చింది. దీంతో ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ వచ్చి.. యమా వైరల్‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X