Anasuya Bharadwaj: మేకప్ లేకుండా అనసూయ.. నేచురల్ లుక్‌పై నెటిజన్ల హాట్ కామెంట్స్.. ఫోటోలు వైరల్
ఒకప్పుడు యాంకర్స్ ఉంటే కేవలం వారి మాటల తోనే కాకుండా ఆకట్టుకుంటూ ఉండేవారు. కానీ కాలం మారుతున్న కొద్దీ హీరోయిన్స్ గ్లామర్ డోస్ పెంచినట్లుగానే యాంకర్స్ కూడా వారి గ్లామర్ డోస్ పెంచుతున్నారు. ప్రస్తుత కాలంలో యాంకర్స్ వారి అందంతో ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న బ్యూటిఫుల్ యాంకర్స్ లలో అనసూయ భరద్వాజ్ టాప్ లిస్టులో ఉన్నారని చెప్పవచ్చు. అయితే యాంకర్ అనసూయ మేకప్ లేకుండా ఎలా ఉంటుంది అనే సందేహం చాలా మందిలో కలిగి ఉంటుంది. ఇక ఆమె ఇటీవల సోషల్ మీడియాలో నేచురల్ లుక్ లో కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఫ్యామిలీ కోసం..
మొదట వెండితెరపై సైడ్ యాక్టర్ గా చేసిన అనసూయ భరద్వాజ్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువహా కొనసాగలేక పోయింది. ఆ తర్వాత ఆమె కుటుంబం కోసం ఆలోచించే కొన్ని ప్రైవేట్ జాబ్స్ కూడా చేసింది. ఆమె జాబ్ చేస్తున్న సమయంలోనే చాలా రకాల సినిమా ఆఫర్స్ వచ్చాయి. కానీ మొదట అనసూయ భరద్వాజ్ అటువైపు పెద్దగా ఆసక్తి చూపలేదు

అప్పట్లోనే భారీ ఆఫర్స్
అనసూయ భరద్వాజ్ కు కెరీర్ మొదట్లో అల్లు అర్జున్ సినిమాలో ఒక మంచి ఆఫర్ కూడా వచ్చింది. ఆర్య 2లో శ్రద్దా దాస్ చేసిన పాత్ర కోసం దర్శకుడు సుకుమార్ మొదట అనసూయనే అనుకున్నాడట.. ఒక ఆఫీసులో వర్క్ చేస్తున్నప్పుడు అనసూయను చూసిన సుకుమార్ ఆ పాత్రను మీరు చేస్తే బాగుంటుందని కూడా ఆఫర్ ఇచ్చినప్పటికీ అనసూయ అప్పుడు కుటుంబ పరిస్థితుల కోసం ఆలోచించి చేయలేకపోయిందట.

కామెడీ షో ద్వారా క్రేజ్
ఇక జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న అనసూయ చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల్లో ఒక మంచి క్రేజ్ అయితే అందుకుంది. కేవలం తన మాటలతో నే కాకుండా తన అందంతో కూడా కుర్రాళ్ళను ఆకర్షించింది. ప్రస్తుతం ఉన్న మోస్ట్ గ్లామరస్ యాంకర్స్ లలో అనసూయ భరద్వాజ్ బెస్ట్ అని చెప్పవచ్చు.

మేకప్ లేకుండా..
ఇక అనసూయ వయసు ఎంత ఉంటుంది అనే విషయంలో కూడా అనేక రకాల కథనాలు వెలువడుతుంటాయి. మేకప్ లో ఆమె పాతికేళ్ల అమ్మాయిలా అనే కనిపించినప్పటికీ మేకప్ తీసేస్తే మాత్రం తప్పకుండా వయసు బయట పడుతుంది అని చాలామంది కామెంట్ చేసే వాళ్ళు. కానీ ఇటీవల పూర్తి చేసిన ఫోటోలు చూస్తే మాత్రం అనసూయ నేచురల్ లుక్ లో కూడా చాలా బాగుంది అంటూ కొందరు స్పందిస్తున్నారు.

సెల్ఫీ ఫొటోస్ వైరల్
అనసూయ భరద్వాజ్ ఇటీవల తన ఇంట్లో దిగిన కొన్ని సెల్ఫీ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక ఆ ఫోటోలు కూడా నిమిషాల్లోనే వైరల్ అవ్వడం విశేషం. అనసూయ నేచురల్ గా ఉందని కొందరు నెటిజన్లు పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. ఈ రోజుల్లో మేకప్ లేకుండా సెలబ్రిటీలు కనిపించడం చాలా రెర్. కానీ అనసూయ మాత్రం అప్పుడప్పుడు తన పర్సనల్ ఫ్యామిలీ లైఫ్ ఫోటోలలో నేచురల్ గానే దర్శనమిస్తూ వుంటారు.

పుష్ప 2లో కూడా..
ఇక పుష్ప సినిమాలో అనసూయ భరద్వాజ్ నెగిటివ్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. సునీల్ కు జోడిగా దాక్షాయని అనే పాత్రలో నటించిన విధానం ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇక పుష్ప రెండో భాగంలో కూడా అనసూయ పాత్ర అంతకుమించి అనేలా మరింత పవర్ఫుల్ గా ఉంటుంది అని దర్శకుడు సుకుమార్ ఒక ఇంటర్వ్యూ లో తెలియజేశాడు.


Click it and Unblock the Notifications











