Anasuya Bharadwaj: మళ్లీ బీచ్‌లో అందాలతో అనసూయ రచ్చ.. విరూపాక్ష హీరోయిన్‌లా చేస్తున్నావంటూ!
యాంకర్ అంటే చలాకీ మాటలతో పాటు కాస్తా గ్లామర్ తో కూడా ఆకట్టుకుంటారు. ఆలాంటి గ్లామరస్ అండ్ బ్యూటిఫుల్ యాంకర్లలో అనసూయ భరద్వాజ్ ఒకరు. బుల్లితెరపై పాపులర్ యాంకర్‌గా వెండితెరపై అద్బుతమైన నటిగా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. యాంకర్ గా షోలలో గ్లామర్ ఒలకబోస్తూనే మరోవైపు వెండితెరపై తనదైన నటనతో మంచి మార్కులు తెచ్చుకుంది.
ఇప్పుడు కేవలం సినిమాలపైనే దృష్టి పెట్టిన ఈ బ్యూటి సోషల్ మీడియాలో హీరోయిన్లకు మించి హాట్ షో చేస్తోంది. అదిరే పోజులతో తనవైపుకు లాగేసుకుంటుంది. తాజాగా బీచ్‌లో మళ్లీ అందాలతో ఆకట్టుకుంది ఈ యాంకరమ్మ.

టీవీ ప్రోగ్రామ్స్: బ్యూటిఫుల్ అనసూయ యాంకర్ అవతారం ఎత్తకముందు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, సదా నటించిన 'నాగ' సినిమాలో చిన్న పాత్రను చేసింది. ఆ తర్వాత కొంత కాలానికి యాంకర్ గా న్యూస్ ఛానెల్స్ లో అలరించింది. అలా రాణించిన బ్యూటిఫుల్ యాంకర్ ఎంటర్టైన్ మెంట్ రంగమైన టీవీ ప్రోగ్రామ్స్, మ్యూజిక్ ఛానెల్స్ కు హోస్ట్ గా వ్యవహరించింది.

షోల మీద షోలు: స్టార్ మ్యూజిక్ వంటి తదితర ఛానెళ్లలో తన మాటలతో అట్రాక్ట్ చేసిన గ్లామరస్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ప్రముఖ కామెడీ షో జబర్ధస్త్ లోకి హోస్టుగా ఎంట్రీ ఇచ్చింది. ఈ షోలో అద్భుతంగా యాంకరింగ్ చేసి అందరి దృష్టిలో పడిన అనసూయ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. అప్పటి నుంచి వరుసగా షోలు మీద షోలు చేసుకుంటూ స్టార్ యాంకర్‌గా పేరు తెచ్చుకుంది.

నాగార్జునతో రీ ఎంట్రీ: తెలుగు రాష్ట్రాల్లో అనసూయ అంటే తెలియని వారు లేరు అన్నట్లుగా యాంకరింగ్ లో గుర్తింపు సాధించింది. ఇలా చాలా కాలంగా బుల్లితెరపై హవాను చూపిస్తున్నప్పుడే మరోవైపు సినిమాల్లోనూ సత్తా చాటింది అనసూయ. నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్ని నాయన'తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటిఫుల్.

స్పెషల్ సాంగ్స్-సినిమాలు: హాట్ యాంకర్ అనసూయ వరుసగా 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం', 'థ్యాంక్యూ బ్రదర్', 'ఖిలాడీ', 'పుష్ప', 'దర్జా' సహా ఎన్నో సినిమాలతోపాటు స్పెషల్ సాంగ్‌లు కూడా చేసింది. ప్రస్తుతం బుల్లితెరపై ఎక్కువగా కనపడని అనసూయ సినిమాల్లోనే హవా చాటే ప్రయత్నం చేస్తోంది. రంగమార్తాండ సినిమాతో మరోసారి తన నటన నిరూపించుకుంది.

స్టన్ అయ్యేలా: వేదాంతం రాఘవయ్య, హరిహర వీరమల్లు, పుష్ప 2, భోళా శంకర్, అరి, విమానం సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న గ్లామరస్ యాంకర్ అనసూయ ప్రస్తుతం విదేశాల్లో వెకేషన్ లో ఉంది. భర్త సుశాంక్ భరద్వాజతో కలిసి హాట్ ఎక్స్ పోజింగ్ చేస్తోంది. బీచ్ లో ఘాటు లిప్ లాక్స్, అందాల ఆరబోతతో స్టన్ అయ్యేలా చేసిన ఈ యాంకర్ మరోసారి రచ్చ చేసింది.

బలంగా అనుకున్నావ్: అయితే బ్యూటిఫుల్ అనసూయ తాజాగా వైట్ కలర్ షర్ట్, బ్లూ షార్ట్ జీన్స్ వేసుకుని బీచ్ లో దర్శనం ఇచ్చింది. ఇందులో కొంటెగా చూస్తూ లెగ్స్ అందాలు ఆరబోసింది. దీనికి "ఇవాళ చాలా మంది డిసప్పాయింట్ అయినట్లు ఉన్నారు (బికినీ వేసుకోలేదని)", "ఇన్ స్టా గ్రామ్ లో కుర్రాళ్లను ఏదో చేయాలని విరూపాక్ష హీరోయిన్ లాగా మనసులో ఏదో బలంగా అనుకున్నావ్ అనుకుంటా" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











