Anchor Anasuya అందాల కనువిందు.. యాంకర్ హాట్ ఫోటో వైరల్
తెలుగు టెలివిజన్ ఎంటర్టైన్మెంట్ రంగంలో మోస్ట్ బ్యూటిఫుల్ గ్లామర్ యాంకర్స్ చాలా మంది ఉన్నారు. అయితే వారిలో అందరికంటే ఎక్కువగా గ్లామర్ తో ఆకట్టుకునే వారిలో అనసూయ భరద్వాజ్ ఒకరు. సోషల్ మీడియాలో ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే వైరల్ అవుతూ ఉంటాయి. నాలుగు పదుల వయసు దగ్గర పడుతున్న కూడా ఆమె అందం విషయంలో మాత్రం కొంచెం కూడా తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు అందమైన హీరోయిన్ లకు సైతం పోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇక రీసెంట్ గా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మరికొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఆ ఫోటో వివరాల్లోకి వెళితే..

భర్త సహకారంతో..
మొదట సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన యాంకర్ అనసూయ అనుకున్నంతగా గుర్తింపు అందుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక ఆమె కొన్ని ప్రైవేట్ కంపెనీలో జాబ్ కూడా చేసింది. కుటుంబం కోసం ఎంతో కష్టపడిన తర్వాత మెల్లగా పెళ్లి అనంతరం భర్త సహకారంతో మళ్ళీ టెలివిజన్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది.

ఆ సెంటిమెంట్ కు బ్రేక్
ఇక ఆమె కెరీర్ కు ఒక్కసారిగా బూస్ట్ ఇచ్చింది మాత్రం జబర్దస్త్ షో అని చెప్పాలి. యాంకర్ గా మాటలతోనే కాకుండా ఆమె తన అందంతో కూడా ఎంతగానో ఆకట్టుకుంది. అప్పుడే మంచి గుర్తింపు దక్కించుకుంది. అనసూయ యాంకర్ గా క్లిక్కయిన తర్వాత మళ్లీ వెండితెరపైకి సరికొత్త ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సాధారణంగా టెలివిజన్ రంగంలో క్లిక్కయిన వారు వెండితెరపై అంతగా క్లిక్కవ్వలేరు అనే సెంటిమెంటును ఆమె తొందరగానే బ్రేక్ చేసింది.

సినిమాలు.. టెలివిజన్ షోలు
కేవలం టెలివిజన్ యాంకర్ గానే కాకుండా వెండితెరపై కూడా మంచి నటిగా గుర్తింపు అందుకుంది. ముఖ్యంగా రంగస్థలం సినిమా ఆమె కెరీర్ ను మార్చేసింది. ఒకవైపు రెగ్యులర్ గా రియాలిటీ షోలతో కొనసాగిస్తూనే.. మరోవైపు వెండితెరపై నటిగా కూడా మంచి గుర్తింపు అందుకుంటొంది. సోషల్ మీడియాలో అయితే నిత్యం యాంకర్ అనసూయ ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి.

బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
నాలుగు పదుల వయసుకు దగ్గరలో ఉన్నప్పటికీ కూడా అనసూయ అందాల ప్రదర్శనలో మాత్రం నేటి తరం హీరోయిన్స్ కు ఏ మాత్రం తక్కువ కాకుండా చూసుకుంటుంది. ఇటీవల ఆమె మరిన్ని డిఫరెంట్ యాంగిల్స్ లో ఇచ్చిన కొన్ని స్టిల్స్ కుర్రాళ్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి అనే చెప్పాలి.

లేటు వయసులో కూడా
యాంకర్ అనసూయ లేటు వయసులో కూడా పాతికేళ్ల అమ్మాయి తరహాలో దర్శనమిస్తోంది అని పాజిటివ్ గా స్పందిస్తున్నారు. యాంకర్ అనసూయ సినిమా లో విషయానికి వస్తే పెద్ద సినిమాలలో ప్రత్యేకమైన పాత్రలో కనిపించడమే కాకుండా అప్పుడప్పుడు లేడి ఓరియెంటెడ్ సినిమాలతో కూడా స్పెషల్ గా దర్శనమిస్తోంది.

ఆ పాత్ర కోసమే..
మంచి కంటెంట్ ఉన్న లేడి ఓరియెంటెడ్ ప్రాజెక్టులల్లో కొన్ని సినిమాలు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటున్నాయి. ఇక ప్రస్తుతం అయితే అందరూ కూడా పుష్ప సెకండ్ పార్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. పుష్ప 1లో కంటే ఎక్కువగా దాక్షాయని పాత్ర మరింత పవర్ఫుల్ గా ఉంటుందని సమాచారం. ఇక ఆ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











