Anasuya Bharadwaj: ఆ వీడియోతో దర్శనమిచ్చిన యాంకర్ అనసూయ.. జబర్దస్త్ గుర్తొచ్చిందా?

ఓ వైపు యాంకర్​గా, మరోవైపు నటిగా పాపులారిటీ తెచ్చుకుంది అనసూయ భరద్వాజ్. ఇటీవలే వాంటెడ్​ పండుగాడ్​ మూవీతో ప్రేక్షకులను పలకరించిన అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్​ బిజీగా ఉంది. సినిమాలే కాకుండా సోషల్​ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్​గా ఉంటుంది. హాట్​గా ఫొటోలతో అట్రాక్ట్​ చేసే ఈ బ్యూటిఫుల్ యాంకర్​ ఘాటు కామెంట్స్​తో ట్రోలింగ్​ బారిన పడుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ వీడియోతో నెట్టింట సందడి చేసింది ఈ బ్యూటిఫుల్ యాంకర్. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కాగా, నెటిజన్లు తమ స్టైల్ లో కామెంట్లు చేస్తున్నారు.

వరుస ఆఫర్లతో..

వరుస ఆఫర్లతో..

బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లుగా వెలుగొందుతోన్నారు. అందులో కొందరు మాత్రమే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఒకరు. యాంకర్‌గా పరిచయమైన చాలా తక్కువ సమయంలోనే అందంతో పాటు హోస్టింగ్‌తో అలరించిన ఈ బ్యూటీ.. వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోయింది. ఫలితంగా సుదీర్ఘ కాలంగా అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై సందడి చేస్తోంది. కెరీర్ పరంగా ఎలా ఉన్నా సోషల్ మీడియాలోనూ అనసూయ భరద్వాజ్ యమ యాక్టివ్‌గా ఉంటోంది.

జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో..

జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో..

'నాగ' అనే సినిమాలో చిన్న పాత్రను చేసి.. ఆ తర్వాత న్యూస్ యాంకర్‌గా అనసూయ భరద్వాజ్ కెరీర్‌ను ప్రారంభించింది. అనంతరం జబర్ధస్త్ షోలోకి హోస్టుగా ఎంట్రీ ఇచ్చింది. అందులో అద్భుతమైన హోస్టింగ్ చేసి అందరి దృష్టిలో పడిపోయింది. దీంతో ఒక్కసారిగా ఫేమస్ అయింది. అప్పటి నుంచి వరుసగా షోలు మీద షోలు చేసుకుంటూ స్టార్‌ యాంకర్‌గా వెలుగొందింది.

చిత్రాలతోపాటు స్పెషల్ సాంగ్స్..

చిత్రాలతోపాటు స్పెషల్ సాంగ్స్..

సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న అనసూయ.. సినిమాల్లోనూ సత్తా చాటుతోంది. 'సోగ్గాడే చిన్ని నాయన'తో రీ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం', 'థ్యాంక్యూ బ్రదర్', 'ఖిలాడీ', 'పుష్ప' సహా ఎన్నో చిత్రాలతో పాటు స్పెషల్ సాంగ్‌లనూ చేసింది. తద్వారా తన రేంజ్‌ను పెంచుకుంది.

బుల్లితెరపై లేని పెద్ద షోలు..

బుల్లితెరపై లేని పెద్ద షోలు..

కొన్నేళ్లుగా అనసూయ భరద్వాజ్ బుల్లితెరపై పెద్దగా షోలు చేయడం లేదు. దీనికి కారణం ఆమె సినిమాలనే ఎక్కువగా ఒప్పుకోవడమే. ఇప్పటికే ఆమె 'రంగమార్తాండ', 'వేదాంతం రాఘవయ్య', 'గాడ్ ఫాదర్', 'హరిహర వీరమల్లు', 'పుష్ప 2', 'భోళా శంకర్' వంటి భారీ చిత్రాల్లో భాగమైంది. తద్వారా మరిన్ని భారీ ఆఫర్లను అందుకుంటూ హవా చూపిస్తోంది.

పిల్లల కార్యక్రమానికి హోస్ట్ గా..

పిల్లల కార్యక్రమానికి హోస్ట్ గా..

ఈటీవీలో ప్రసారం అవుతోన్న జబర్ధస్త్ షో ద్వారానే అనసూయ యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. సుదీర్ఘ కాలంగా అందులోనే సత్తా చాటుతోంది. అయితే, ఇటీవలే ఈ బ్యూటీ స్టార్ మాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో సుడిగాలి సుధీర్‌తో కలిసి అనసూయ ఓ పిల్లల కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తోంది. ఇక, ఇటీవలే ఆమె జబర్ధస్త్ నుంచి కూడా తప్పుకున్న విషయం తెలిసిందే.

ఫాలోవర్లతో షేర్..

ఫాలోవర్లతో షేర్..

ఒకవైపు టీవీ షోలు, మరోవైపు సినిమాలు చేయడంతో పాటు అప్పుడప్పుడూ స్పెషల్ సాంగ్‌లు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నప్పటికీ.. సోషల్ మీడియాలోనూ అనసూయ యమ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది.

ఒక్కడు చిత్రంలోని పాటకు..

ఎప్పుడూ హాట్ అండ్ గ్లామర్ ఫొటోలతో ఎంటర్ టైన్ చేసే అనసూయ తాజాగా ఓ డ్యాన్స్ వీడియోతో దర్శనమిచ్చింది. మహేశ్ బాబు ఒక్కడు మూవీలోని నువ్ ఏ మాయ చేశావో గానీ అనే పాటకు స్టెప్పులేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. అయితే జబర్దస్త్ స్టేజ్ పై డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకునేది అనసూయ. ఇటీవల ఆ షో నుంచి తప్పుకున్న అనసూయకు జబర్దస్త్ గుర్తొచ్చిందేమో అన్నట్లుగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X