మరోసారి బికినీలో అనసూయ ట్రీట్: భర్తతో ఆ పని చేయాలంటూ!
అనసూయ భరద్వాజ్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ ముద్దుగుమ్మ సుదీర్ఘ కాలంగా అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై తనదైన రీతిలో సందడి చేస్తూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుంటూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటోంది. ఇక, ఖాళీ సమయాల్లో ఫ్యామిలీకే ప్రాధాన్యం ఇస్తోన్న అనసూయ.. ఇటీవలే తన భర్తతో కలిసి ఫారెన్ ట్రిప్‌కు వెళ్లింది. అక్కడ తీసుకున్న ఓ వీడియోను తాజాగా ఆమె షేర్ చేసింది. ఇంతకీ అందులో ఏముందో మీరే చూసేయండి మరి!
యాంకర్‌గా సూపర్ సక్సెస్:ఆరంభంలో ప్రీల్యాన్స్ హోస్టుగా, న్యూస్ ప్రజెంటర్‌గా చేసిన అనసూయ భరద్వాజ్ 'జబర్ధస్త్' కామెడీ షోతో యాంకర్‌గా బుల్లితెరపైకి అడుగు పెట్టింది. ఇందులో గ్లామర్‌తో పాటు అద్భుతమైన హోస్టింగ్‌తో అలరించిన ఆమె.. చాలా తక్కువ సమయంలోనే మంచి పేరును దక్కించుకుంది. తద్వారా ఫాలోయింగ్‌తో పాటు వరుసగా ఆఫర్లను కూడా అందుకుంటూ సత్తా చాటుకుంది.

ఆ సినిమాలతో పాపులర్:యాంకర్‌గా సెన్సేషన్ అయిన అనసూయ.. 'సోగ్గాడే చిన్ని నాయన'తో సినిమాల్లోకి వచ్చింది. ఆ తర్వాత 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం', 'థ్యాంక్యూ బ్రదర్', 'ఖిలాడీ', 'పుష్ప' సహా ఎన్నో చిత్రాల్లో తనదైన పాత్రలతో అలరించింది. అలాగే, కొన్ని మూవీల్లో స్పెషల్ సాంగ్‌లలోనూ మెరిసింది. ఇలా ఇప్పుడు సినిమాలకే పరిమితం అయింది.
ఇప్పడీ చిత్రాలతో బిజీగా:ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతోన్న అనసూయకు అవకాశాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది 'మైఖేల్', 'రంగమార్తాండ', 'విమానం' మూవీలతో వచ్చిన ఈ భామ.. తాజాగా 'పెద కాపు 1' అనే సినిమాతో సందడి చేసింది. వీటితో పాటు 'హరిహర వీరమల్లు', 'పుష్ప 2'తో పాటు వేరే భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది.

ఫ్యామిలీతో ఎక్కువగానే:దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతోన్న అనసూయ భరద్వాజ్.. వీలు చిక్కినప్పుడల్లా కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఫ్యామిలీకి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తుంది. ఇందులో భాగంగానే ఇటీవలే తన భర్త భరద్వాజ్‌తో కలిసి అనసూయ వెకేషన్‌కు బ్యాంకాక్ వెళ్లింది. అక్కడ ఫుల్‌గా చిల్ అయింది.

అందులోనే ఉంటోంది:వరుస పెట్టి సినిమాలు చేస్తూ తీరిక లేకుండా గడుపుతున్నప్పటికీ.. సోషల్ మీడియాలో అనసూయ భరద్వాజ్ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తన ఫొటోలు, వీడియోల తన ఖాతాల్లో షేర్ చేస్తుంటోంది. అదే సమయంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు కెరీర్ సంబంధిత విశేషాలను పంచుకుంటోంది. తద్వారా ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.

అందాలను చూపిస్తూనే:అప్పట్లో కంటే ఇప్పుడు చాలా మంది భామలు సోషల్ మీడియా ద్వారా అందాలను ఆరబోస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అందులో అనసూయ భరద్వాజ్ కూడా ఉందని చెప్పాలి. ఈ బ్యూటీ తరచూ అందాల విందు చేస్తోంది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. ఫలితంగా ఇంటర్నెట్‌ను అనసూయ షేక్ చేసేస్తోంది.
బికినీ వీడియో.. మరోసారి:తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అనసూయ భరద్వాజ్ ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె వైట్ బికినీతో కనిపించింది. అంతేకాదు, పక్కన ఆమె భర్త కూడా ఉన్నాడు. ఇక, ఈ వీడియోకు ఆమె 'మళ్లీ ఆ సమయానికి వెళ్లాలని ఉంది' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. మొత్తానికి ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇది బాగా వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











