బిగ్‌బాస్ ఇంట్లో అనసూయ.. తీన్మార్‌తో రచ్చ రంబోలా.. సెలబ్రీటీల జోష్!

By Rajababu

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Episode 72 Highlights...!

బిగ్‌బాస్ ఇంటికి పెళ్లి కళ వచ్చేసింది. ఇంట్లో పెళ్లి టాస్క్ మొదలు కావడంతో ఇంటి ఆవరణ అంతా పెళ్లి తోరణాలతో, అలంకరణలతో పచ్చగా కనిపించింది. ఇంటి సభ్యులు రెండు కుటుంబాలుగా మారారు. గీతా మాధురి, అమిత్ రాధా, కృష్ణ కుటుంబంగా, మాధవీలత కుటుంబంగా కౌశల్, దీప్తి నల్లమోతు జట్టుగా విడిపోయారు.

రెండు కుటుంబాలుగా

రెండు కుటుంబాలుగా

రాధా, కృష్ణ కుటుంబంలో తనీష్, సమ్రాట్, పూజా, గణేష్ చేరిపోగా, కౌశల్, దీప్తి ఫ్యామిలీలో మిగితా సభ్యులు ఉన్నారు. పెళ్లి టాస్క్‌లో భాగంగా రకరకాల ఈవెంట్లు జరిగాయి.

స్విమ్మింగ్ పూల్‌లో టాస్క్

స్విమ్మింగ్ పూల్‌లో టాస్క్

మొదటి పోటీలో స్విమ్మింగ్ ఫూల్‌లో చేతి ఉంగరాలు వెతికే కార్యక్రమాన్ని సెలబ్రిటీల ముందు ఉంచారు. సామ్రాట్ ఓ జట్టు నుంచి, దీప్తి నల్లమోతు మరో టీం నుంచి స్విమ్మింగ్ పూల్‌లో దూకి వాటిని వెతికారు.

టాస్కులతో అమిత్ బిజీ

టాస్కులతో అమిత్ బిజీ

రెండో పోటీగా ఇంట్లో చెప్పులు వెతికే టాస్క్‌ను అమిత్, గీతా మాధురి టీమ్‌కు ఇచ్చారు. అమిత్ టీం దాచిపెట్టిన అన్ని చెప్పులను సక్సెస్‌పుల్‌గా వెతికి తెచ్చారు. ఆ తర్వాత ఇంట్లో పెళ్లి పనులు జోరుగా సాగాయి. అలాగే లడ్డులు చేసే పనిని గీతా మాధురికి అప్పగించారు.

అతిథి వస్తున్నట్టు ప్రకటన

అతిథి వస్తున్నట్టు ప్రకటన

ఇలా పెళ్లి పనులు సాగుతుండగానే ఇంట్లోకి ఓ అతిథి రాబోతున్నట్టు బిగ్‌బాస్ ప్రకటించారు. ఆ తర్వాత కొద్ది సేపటికి యాంకర్, నటి అనసూయ ఓ కొత్త జోష్‌తో ప్రవేశించారు. తీన్మార్ డప్పులు మోగుతుండగా అనసూయ ఎంట్రీ అదిరిపోయింది.

అనసూయకు స్వాగతం

అనసూయకు స్వాగతం

అనసూయను చూడగానే ఇంటి సభ్యులందరూ పరుగులు పెట్టి స్వాగతం పలికారు. ఇంటి సభ్యులను పేరు పెట్టి అనసూయ పలకరించారు. అనసూయ రాకతో ఇంట్లో కొత్త ఉత్సాహం కనపడింది.

మరో రోజు అనసూయ జోష్

మరో రోజు అనసూయ జోష్

ఇంటి సభ్యులతో ఆనందంగా ముచ్చటించడం కనపడింది. అలాగే బిగ్‌బాస్ ఒకటో సీజన్‌ను కలిసి చూశామని గీతా మాధురితో అనసూయ చెప్పడం కనిపించింది. అనసూయ ఎంట్రీతో 72వ ఎపిసోడ్‌ను ముగించారు. అంటే 73 రోజు కూడా అనసూయ జోష్ బిగ్‌బాస్‌లో కనిపించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X