బికినిలో కవ్వించనున్న హాట్ యాంకర్ అనసూయ.. క్లారిటీ వచ్చేసింది!

యాంకర్ అనే పదానికి సరికొత్త అర్ధాన్ని చెప్పిన బ్యూటీ అనసూయ భరద్వాజ్. తెలుగు యాంకర్ అంటే ఒకప్పుడు మాటలతోనే ఆకట్టుకునేవారు. కానీ అనసూయ వచ్చిన తర్వాత బుల్లితెరపై కూడా గ్లామర్ తో ఆకర్షించి సరికొత్త యాంకర్ అనిపించింది. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ కామెంట్స్ పై కూడా అనసూయ ఒక రేంజ్ లో కౌంటర్ ఇస్తూ మీడియాలో హాట్ టాపిక్ గా అయ్యేలా చేస్తుంది.

హాట్ యాంకర్..

హాట్ యాంకర్..

జబర్దస్త్ షోతోనే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ షోలతో ఆకట్టుకునే ఈ బేబి ఎలాంటి షో చేసినా హిట్టవ్వాల్సిందే. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న అతికొద్ది మంది టాప్ యాంకర్స్ లో అనసూయ టాప్ ప్లేస్ లో ఉందనే చెప్పాలి. ఎలాంటి షో వచ్చినా అందులో అనసూయా మార్క్ గ్లామర్ షో ఉంటుందనే చెప్పాలి. ఇక ఈ బ్యూటీ మాటలతో కూడా బుల్లితెర ప్రేక్షకులను బాగా ఎట్రాక్ట్ చేస్తుంది.

రంగమ్మత్త బ్రాండ్..

రంగమ్మత్త బ్రాండ్..

టాలీవుడ్ రంగమ్మత్తగా అనసూయ తనకంటూ ఒక బ్రాండ్ సెట్ చేసుకుందనే చెప్పాలి. రంగస్థలం సినిమాలో మాస్ ఆడియెన్స్ ని ఆకట్టుకునే విధంగా కనిపించి అనసూయ రంగమ్మత్తగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. బయట ఎక్కడా కనిపించినా కూడా అభిమానులు ఆమెను ఎక్కువగా రంగమ్మత్త అంటూ స్వీట్ గా పిలవడం అనసూయకు కూడా బాగా నచ్చేసింది.

నటిగా కూడా బిజినే..

నటిగా కూడా బిజినే..

యాంకర్ గానే కాకుండా నటిగా కూడా అనసూయ ఇండస్ట్రీలో బిజీగా మారింది. కుదిరితే గెస్ట్ రోల్స్ అంటూ అప్పుడప్పుడు డిఫరెంట్ పాత్రలతో దర్శనమిస్తోంది. ముఖ్యంగా క్షణం సినిమాలో అనసూయ పాత్రకు మంచి గుర్తింపు దక్కింది ఆ తరువాత లీడ్ రోల్స్ కూడా చేసిన అనసూయ పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే సినిమాలు చేయడానికి ఒప్పుకుంటోంది.

Recommended Video

Udaya Bhanu Condolences To Her Adopted Sister
బికినీ వేయాలంటే..

బికినీ వేయాలంటే..


రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనసూయ బికినీపై క్లారిటీ ఇచ్చింది. అనసూయ సినిమాలో బికినీలో కనిపించే ఛాన్స్ ఉందా అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఇంకా అలాంటి సమయం రాలేదు, ఒకవేళ పాత్రకు తగ్గట్టు అలా కనిపించాల్సి వస్తే బికినిలో కనిపించే ఛాన్స్ ఉండవచ్చు అని తెలిపింది. ఫైనల్ గా ప్రస్తుతానికి మాత్రం తాను బికినీలో కనిపించడానికి సిద్ధంగా లేనని చెప్పిన అనసూయ అవకాశం ఉంటే అలా కనిపించడానికి ఛాన్స్ లేకపోలేదని కూడా వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X