అనసూయ సంచలన వ్యాఖ్యలు: ఆ చెత్త పని చేయమంటూ బలవంతం.. అందుకే జబర్ధస్త్ మానేసిందా!

అనసూయ భరద్వాజ్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ సుందరాంగి తనదైన అందం, టాలెంట్, వాక్చాతుర్యంతో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. స్టార్ యాంకర్‌గా దూసుకుపోతోంది. అలా సుదీర్ఘ కాలం పాటు టెలివిజన్ రంగంలో సత్తా చాటిన ఈ అమ్మడు.. ఈ మధ్య సినిమాల్లోనూ ఓ రేంజ్‌లో హవాను చూపిస్తోంది. ఫలితంగా వరుస ఆఫర్లతో హడావిడి చేస్తోంది. అదే సమయంలో అనసూయ సోషల్ మీడియాలోనూ హడావిడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా చిట్ చాట్ నిర్వహించగా.. అందులో ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు మీకోసం!

అనసూయ కెరీర్‌ జబర్ధస్త్‌గానే

అనసూయ కెరీర్‌ జబర్ధస్త్‌గానే

న్యూస్ ఛానెల్‌లో పని చేస్తూ కెరీర్‌ను ఆరంభించిన అనసూయ భరద్వాజ్.. ఆ తర్వాత యాంకర్‌గా మారింది. ఈ క్రమంలోనే 'జబర్ధస్త్' కామెడీ షోలోకి వచ్చి గ్లామర్‌తో పాటు అద్భుతమైన హోస్టింగ్‌తో మెప్పించింది. దీంతో తక్కువ సమయంలోనే ఫుల్ ఫేమస్ అయింది. తద్వారా ఫాలోయింగ్‌తో పాటు వరుసగా ఆఫర్లను కూడా అందుకుంటూ జబర్ధస్త్‌గా సాగిపోతోంది.

వెండితెరపై మెప్పించిందిగా

వెండితెరపై మెప్పించిందిగా

సుదీర్ఘ కాలం పాటు బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా సత్తా చాటిన అనసూయ.. 'సోగ్గాడే చిన్ని నాయన'తో సినిమాల్లోకి ప్రవేశించింది. ఆ తర్వాత 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం', 'థ్యాంక్యూ బ్రదర్', 'ఖిలాడీ', 'పుష్ప' సహా ఎన్నో చిత్రాలతో సత్తా చాటింది. అలాగే, కొన్ని మూవీల్లో స్పెషల్ సాంగ్‌లలోనూ కనిపించింది. ఇలా వెండితెరపైనా సత్తా చాటుకుంది.

భారీ సినిమాలు.. ఫుల్ బిజీగా

భారీ సినిమాలు.. ఫుల్ బిజీగా


అనసూయ భరద్వాజ్ ఈ మధ్య కాలంలో సినిమాల సంఖ్యను భారీగా పెంచేసింది. ఈ క్రమంలోనే ఇటీవలే ఆమె 'మైఖేల్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే, వరుసగా 'రంగమార్తాండ', 'వేదాంతం రాఘవయ్య', 'హరిహర వీరమల్లు', 'పుష్ప 2', 'భోళా శంకర్' వంటి భారీ చిత్రాల్లో నటిస్తోంది. అలాగే, వేరే భాషల్లోనూ వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా మారింది.

సినిమాల వల్ల టీవీకి దూరం

సినిమాల వల్ల టీవీకి దూరం


కొద్ది రోజుల క్రితమే అనసూయ యాంకర్‌గా లైఫ్ ఇచ్చిన జబర్ధస్త్‌తో పాటు ఈటీవీ నుంచి తప్పుకుంది. ఆ వెంటనే స్టార్ మాలోకి అడుగు పెట్టింది. అందులో ప్రసారమైన 'సూపర్ సింగర్ జూనియర్' షోకు ఆమె సుడిగాలి సుధీర్‌తో కలిసి యాంకర్‌గా చేసింది. ఈ షో పూర్తైన తర్వాత నుంచి అనసూయ బుల్లితెరపై కనిపించట్లేదు. సినిమాల వల్లే ఆమె టీవీకి దూరమైంది.

సోషల్ మీడియాలో సందడి

సోషల్ మీడియాలో సందడి


ఏకధాటిగా షోలు, సినిమాలు చేస్తూ తీరిక లేకుండా గడుపుతున్నా.. సోషల్ మీడియాలో అనసూయ భరద్వాజ్ యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తన ఫొటోలు, వీడియోల తన ఖాతాల్లో షేర్ చేస్తుంటోంది. అలాగే, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు కెరీర్ సంబంధిత విశేషాలను పంచుకుంటోంది. తద్వారా క్రేజ్ పెంచుకుంటోంది.

రీఎంట్రీ ఎప్పుడు అని ప్రశ్న

రీఎంట్రీ ఎప్పుడు అని ప్రశ్న

తాజాగా అనసూయ భరద్వాజ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చిట్ చాట్‌ నిర్వహించింది. ఇందులో ఎంతో మంది నెటిజన్లు ఆమెను చిత్ర విచిత్రమైన ప్రశ్నలు అడిగారు. వీటికామె మంచిగానే సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ 'మేడమ్.. మిమ్మల్ని మేము టీవీ ఛానెళ్లలో లేదా బుల్లితెరపై ఎప్పటి నుంచి చూడోచ్చు' అని ఆమె రీఎంట్రీ గురించి ప్రశ్నించాడు.

అవి తగ్గించినప్పుడే అంటూ

అవి తగ్గించినప్పుడే అంటూ

నెటిజన్ ప్రశ్నకు అనసూయ 'టీవీ ఛానెళ్లలో ఎప్పుడైతే చెత్త జోకులు, గౌరవాన్ని పోగొట్టే టీఆర్పీ స్టంట్‌లు లేకుండా పోతాయో అప్పుడే వస్తా. నేను కూడా టీవీని బాగా మిస్ అవుతున్నాను' అని చెప్పుకొచ్చింది. తద్వారా బుల్లితెరపై బలవంతంగా టీఆర్పీ స్టంట్‌లు చేయిస్తున్నారని పరోక్షంగా మాట్లాడింది. దీంతో అనసూయ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతోన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X