అనసూయకు అజ్ఞాతవాసి పైత్యం! దుమ్మురేపుతున్న వీడియో

By Rajababu

Recommended Video

అనసూయ అజ్ఞాతవాసి పైత్యం !

టాప్ యాంకర్ అనసూయ టెలివిజన్ షోలు, సినిమాలు, రియాలిటీ షోలతో బిజీగా ఉన్న పర్సనల్ లైఫ్‌ను ఎప్పుడూ వదులుకోదు. సమయం దొరికితే అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటిస్తుంటుంది. తన అభిప్రాయాలను పంచుకొంటుంది. ఇలా అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా హల్‌చల్ చేసే అనసూయకు తాజాగా అజ్ఞాతవాసి పైత్యం పట్టుకొన్నది. అదేంటో మీరే చూడండి..

 అజ్ఞాతవాసి పాటకు అనసూయ

అజ్ఞాతవాసి పాటకు అనసూయ

కేవలం జబర్దస్త్ మాత్రమే కాదు.. ఈ వేదికపైన ఉన్నా అనసూయ హడావిడి ఎక్కువగానే కనిపిస్తుంటుంది. తన హావభావాలను పలికించడంలో దిట్ట. తాజాగా అజ్ఞాతవాసి పాటకు ఆమె పలికించిన హావభావాలు నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకొంటున్నది. ఇంతకీ అనసూయ ఎమోషన్స్ పలికించిన పాట ‘బయటకొచ్చి చూస్తే టైమేమో త్రీ వో క్లాక్'. ఇప్పటికే పవన్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకొంటున్న ఈ పాటకు అనసూయ అదనంగా కొత్త ఫ్లేవర్‌ను యాడ్ చేసింది.

 అనసూయ లయబద్ధంగా స్టెప్పులు

అనసూయ లయబద్ధంగా స్టెప్పులు

బయటకొచ్చి చూస్తే టైమేమో త్రీ వో క్లాక్ పాటలో వచ్చే.. ఓయ్ నీ చేతికి ఉన్న బ్యాంగిల్సే తాళమేసినా శాండిల్సే. ఒక్క వేలో చేస్తే పువ్వులా రెక్కలు పుల్లుగా కప్పేసే. కార్నర్‌లో కాఫీ షాప్ అంటూ వచ్చే పాట లైన్లకు లయబద్దంగా తన శరీరాన్ని కదలించి అనసూయ ఆకట్టుకొన్నారు.

 వీడియోకు అనూహ్య స్పందన

వీడియోకు అనూహ్య స్పందన

అనసూయ పోస్ట్ చేసిన వీడియోకు అనూహ్యం స్పందన వచ్చింది. నాలుగు గంటల్లోనే 5 వేల మంది లైక్ చేయగా, 81 మంది షేర్ చేశారు. ఇంకా ఈ వీడియో ట్రెండ్ అవుతూనే ఉంది.

మిస్టర్ ఇండియాలోని పాటకు కూడా

ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో మిస్టర్ ఇండియాలోని శ్రీదేవి డ్యాన్స్ చేసిన హవా హవాయి అనే పాటకు అనసూయ అందంగా ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది. ఆ వీడియోను 96 మంది షేర్ చేయగా లక్షా 12 వేల మంది లైక్ చేశారు. ఆ వీడియో ఇదే..

 సోషల్ మీడియాలో అనసూయ హల్‌చల్

సోషల్ మీడియాలో అనసూయ హల్‌చల్

తన ప్రొఫెషనల్ వర్క్‌తోనే కాదు.. వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ అనసూయ ఇలా వీడియోలు, ఫొటోలను పోస్ట్ చేస్తూ అలరిస్తుంటుంది. ఎవరైనా నెగిటివ్ కామెంట్లు చేస్తే వారిని దుమ్ముదులిపేస్తుంది.

రంగస్థలంలో అనసూయ

రంగస్థలంలో అనసూయ

ఇలా అనేక ఈవెంట్లు, ప్రొగ్రాంలతో అలరిస్తున్న అనసూయ ప్రస్తుతం రాంచరణ్ నటిస్తున్న రంగస్థలం చిత్రంలో ఓ కీలకపాత్రను పోషిస్తున్నది. అంతేకాకుండా మోహన్‌బాబు నటించే గాయత్రి, రజనీకాంత్ నటించే కాలాతోపాటు సచ్చిందిరా గొర్రే సినిమాలో నటిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X