ఆ విషయంలో నా భర్త సహకరించడం లేదు.. అనసూయ ఎమోషనల్
సాధారణ న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి సెలబ్రెటీ స్థాయికి చేరుకున్నారు అనసూయ భరద్వాజ్. ఈ స్టేజ్‌కు రావడానికి ఆమె ఎంతో కష్టపడ్డారు.. ఎన్నో మాటలు పడ్డారు. వాటన్నింటిని తట్టుకుని అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. దీని వెనుక తన భర్త సుశాంక్ భరద్వాజ్ సపోర్ట్ ఎంతో ఉందని ఆమె ఎన్నోసార్లు చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భర్త గురించి చెబుతూ అనసూయ ఎమోషనల్ అయ్యారు.
ఎన్‌సీసీలో ఉన్న రోజుల్లోనే అనసూయ - సుశాంక్ మధ్య ప్రేమ పుట్టిందట. కానీ అప్పటికీ ఆమె వయసు 16 ఏళ్లే. అంత చిన్నతనంలోనే ఒకరినొకరు అర్ధం చేసుకుని పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని రంగమ్మత్త చెప్పారు. అయితే అన్ని ప్రేమ కథల మాదిరిగానే పెద్దలు అంగీకరించకపోవడంతో ఆమెను ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి సుశాంకే ఎంతో కష్టపడి చదివించారట. ఏం జరిగినా.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పెద్దలను ఒప్పించాకే పెళ్లి చేసుకుందామని చెప్పి దాదాపు 9 ఏళ్ల పాటు వెయిట్ చేసి మా నాన్నని ఒప్పించి పెళ్లి చేసుకున్నామని అనసూయ వెల్లడించారు.

సాక్షి టీవీలో యాంకర్‌గా పని చేస్తున్నప్పుడు అనసూయ ప్రేమ వ్యవహారం ఆ ఛానెల్‌లో అందరికీ తెలుసునట. జీవితం గురించి ఆలోచిస్తూ డిప్రెషన్‌లో ఉండేదాన్నని.. ఆ బాధను గుండెల్లో దాచుకుని విధులకు హాజరైనట్లు అనసూయ చెప్పారు. అలాగే దేవుడిని బాగా నమ్మే అనసూయ .. సుశాంక్‌తో పెళ్లి జరిగేలా చూడాలని సాయిబాబాకు మొక్కుకున్నారట. ఇందుకోసం 11 గురువారాల పాటు పూజలు చేయడమే కాకుండా తనకు ఎంతో ఇష్టమైన చాక్లెట్, ఆలూగడ్డను వదులుకున్నానని అనసూయ చెప్పారు. సాయిబాబా కోసం ఏడేళ్ల పాటు వాటి జోలికి పోలేదని అనసూయ అన్నారు.
ఇలాంటి పరిస్ధితుల్లో ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్ ప్రోగ్రామ్‌ని హోస్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్న అనసూయ జీవితం మలుపు తిరిగింది తిప్పింది. నాగబాబు, రోజా వంటి స్టార్లు స్టేజ్‌పై జడ్జిలుగా ఉన్నప్పటికీ.. అనసూయ తన అంద చందాలతో జబర్దస్త్‌కు గ్లామర్ సొగసులు అద్దారు. ఈ కామెడీ షోతో తెలుగు నాట స్టార్ యాంకర్లలో ఒకరిగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదే సమయంలో సినిమాల్లోనూ అనసూయకు అవకాశాలు రావడంతో ఇండస్ట్రీలో బిజీగా మారి జబర్దస్త్‌ను సైతం వీడారు. ప్రస్తుతం తమిళంలో ఫ్లాష్ బ్యాక్, ఉల్ఫ్ సినిమాల్లో అనసూయ నటిస్తున్నారు.

కాగా.. మేం ముగ్గురం ఆడపిల్లలం కావడంతో తొలుత అబ్బాయి పుడితే బాగుండు అనిపించింది అని అనసూయ తెలిపారు. రెండోసారి గర్భం దాల్చినప్పుడు మాత్రం ఆడపిల్ల కావాలని అనుకున్నానని, కానీ అప్పుడూ బాబే పుట్టాడని ఆమె వెల్లడించారు. తనకు ఇప్పటికీ ఆడపిల్లపైనే ఉందని.. కానీ మా ఆయన సహకరించడం లేదని అనసూయ వ్యాఖ్యానించారు. ఆడపిల్ల ఉన్న ఇల్లు లక్ష్మీదేవి ఉన్న ఇంటిలా కళకళలాడుతూ ఉంటుందన్నారు. నీకేంటీ కనేసి వెళ్లిపోతావ్.. నీ పని నువ్వు చేసుకుంటావ్, భరించేది నేను అంటూ మా ఆయన కో ఆపరేట్ చేయడం లేదని అనసూయ వ్యాఖ్యానించింది. కానీ 40 ఏళ్లు వచ్చినా సరే అమ్మాయిని కనేందుకు ట్రై చేస్తానని అనసూయ బోల్డ్‌గా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











