మీరు కాశ్మీర్‌ వెళ్లి యుద్దం చేస్తున్నారా? నేను ఏ బట్టలేసుకుంటే మీకేంటి? అనసూయ ఫైర్!

Recommended Video

Anchor Anasuya Serious Reaction On People Who Comments On Her Cloths | FilmiBeat Telugu

కాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మందికిపైగా సిఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన ఘటనపై యాంకర్ అనసూయ పెట్టిన ఓ పోస్టుపై కొందరు నెటిజన్లు దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. వారి వాఖ్యలకు మనస్థాపానికి గురైన అనసూయ ధీటైన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు.

చాలా మంది నేను పెట్టిన పోస్టులకు, ఎందుకు ఆ పోస్టు పెట్టానో కూడా తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల కాశ్మీర్ లో జరిగిన సంఘటనపై నాకు చాలా కోపం ఉంది. నేను ఇక్కడ శాంతి గురించి మాట్లాడటం లేదు. సోషల్ మీడియాను మనం సరైనదాని కోసం ఉపయోగించుకోవాలని చెప్పదలుచుకున్నాను.. అంటూ తన మనసులోని ఆవేదనను బయట పెట్టారు.

మీరు వెళ్లి యుద్దం చేస్తున్నారా?

మీరు వెళ్లి యుద్దం చేస్తున్నారా?

సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే పనులు చేయకూడదు. యుద్ధం రావాల్సిందే అని కొందరు అంటున్నారు. అలాంటి కామెంట్స్ చేసే వారు వెళ్లి ఏమైనా యుద్దం చేస్తున్నారా? అది ఎలా ఉంటుందో కనీసం మీకు తెలుసా? అక్కడ(కాశ్మీర్ మంచు పర్వతాల్లో) నార్మల్‌గా ఊరిపి పీల్చుకోవడానికే కష్టంగా ఉంటుంది.

జరిగింది చాలా ఘోరం..

జరిగింది చాలా ఘోరం..

ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. జరిగింది(పుల్వామా ఘటన) చాలా ఘోరం. మనం కూడా అదే చేస్తామనడం ఎంత వరకు కరెక్ట్? అయినా మీకు యుద్దం గురించి ఏం తెలుసని ఇలా మాట్లాడుతున్నారు? అంటూ అనసూయ ఫైర్ అయ్యారు.

మీరేమైనా కట్టకట్టుకుని కాశ్మీర్ వెళుతున్నారా?

మీరేమైనా కట్టకట్టుకుని కాశ్మీర్ వెళుతున్నారా?

కొంత మంది ఎంత అసహ్యంగా మాట్లాడతారంటే... నీకు టైమ్ అయింది ఫోటోలు పోస్ట్ చేసుకో, నువ్వు వెళ్లి చిన్న బట్టలు వేసుకుని పని చేసుకో అంటున్నారు. అలా మాట్లాడే వారిని ఒకటే ప్రశ్నిస్తున్నాను. ఇది జరిగిందని మీరు తినడం మానేస్తున్నారా? పడుకోవడం మానేస్తున్నారా? లేదా అందరూ కట్టకట్టుకుని కాశ్మీర్ వెళ్లిపోతున్నారా?

అడ్డమైన వాగుడు వాగేసుకుని బిర్యానీలు తినడం లేదా?

అడ్డమైన వాగుడు వాగేసుకుని బిర్యానీలు తినడం లేదా?

ఫేస్‌బుక్‌లో, ఇన్ స్టాగ్రామ్‌లో మీరంతా ఏం చేస్తున్నారు? వార్ చేద్దాం వార్ చేద్దాం అని అనడం తప్ప. అవును.. నా పని నేను చేసుకుంటున్నాను. జీవితంలో దేనికదే ప్యారలల్ గా జరుగుతూ ఉండాలి. మీరు చేయడం లేదా? ఇలా అడ్డమైన వాగుడు వాగేసుకుని వెళ్లి బిర్యానీలు తినడం లేదా? మీ ఇష్టం వచ్చినట్లు చేయండి.. కానీ కరెక్టుగా చేయడం. మీ ఇంట్లో వారిని గౌరవించండి. మీ ఇంట్లో వారిని కూడా మంచి వ్యక్తులుగా తయారు చేయండి.

నేను వేరు.. నా వృత్తి వేరు

నేను వేరు.. నా వృత్తి వేరు

నేను ఇదంతా చెప్పేది కనీసం పది మందికైనా అర్థం అవుతుందని. నేను ఒక ఎంటర్టెనర్.. ఫోటోలు పోస్ట్ చేస్తాను.. అదే చేస్తూ ఉంటాను. వ్యక్తగతంగా నేను వేరు... నేను చేసే పని వేరు. సినిమాల్లో విలన్ గా నటించినంత మాత్రాన వారు నిజ జీవితంలో కూడా అలాంటి వారు కాదు కదా. జబర్దస్త్‌లో మేము ఏం చేసినా కేవలం కల్పితం.. మిమ్మల్ని నవ్వించడానికే అని మీకూ తెలుసు. తెలిసి కూడా మాపై అలాంటి కామెంట్స్ చేయడం ఎందుకు? ఎందుకని వాటినే పట్టుకుని గబ్బిలాల్లాగా వేలాడతారు. కాస్త సెన్స్ తో ఆలోచించండి.

నేను ఏ బట్టలు వేసుకుంటే మీకెందుకండీ?

నేను ఏ బట్టలు వేసుకుంటే మీకెందుకండీ?

చేస్తే మంచి చేయండి. ఇక్కడ కూర్చుని యుద్దం చేద్దాం.. నువ్వు బట్టలు సరిగే వేసుకో.. ఏమిటండీ ఇలాంటి కామెంట్స్? నేను ఏ బట్టలు వేసుకుంటే మీకెందుకండీ? ఎటూ తిరిగి మళ్లీ నా బట్టల మీదకే వస్తారెందుకు? ఇంతేనా మీ బుద్ది. ఇలాంటి వాటికి ఎందుకు సమాధానం ఇస్తున్నానా అని అనిపిస్తుంది. కానీ ఒక్కోసారి మనసులోని బాధను ఆపుకోలేక పోతున్నాను అని అనసూయ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X