For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  HBD Anasuya : ఎన్టీఆర్ సినిమాతో ఎంట్రీ.. వర్మ ఆఫర్ కాదనుకుని మరీ.. రంగమ్మత్తగా మారి జబర్దస్త్‌గా

  |

  అనసూయ భరద్వాజ్ అనే పేరుకు ఏ మాత్రం పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ అనతి కాలంలోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆమె జబర్దస్త్ లో ఎంట్రీ ఇవ్వగా ఆమెకు ఆ షో కేరాఫ్ గా మారిపోయింది. టెలివిజన్ యాంకర్లు అంటే పద్ధతిగానే ఉండక్కర్లేదు హాట్ అండ్ క్యూట్ లుక్స్ తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చని చాటి చెప్పిన ఆమెకు మంచి క్రేజ్ లభించింది. ఈరోజు అనసూయ 36వ పుట్టిన రోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

  Recommended Video

  Anchor Anasuya జబర్దస్త్ క్రేజ్.. చేతినిండా ప్రెస్టీజియస్ సినిమాలు | #HBDAnasuya | Filmibeat Telugu
  ఎన్టీఆర్ సినిమాతో ఎంట్రీ

  ఎన్టీఆర్ సినిమాతో ఎంట్రీ

  యాంకర్ అనసూయ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. తనదైన హాట్ లుక్స్ తో జబర్దస్త్ షోకి ఒక సపరేట్ క్రేజ్ తెచ్చిపెట్టింది ఆమె. కెరీర్ మొదట్లో అది కూడా ఎప్పుడో 2003లో జూ.ఎన్టీఆర్ 'నాగ లో చిన్న పాత్రలో తళుక్కుమన్న అనసూయ, తరువాతి రోజుల్లో అసలు తెరమరుగు అయిపొయింది. అసలు ఆమె మళ్ళీ కం బ్యాక్ ఇస్తుందని, అది కూడా ఈ రేంజ్ లో ఫేమస్ అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు.

  న్యూస్ యాంకర్ గా మొదలు పెట్టి

  న్యూస్ యాంకర్ గా మొదలు పెట్టి

  నాగ లో తళుక్కుమన్న అనసూయ ఎందుకనో నటన మీద ఫోకస్ పెట్టలేదు. చదువుకొని 2008లో ఎంబీఏ పూర్తి చేసి తరువాత సాక్షి టీవీలో యాంకర్ గా కనిపించింది. ఆ సమయంలో రామ్ గోపాల్ వర్మ 'కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పల్రాజు' సినిమా మొదలెట్టారు. ఆ సినిమా ఓపెనింగ్ కు శ్రీదేవి ముఖ్యఅతిథిగా రాగా ఆ ఈవెంట్ కి అనసూయ యాంకర్ గా వ్యవహరించింది. రామ్ గోపాల్ వర్మ అనసూయను చూసి నటిగా అవకాశమిస్తానన్నా అప్పట్లో అనసూయకు సినిమాల్లో నటించే ఉద్దేశం లేక సైలెంట్ అయింది.

  జబర్దస్త్ క్రేజ్

  జబర్దస్త్ క్రేజ్

  తరువాత బుల్లితెరపై పలు కార్యక్రమాల్లో తన వ్యాఖ్యానంతో అలరించిన అనసూయకు 'జబర్దస్త్' మంచిపేరు సంపాదించి పెట్టింది. ఆ తరువాత సినిమాల్లోనూ ఆమెకు అవకాశాలు రావడం మొదలెట్టాయి. నిజానికి ఈ టీవీలో యాంకరింగ్ అంటే పద్ధతిగా చీర కట్టుతో ఒక డ్రెస్ కోడ్ లాంటిది ఉండేది. కానీ మొట్టమొదటిసారి అనసూయ పొట్టి పొట్టి డ్రెస్సులతో కనిపిస్తూ ఎంట్రీ సాంగ్స్ తో అదరగొట్టింది. దెబ్బకు టిఆర్పి రేటింగ్స్ తారాస్థాయికి చేరిపోయాయి.. ఆ దెబ్బకు అనసూయ దాదాపు ఏడెనిమిది ఏళ్లుగా జబర్దస్త్ కి యాంకరింగ్ చేస్తూనే ఉంది.

  రంగమ్మత్తగా మారి

  రంగమ్మత్తగా మారి


  'నాగ' తర్వాత దాదాపు పదమూడేళ్ళకు నాగార్జున సోగ్గాడే చిన్నినాయన లో అనసూయ బుజ్జి అనే నాగార్జున మరదలి పాత్రలో కనిపించింది. ఆ వెంటనే 'క్షణంలో ఏసీపీ పాత్రలో మెప్పించింది. ఇక 'విన్నర్' సినిమాలో ఆమె పేరుతో "సూయ...సూయ... అనసూయ..." సాంగ్ లో కాలు కదిపింది. ఇక ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర దక్కడంతో ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది.

  వరుస అవకాశాలతో బిజీ

  వరుస అవకాశాలతో బిజీ

  ఆ సినిమా తర్వాత ఆమెకు 'కథనం' లాంటి మెయిన్ లీడ్ సబ్జెక్టులు వచ్చినా ఆ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. తాజాగా ఆమె థాంక్యూ బ్రదర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విరాజ్ అశ్విన్, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదల చేశారు. ఇక ప్రస్తుతం అనసూయ చేతి నిండా అవకాశాలతో దూసుకు వెళుతోంది. చిరంజీవి 'ఆచార్య', రవితేజ 'ఖిలాడి', అల్లు అర్జున్ 'పుష్ప', కృష్ణవంశీ 'రంగమార్తాండ' సినిమాలలో ఆమె నటిస్తింది. ఆమె మరిన్ని అవకాశాలతో రాణించాలని ఆమె పుట్టిన రోజు సంధర్భంగా కోరుకుందాం.


  English summary
  Anasuya Bharadwaj is one among the few female anchors in the Telugu TV industry.she became a household name in the Telugu states with her glamour as a TV host-cum-actress. Anasuya Bharadwaj turns 36 today.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X