చెప్పు తెగుద్ది.. పబ్లిక్ లో అనసూయ బూతు పురాణం.. కారణం ఏంటంటే?

బుల్లితెర స్టార్ యాంకర్ గా అనసూయ భరద్వాజ్ కొన్నేళ్లు అలరించిన సంగతి తెలిసిందే. తెలుగు పాపులర్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. తన యాంకరింగ్ స్కిల్స్ తో, రూప సౌందర్యంతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకుంది. ఇక తన ఫ్యాన్స్ కు ఎంతో దగ్గర గా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో అనసూయకు చేధు అనుభవం ఎదురైంది. దీంతో చెప్పు తెగుద్దని విరుచుకు పడింది. ఆ వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియాలో యాక్టివ్ గా..
అనసూయ భరద్వాజ్ బుల్లితెరపై ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. జబర్దస్త్ కామెడీ షో కంటే ముందు కూడా పలు చిత్రాల్లో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఇక తనకు హెచ్ఆర్ గా జాబ్ చేసే సమయంలోనే సుకుమార్, త్రివిక్రమ్ వంటి దర్శకుల నుంచి కూడా ఆఫర్స్ వచ్చినా ఆచీ తూచీ అడుగులు వేయాలని ఆగింది. ఎట్టకేళలకు ఆమె టాలెంట్ కు అదృష్టం తోడై స్టార్ యాంకర్ గా ఎదిగింది. అదే సమయంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఈ సమయంలోనే సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా ఉంటూ తన గురించిన అప్డేట్స్ ను అందిస్తూ ఉంటోంది.

Anchor Anasuya Bharadwaj Strong Warning to strangers

అనసూయపై ట్రోలింగ్..
స్టార్ యాంకర్ గా ఎదుగుతున్న సమయంలోనే అనసూయకు ట్రోలర్స్ నుంచి కూడా సమస్యలు ఎదురయ్యాయి. ముఖ్యంగా ఆమె డ్రెస్సింగ్ సెన్స్ పై నానా రచ్చ చేస్తుండే వారు. అనవసరంగా అనసూయను ఇబ్బంది పెట్టాలని కొందరు ప్రయత్నించారు. అదే సమయంలో అనసూయ ఎప్పటికప్పుడు వారికి బుద్ధి చెబుతూనే వస్తోంది. తనదైన శైలిలో ధీటుగా సమాధానాలు ఇస్తూ మరోసారి తనపై ట్రోలింగ్ జరగకుండా ఎండగడుతూనే వస్తోంది. అలాగే సోషల్ ఇష్యూస్ పైనా కూడా తన అభిప్రాయలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ తన పేరు ట్రెండింగ్ లో ఉండేలా చూసుకుంటోంది.

చెప్పు తెగ్గుద్ది అంటూ ఫైర్..
తాజాగా అనసూయ భరద్వాజ్ ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వెళ్లింది. ఈ సందర్భంగా ఈవెంట్ లో తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చి ఆకట్టుకుంది. ఇక అనసూయ గెస్ట్ గా విచ్చేయడంతో అభిమానులు కూడా భారీగా వచ్చారు. అయితే అభిమానుల రూపంలో కొందరు అపరిచితులు అనసూయపై అసభ్యంగా మాట్లాడారు. ఆ మాటలు విన్న అనసూయ వెంటనే సీరియస్ అయ్యింది. మైక్ లో బహిరంగంగా మాట్లాడుతూ మరి అందరికి వినిపించేలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

అనసూయ మాట్లాడుతూ.. అసభ్య మాట్లాడితే చెప్పు తెగుద్ది. ఇప్పుడే అందరి ముందు చెప్పుతో కొట్టగలనని అభిమానుల రూపంలో ఉన్న ఓ వ్యక్తిపై మండి పడింది. నీ ఇంట్లోనూ అక్కా చెల్లెళ్లు ఉంటారు. నీకూ అమ్మా ఆడ పడుచులు ఉంటారు కదా. ఇలా మాట్లాడటం ఏ మాత్రం బాలేదు. వేరీ బ్యాడ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మీకు రాబోయే పెళ్లాలను ఏడ్పిస్తే బాగుంటుందా? అని తిరిగి ప్రశ్నిస్తుంది. మీ అందరిని కలవాలని ఇక్కడి వస్తే ఇలా మాట్లాడటం ఏమాత్రం బాలేదని ఫైర్ అయ్యింది. ప్రస్తుతం అనసూయకు సంబంధించిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X