షర్ట్ బటన్స్ విప్పేసిన అనసూయ: చిరిగిపోయిన ప్యాంట్‌తో కవ్విస్తూ!
మెస్మరైజ్ చేసే అందం.. అద్భుతమైన హోస్టింగ్‌తో పాటు నటిగానూ సత్తా చాటుతూ అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై వరుస అవకాశాలతో దూసుకుపోతోంది హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్. టెలివిజన్ రంగంలో ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ఆమె.. వెండితెరపైనా సత్తా చాటుతోంది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో మరెవరకీ సాధ్యం కాని విధంగా క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అలాగే వరుస ఆఫర్లను సైతం దక్కించుకుంటోంది. ఇక, సోషల్ మీడియాలో తరచూ గ్లామర్ ట్రీట్ ఇచ్చే అనసూయ.. తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసి షాకిచ్చింది. అవి మీకోసమే!

‘జబర్ధస్త్'గా అనసూయ కెరీర్
అనసూయ భరద్వాజ్ 'జబర్ధస్త్' కామెడీ షోతో యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించింది. ఇందులో గ్లామర్‌తో పాటు అద్భుతమైన హోస్టింగ్‌తో అలరించిన ఆమె.. చాలా తక్కువ సమయంలోనే మంచి పేరును దక్కించుకుంది. తద్వారా ఫాలోయింగ్‌తో పాటు వరుసగా ఆఫర్లను కూడా అందుకుంటూ దూసుకెళ్లిపోయింది. ఈ క్రమంలోనే తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా ఎదిగింది.

సినిమాల్లోనూ సత్తా చాటిందిగా
బుల్లితెరపై ఓ రేంజ్‌లో హవాను చూపించిన అనసూయ.. 'సోగ్గాడే చిన్ని నాయన'తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం', 'థ్యాంక్యూ బ్రదర్', 'ఖిలాడీ', 'పుష్ప' సహా ఎన్నో చిత్రాలతో సత్తా చాటింది. అలాగే, కొన్ని మూవీల్లో స్పెషల్ సాంగ్‌లలోనూ మెరిసింది. ఇలా సినిమాల్లోనూ సత్తాను చాటుతోంది.

వరుస చిత్రాలతో హవా చూపి
సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత దూసుకుపోతోన్న అనసూయకు మరిన్ని ఆఫర్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇప్పుడామె 'మైఖేల్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే, వరుసగా 'రంగమార్తాండ', 'వేదాంతం రాఘవయ్య', 'హరిహర వీరమల్లు', 'పుష్ప 2', 'భోళా శంకర్' వంటి భారీ చిత్రాల్లో నటిస్తోంది. ఫలితంగా చేతి నిండా ఆఫర్లతో బిజీగా గడుపుతోంది.

షోలకు దూరం.. రీఎంట్రీ అని
జబర్ధస్త్‌తో పాటు ఈటీవీ నుంచి తప్పుకున్న అనసూయ భరద్వాజ్.. అందరూ అనుకున్నట్లుగానే స్టార్ మాలోకి అడుగు పెట్టింది. అందులో ప్రసారం అయిన 'సూపర్ సింగర్ జూనియర్' షోకు ఆమె సుడిగాలి సుధీర్‌తో కలిసి యాంకర్‌గా చేసింది. ఈ షో పూర్తైన తర్వాత నుంచి అనసూయ బుల్లితెరపై కనిపించడం లేదు. అలాగే, ఇప్పుడు ఏ షోలోనూ అనసూయ కనిపించడం లేదు.

ఎప్పుడూ అందులోనే ఉంటూ
వరుస ఆఫర్లతో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో అనసూయ భరద్వాజ్ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తన ఫొటోలు, వీడియోల తన ఖాతాల్లో షేర్ చేస్తుంటోంది. అదే సమయంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు కెరీర్ సంబంధిత విశేషాలను పంచుకుంటోంది. ఈ కారణంగానే ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్యను పెంచుకుంటోంది.

గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తోంది
చాలా మంది నటీమణులు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా గ్లామర్ ట్రీట్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే అనసూయ భరద్వాజ్ కూడా తరచూ అందాల విందు చేస్తోంది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. ఫలితంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవడంతో పాటు నిత్యం వార్తల్లోనే నిలుస్తూ ఉంది.

హాట్ షోతో కవ్విస్తోన్న బ్యూటీ
అనసూయ భరద్వాజ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె షర్ట్ బటన్స్ విప్పేయడంతో పాటు చిరిగినట్లు ఉన్న ప్యాంటును ధరించింది. ఫలితంగా ఆమె అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఫలితంగా ఇవన్నీ చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోయాయి.


Click it and Unblock the Notifications











