స్లీవ్‌లెస్ జాకెట్‌లో అనసూయ అరాచకం: అది లేకుండానే చూశాము.. ఏదో తేడాగా ఉందేంటి!

తెలుగు బుల్లితెరపై కానీ, వెండితెరపై కానీ చాలా తక్కువ మంది అమ్మాయిలు మాత్రమే హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్ ఒకరు. చాలా కాలం క్రితమే కెరీర్‌ను మొదలు పెట్టిన ఈ చిన్నది.. జబర్దస్త్‌గా ప్రయాణాన్ని సాగిస్తూ పోతోంది. ఈ క్రమంలోనే ఎన్నో సినిమాలు, షోలు చేస్తూ హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. అదే సమయంలోనే అనసూయ సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్‌లో సందడి చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి!

జబర్ధస్త్‌తో మొదలైన కెరీర్: న్యూస్ ప్రజెంటర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన అనసూయ భరద్వాజ్.. ఆ తర్వాత ఎన్నో ప్రైవేటు కార్యక్రమాలను హోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే 'జబర్ధస్త్' షో ద్వారా బుల్లితెర యాంకర్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఇందులో గ్లామర్‌తో పాటు అద్భుతమైన హోస్టింగ్‌తో అలరించిన ఆమె.. చాలా తక్కువ సమయంలోనే మంచి పేరును దక్కించుకుని స్టార్ యాంకర్ అయింది.

Anasuya Bharadwaj

ఆ చిత్రాల్లో అదిరే పాత్రలు: చాలా కాలం పాటు బుల్లితెరపై ఎన్నో షోలను సక్సెస్‌ఫుల్‌గా నడిపించిన అనసూయ భరద్వాజ్.. సినిమాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం', 'థ్యాంక్యూ బ్రదర్', 'ఖిలాడీ', 'పుష్ప' సహా ఎన్నో చిత్రాల్లో అదిరిపోయే పాత్రలను చేసింది. దీంతో సినిమా నటిగానే ఆమె మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది.

ఇప్పుడా సినిమాలు చేస్తూ : వరుసగా సినిమా అవకాశాలు వస్తుండడంతో అనసూయ భరద్వాజ్.. బుల్లితెరపై షోలు చేయడం తగ్గించేసింది. ఈ క్రమంలోనే ఇటీవలే ఆమె 'మైఖేల్', 'రంగమార్తాండ' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే, వరుసగా 'హరిహర వీరమల్లు', 'పుష్ప 2', 'భోళా శంకర్', 'విమానం' వంటి చిత్రాల్లో నటిస్తోంది. అలాగే, వేరే భాషల్లోనూ బిజీగా మారింది.

Anasuya Bharadwaj

అందులో ఎప్పుడూ బిజీగా : వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్నా.. సోషల్ మీడియాలోనూ అనసూయ భరద్వాజ్ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తన ఫొటోలు, వీడియోల తన ఖాతాల్లో షేర్ చేస్తుంటోంది. అదే సమయంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు కెరీర్ సంబంధిత విశేషాలను పంచుకుంటోంది. ఈ కారణంగానే ఆమె ఫాలోయింగ్ పెరుగుతోంది.

ఎక్కువగా గ్లామర్ షో చేస్తూ: ఈ మధ్య కాలంలో చాలా మంది నటీమణులు సోషల్ మీడియా ద్వారా అందాలను ఆరబోస్తూ యమ హైలైట్ అవుతోన్నారు. ఈ క్రమంలోనే అనసూయ భరద్వాజ్ కూడా తరచూ గ్లామర్ షో చేస్తోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ రెచ్చిపోతోంది. ఫలితంగా అనసూయ పేరు ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవడంతో పాటు ఆమె హైలైట్ అవుతోంది.

Anasuya Bharadwaj

స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో మేకప్‌తో : తాజాగా అనసూయ భరద్వాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె పింక్ కలర్ శారీని ధరించి.. స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ను వేసుకుంది. పైగా టాప్ యాంగిల్ నుంచి సెల్ఫీలు తీసుకుంటూ కనిపించింది. ఇందులో ఆమె డిఫరెంట్ మేకప్ వేసుకుంది. ఫలితంగా అనసూయ ఫొటోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. దీంతో ఇవి వైరల్‌గా మారాయి.

 Anchor Anasuya

ఎప్పుడో అలా చూశామని : అనసూయ తాజాగా షేర్ చేసిన ఫొటోలపై నెటిజన్లు చిత్ర విచిత్రంగా కామెంట్లు చేస్తున్నారు. అందులో ఒకరు 'నీ కొత్త హెయిర్ స్టైల్, నీ లుక్ చాలా హాట్‌గా ఉంది' అనగా.. మరొకరు 'మేకప్ లేకపోతే నీ అంత దరిద్రంగా ఎవరూ ఉండరు ఆంటీ. ఆల్రెడీ మేము చూశాముగా' అని కామెంట్ పెట్టారు. ఇంకొకరు 'ఆ పిక్ తేడాగా ఉందేంటి' అంటూ అనుమానం వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X