ప్రతిరోజూ అలాంటి వేధింపులు ఎదుర్కొంటున్నా.. హీరో మాటలకు అనసూయ షాకింగ్ రిప్లై

తెలుగులో గ్లామరస్ యాంకర్ గా తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని క్రియేట్ చేసుకున్న అనసూయ సోషల్ మీడియాలో ఎలాంటి ఫొటోస్ పోస్ట్ చేసినా కూడా వైరల్ అవుతుంటాయి. అప్పుడప్పుడు ఆమె కొన్ని సామాజిక అంశాలపై కూడా తన ఆవేదనను వ్యక్త పరిస్తూ ఉంటుంది. ఇటీవల ఈ స్టార్ యాంకర్ ఒక సీనియర్ హీరో చేసిన కామెంట్ కి ఊహించని విధంగా సమాధానం ఇచ్చింది.

అత్యాచార బెదిరింపులకు పాల్పడడంతో..

అత్యాచార బెదిరింపులకు పాల్పడడంతో..

అసలు మ్యాటర్ లోకి వెళితే.. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇంటర్నెట్లో కొంతమంది ఎంఎస్ ధోని కుమార్తెపై అత్యాచార బెదిరింపులకు పాల్పడడం అందరిని షాక్ కి గురి చేసింది. దీన్ని సోషల్ మీడియాలో చాలా మంది ఖండించారు. ఇక పోలీసులు కూడా వెంటనే స్పందించి దాని వెనుక ఉన్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

టీనేజ్ యువకులైనా వదిలిపెట్టవద్దు

టీనేజ్ యువకులైనా వదిలిపెట్టవద్దు

పోలీసుల కృషిని పలువురు ప్రముఖులు ప్రశంసించారు. నటుడు మాధవన్ ట్విట్టర్‌లో ఈ విషయంపై మాట్లాడుతూ.. పోలీసుల పని తీరును మెచ్చుకున్నారు. ఈ విధంగా ఇష్టం ఉన్నట్లుగా కామెంట్ చేసే వారికి తగిన బుద్ది చెప్పాలి. చట్టాలు కఠినతరం చేయాలి. దేవుడు ఉన్నాడు అనే భయాన్ని కలిగించాలి. ఇలా ప్రవర్తొస్తోంది టీనేజ్ యువకులైనా వదిలిపెట్టవద్దు.

రోజూ అలాంటి వేధింపులను ఎదుర్కొంటున్నాను

రోజూ అలాంటి వేధింపులను ఎదుర్కొంటున్నాను

ఇక యాంకర్ అనసూయ కూడా మాధవన్ చేసిన ట్వీట్ కు మద్దతు పలుకుతూ ఈ విధంగా కామెంట్ చేశారు. "నేను కూడా రోజూ అలాంటి వేధింపులను తిట్లను ఎదుర్కొంటున్నాను సర్. ఆన్‌లైన్ లో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే కఠినమైన నిబంధనలు చట్టాలు రావాలని కోరుకుంటున్నాను. ఇది నిజంగా మనలో చాలా మందికి చాలా నష్టం కలిగిస్తుంది. ఒకవేళ బలహీనమైన క్షణాల్లో ఉన్నప్పుడు మనం అలాంటివాటిని చూస్తే .. పరిస్థితేంటి ?? పశ్చాత్తాపం కంటే నివారణ చర్యలు సహాయం చేయలేవా?? అంటూ అనసూయ వివరణ ఇచ్చింది.

నెగిటివ్ కామెంట్స్ కి కౌంటర్ ఇస్తోంది..కానీ..

నెగిటివ్ కామెంట్స్ కి కౌంటర్ ఇస్తోంది..కానీ..

యాంకర్స్ లలో ఎక్కువగా అనసూయ ఆన్‌లైన్ సోషల్ మీడియా ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఎప్పటికప్పుడు ఆమె ఆ నెగిటివ్ కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. పలుమార్లు సైబర్ క్రైమ్ కి కూడా పిర్యాదు చేసారు. అయినప్పటికీ కొంతమంది నెటిజన్లలో ఏలాంటి మార్పులు రావడం లేదు. మరి ఇకనైనా కఠిన చర్యలు తీసుకుంటే నెగిటివ్ కామెంట్స్ చేసేవారిలో మార్పు వస్తుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X