Anchor Anasuya: బుల్లితెరపైకి అనసూయ రీఎంట్రీ.. ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్ ఇస్తూ!
సాదాసీదా యాంకర్‌గా బుల్లితెరపైకి వచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే తనదైన అందం, టాలెంట్‌తో స్టార్‌గా ఎదిగిపోయింది అనసూయ భరద్వాజ్. ఆరంభంలోనే విభిన్నమైన షోలతో సందడి చేసిన ఈ భామ.. స్టార్ యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి ఏమాత్రం తగ్గకుండా వరుస ఆఫర్లతో సత్తా చాటింది. అయితే, కొంత కాలంగా అనసూయ బుల్లితెరపై పెద్దగా షోలు చేయడం లేదు. దీంతో ఆమె అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా అనసూయ టీవీ షోలలోకి తన రీఎంట్రీపై పోస్టులు చేసింది. ఆ వివరాలను మీరే చూసేయండి మరి!
అప్పుడెప్పుడో వచ్చిన 'నాగ' అనే సినిమాలో తళుక్కున మెరిసిన అనసూయ భరద్వాజ్.. ఆ తర్వాత ఓ న్యూస్ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా చేసింది. ఈ క్రమంలోనే యాంకర్‌గా మారి కొన్ని ఈవెంట్లను హోస్ట్ చేసింది. అప్పుడే జబర్ధస్త్ నిర్వహకుల దృష్టిలో పడి ఆ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. అందులోకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే అనసూయ సెన్సేషన్‌గా మారింది.

బుల్లితెరపై చాలా కాలం పాటు వరుసగా షోలను హోస్ట్ చేసిన అనసూయ భరద్వాజ్.. 'సోగ్గాడే చిన్ని నాయన' మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం', 'థ్యాంక్యూ బ్రదర్', 'ఖిలాడీ', 'పుష్ప' సహా ఎన్నో చిత్రాలతో సత్తా చాటింది. వీటి ద్వారా పేరు రావడంతో ఇంకాస్త ఎక్కువగా సినిమాలు చేస్తూ వెళ్తోంది.
జబర్ధస్త్ షో ద్వారానే అనసూయ భరద్వాజ్ కెరీర్‌ను మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అందుకే అదే ఛానెల్‌లో సుదీర్ఘ కాలం పాటు పని చేసింది. అలాంటిది గత ఏడాది చివర్లో ఆమె జబర్ధస్త్ షో నుంచి తప్పుకుంది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పర్సనల్ రీజన్స్ వల్లే ఈ షో నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె క్లారిటీ ఇచ్చింది. అప్పటి నుంచి సినిమాలే చేస్తోంది.
జబర్ధస్త్ షో నుంచి తప్పుకున్న తర్వాత అనసూయ భరద్వాజ్.. అందరూ అనుకున్నట్లుగానే స్టార్ మాలోకి అడుగు పెట్టింది. అందులో ప్రసారం అయిన 'సూపర్ సింగర్ జూనియర్' షోకు ఆమె సుడిగాలి సుధీర్‌తో కలిసి యాంకర్‌గా చేసింది. ఈ షో పూర్తైన తర్వాత నుంచి అనసూయ బుల్లితెరపై కనిపించడం లేదు. దీంతో ఆమె రీఎంట్రీ కోసం అభిమానులు ఆశగా చూస్తున్నారు.
అనసూయ భరద్వాజ్ బుల్లితెరపైకి ఎప్పటికైనా రీఎంట్రీ ఇస్తుందని అంతా అనుకుంటున్నారు. అందుకు అనుగుణంగానే తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 'ఒకవేళ నేను బుల్లితెరపైకి రీఎంట్రీ ఇస్తే.. మీరు నన్ను ఏ షోలో చూడాలని అనుకుంటున్నారు? జబర్ధస్త్‌లోనా? డ్రామా జూనియర్స్‌లోనా? మా మహాలక్ష్మిలోనా?' అంటూ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చే ప్రశ్న అడిగింది.

మరో పోస్టులో అనసూయ 'ఆగండి.. మీరు ఆన్సర్ ఇచ్చే ముందు అసలు నేను టీవీలోకి రావాలని అనుకుంటున్నారా? లేదా చెప్పండి' అని మరో ప్రశ్న అడిగింది. ఆ తర్వాత వీటికి నెటిజన్లు ఇచ్చిన ఓటింగ్‌ను కూడా షేర్ చేసింది. మొత్తానికి ఇవి చూసిన వాళ్లంతా అనసూయ త్వరలోనే రీఎంట్రీ ఇవ్వబోతుంది అని అంచనాకు వచ్చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











