‘అది చూపించడానికే ఉన్నాను’.. యాంకర్ అనసూయ పోస్ట్ వైరల్

స్టార్ యాంకర్ గా అనసూయ భదర్వాజ్ తెలుగు టెలివిజన్ రంగంలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్ కామెడీ షోతో ఆమె యాంకర్ గా కొన్నేళ్ల పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించింది.ఇదే క్రమంలో ఆమె కంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తూ ఉంటుంది. తన గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను పెట్టింది. ఆ వివరాల్లోకి వెళితే..

ముక్కు సూటిగానే..
అనసూయ భరద్వాజ్ టీవీ షోతో పదేళ్ల పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. తన యాంకరింగ్ స్కిల్స్, డ్యాన్స్, కామెడీతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఇదే సమంలో సోషల్ మీడియాలోనూ అనసూయ భరద్వాజ్ ఎంతో యాక్టివ్ గా ఉంటూ వస్తోంది. పలు సోషల్ ఇష్యూస్ పైనా కూడా వేగవంతంగా స్పందిస్తూ ఉంటుంది. తనదైన శైలిలో ముక్కు సూటిగానే సమాధానాలు ఇస్తూ ఆకట్టుకుంటూ వస్తోంది. ఎలాంటి విషయమైన నికచ్చిగా మాట్లాడుతూ తన ధైర్యాన్ని ప్రదర్శిస్తోంది.

Anchor Anasuya Bharadwaj Interesting Post

మహిళా శక్తి చూపించడానికే..
యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటారు. ఈ సందర్భంగా తన గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలను ఎప్పికప్పుడు తన అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. మరోవైపు తన ఫ్యాన్స్, ఫాలోవర్స్, నెటిజన్లకు స్ఫూర్తినిచ్చేలా ఏదో ఒక పోస్ట్ పెడుతూనే వస్తుంటుంది. ఫ్యాషన్ విషయంలో కానీ, ఆలోచనా విధానంలో గానీ, ఫూడ్ డైట్ విషయంలో గానీ, ఫిటెనెస్ పరంగా కానీ తనకు తెలిసిన విషయాలను చెబుతూ ఆకట్టుకుంటోంది.

ఇక తాజాగా మహిళల గురించి కాస్తా గొప్పగా మాట్లాడుతూ కొన్ని ట్రెడిషనల్ లుక్ లోని బ్యూటీఫుల్ ఫొటోలను పంచుకుంది. ఆ ఫొటోలకు సాలిడ్ క్యాప్షన్ ఇచ్చింది. 'మహిళలు చీకటి వెలుగు లాంటి వారు అని చెప్పేందుకే నేనే ఇక్కడ ఉన్నాను. మహిళ అంటే సౌమ్యురాలు - అదే సమయంలో ఉగ్రురాలు, బలమైనవారు - మృదువైనవారు, యోధురాలు - సమస్యను పరిష్కరించే శక్తి ఉన్న వారు కూడానూ. వీటి మధ్య సమతుల్యం ఉంటే దాన్ని చెడుగానో తప్పుగానో ఆమెకు వర్తింప చేయాల్సిన పనిలేదు. అది ఏమాత్రం ప్రభావతం చూపించకపోగా మరింత శక్తివంతంగా మారుస్తుంది.. అని చెప్పుకొచ్చింది. అనసూయ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను ఫ్యాన్స్ లైక్స్, కామెంట్లతో నెట్టింట వైరల్ చేస్తున్నారు.

అనసూయ సినిమాలు..
బుల్లితెరపై అనసూయ భరద్వాజ్ జబర్దస్త్ కామెడీ షోతో యాంకర్ గా అలరించిన తర్వాత సినిమాల నుంచి మంచి అవకాశాలను అందుకుంది. దీంతో ఆ షోకు గుడ్ బై చెప్పి నటిగా వెండితెరపైనే మెరుస్తోంది. కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది. క్షణం, రంగస్థలం, పుష్ప 1, పుష్ప 2, రంగమార్తాండ, విమానం, పెద్ద కాపు 2, రజాకార్ వంటి చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రల్లో నటించి మెప్పించింది. ఇక రీసెంట్ గా హరి హర వీరమల్లు చిత్రంతో అలరించింది. నెక్ట్స్ ఫ్లాష్ బ్యాక్, వోల్ఫ్ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X