మినీ షార్ట్‌తో హీటేక్కిస్తున్న అనసూయ.. బీచ్‌లో ఉత్సాహంతో ఉరకలేస్తూ..
యాంకర్ అనే పదానికి సరికొత్త అర్దాన్ని చెప్పిన వారిలో అనసూయ ఒకరు. కామెడీ షోలో కూడా గ్లామర్ తో రేటింగ్ పెంచగల ఈ హాట్ యాంకర్ క్రేజ్ రోజురోజుకు మరింత పెరుగుతోంది. ఎలాంటి ఫోటో షేర్ చేసినా కూడా సోషల్ మీడియాలో నిమిషాల్లో వైరల్ అవుతుంది. ఇక రీసెంట్ గా పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు కూడా కుర్రాళ్ళ మనసును గట్టిగానే గిల్లేస్తున్నాయి. అనసూయ భరద్వాజ్ అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అంటున్నారు.

బీచ్ లో హాట్ లుక్
అనసూయ బీచ్ లో ఉన్న ఒక ఫొటో ఇప్పుడు ఎక్కువగా వైరల్ అవుతోంది. పొట్టి షార్ట్ లోనే గ్లామర్ తో ఒక్కసారిగా హీటెక్కించిందనే చెప్పాలి. ఎలాంటి పొజిచ్చినా కూడా ఆమె గ్లామర్ ప్రజెంటేషన్ లో ఏ మాత్రం తేడా ఉండదని కచ్చితంగా ఫొటో ట్రెండ్ అవ్వాల్సిందే అనేలా రుజువు చేస్తోంది. గతంలో ఇలాంటి పోజులు స్టిల్లులు చాలానే ఇచ్చింది గాని ఈ రేంజ్ లో వైరల్ అవ్వలేదనే కామెంట్స్ వస్తున్నాయి.

రెక్కలు వచ్చిన పక్షిలా..
భర్త సుశాంక్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల గోవాకు వెళ్లిన అనసూయా అక్కడే హాలిడేస్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. లాక్ డౌన్ కారణంగా దాదాపు ఐదు నెలల ఇంటికే పరిమితమైన అనసూయ మొత్తానికి ఇటీవల రెక్కలు వచ్చిన పక్షిలా భర్తతో విహార యాత్రలకు వెళ్లిపోయింది. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

త్వరలోనే ఒక కొత్త రియాలిటీ షో
ఆ మధ్య అనసూయ ఇన్స్టాగ్రామ్ కి కూడా కొంత గ్యాప్ ఇచ్చింది. ఇక ఆ గ్యాప్ ని మరచిపోయేలా ఇప్పుడు రంగమ్మత్త తన స్టైలిష్ గ్లామర్ తో ఇలా హీటెక్కిస్తోంది. ఏదేమైనా కుర్రాళ్ళు మాత్రం ఆమె అందానికి ఫ్యాన్స్ అవుతున్నారని అర్ధమవుతోంది. ఇక ప్రస్తుతం అనసూయ ఎప్పటిలానే షోలతో చాలా బిజీగా మారిపోయింది. త్వరలోనే ఒక కొత్త రియాలిటీ షో కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉందట.
Recommended Video

ఆ మూడు సినిమాల్లో స్పెషల్ రోల్స్
రంగస్థలం సినిమాలో ఎప్పుడైతే రంగమ్మత్తగా కనిపించిందో అప్పటి నుంచి అనసూయ క్రేజ్ లో చాలా మార్పులు వచ్చాయి. ఆమె ఎలాంటి పాత్ర చేసినా కూడా సినిమాలకు స్పెషల్ బజ్ క్రియేట్ అవుతోంది. ఇక లేడి ఓరియెంటెడ్ కథలను కూడా ఎంచుకుంటున్న అనసూయ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి బాగానే కష్టపడుతోంది. తమిళ్ ఇండస్ట్రీ నుంచి కూడా కొన్ని ఆఫర్స్ వచ్చినట్లు ఆ మధ్య ఒక న్యూస్ వైరల్ అయ్యింది. ఇక ప్రస్తుతం తెలుగులో పుష్ప, రంగమార్తాండ, ఆచార్య వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











