స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అనసూయ హాట్ షో.. మళ్లీ జబర్దస్త్ లోకి రావడంపై కామెంట్స్
యాంకర్ అంటే చలాకీ మాటలతో పాటు కాస్తా గ్లామర్ తో కూడా ఆకట్టుకుంటారు. ఆలాంటి గ్లామరస్ అండ్ బ్యూటిఫుల్ యాంకర్లలో అనసూయ భరద్వాజ్ ఒకరు. బుల్లితెరపై పాపులర్ యాంకర్‌గా వెండితెరపై అద్బుతమైన నటిగా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. యాంకర్ గా షోలలో గ్లామర్ ఒలకబోస్తూనే మరోవైపు వెండితెరపై తనదైన నటనతో మంచి మార్కులు తెచ్చుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు, వీడియోలతో ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటోంది. తాజాగా అలాంటి కొన్ని పిక్స్ వదిలింది ఈ బ్యూటీఫుల్ యాంకర్ అనసూయ భరద్వాజ్.
అందరి దృష్టిలో.. : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, సదా నటించిన 'నాగ' సినిమాలో చిన్న పాత్రను చేసి.. ఆ తర్వాత న్యూస్ యాంకర్‌గా అనసూయ భరద్వాజ్ కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత జబర్ధస్త్ షోలోకి హోస్టుగా ఎంట్రీ ఇచ్చింది. ఈ షోలో అద్భుతంకా యాంకరింగ్ చేసి అందరి దృష్టిలో పడి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది ఈ యాంకర్. అప్పటి నుంచి వరుసగా షోలు మీద షోలు చేసుకుంటూ స్టార్ యాంకర్‌గా పేరు తెచ్చుకుంది.

సినిమాలు.. ఐటమ్ సాంగ్స్..: యాంకర్ గా చాలా కాలంగా బుల్లితెరపై హవాను చూపిస్తూ దూసుకుపోయిన బ్యూటిఫుల్ అనసూయ మరోవైపు సినిమాల్లోనూ సత్తా చాటింది. టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో నాగార్జున డ్యూయల్ రోల్ లో నటించిన 'సోగ్గాడే చిన్ని నాయన'తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది అనసూయ. ఆ తర్వాత వరుసగా 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం', 'థ్యాంక్యూ బ్రదర్', 'ఖిలాడీ', 'పుష్ప' సహా ఎన్నో సినిమాలతోపాటు స్పెషల్ సాంగ్‌లు కూడా చేసింది.
గయ్యాలి కోడలిగా..:ప్రస్తుతం బుల్లితెరపై ఎక్కువగా కనపడని అనసూయ సినిమాల్లో హవా చాటే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న రంగమార్తాండ చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో గయ్యాలి కోడలిగా అలరించిందని టాక్ వచ్చింది. ఇదే కాకుండా వేదాంతం రాఘవయ్య, హరిహర వీరమల్లు, పుష్ప 2, భోళా శంకర్ సినిమాల్లో అనసూయ నటించనుంది.

పూర్తిగా బ్రేక్ ఇచ్చి..: ముద్దుగుమ్మ అనసూయకు జబర్దస్త్ షో ద్వారా సూపర్ క్రేజ్ వచ్చిందన్న విషయం తెలిసిందే. అందులో ఎన్నో ఏళ్లుగా యాంకర్ గా చేసిన అనసూయ ఆ షో మానేసింది. ఆ షో నుంచి తప్పుకున్న అనసూయ తర్వాత స్టార్ మా లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఛానెల్ లో సుడిగాలి సుధీర్ తో కలిసి ఒక పిల్లల కార్యక్రమాన్ని హోస్ట్ చేసింది. తర్వాత బుల్లితెరపై టీవీ షోలకు పూర్తిగా బ్రేక్ ఇచ్చేసింది.
యాంకర్ గా అనసూయ చెల్లెలు..:ప్రస్తుతం సినిమాలపై దృష్టి సారించిన బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ తన చెల్లెలు వైష్ణవిని యాంకర్ గా ఇంట్రడ్యూస్ చేయనుందని అప్పట్లో టాక్ తెగ నడిచింది. కానీ అదేది కార్యరూపం దాల్చలేదు. బుల్లితెరకు తన వారసురాలిగా వైష్ణవిని అనసూయ తీసుకొస్తున్నట్లు వార్తలు అయితే షికార్లు చేశాయి. ఇదిలా ఉంటే అనసూయ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. హాట్ ఫొటోలు, వీడియోలతో హీట్ పెంచుతూ ఉంటుంది.

రోజు ఏడుస్తున్నాను..:గ్లామరస్ యాంకర్ అనసూయ తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. పర్పల్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించిన అనసూయ చీరలో విభిన్న యాంగిల్స్ లో పోజులిచ్చింది. ఇందులో క్యూట్ గా స్మైల్ చేస్తూ.. ఘాటుగా మత్తెక్కించే చూపులతో హాట్ షో చేసింది. వీటిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. 'మళ్లీ టీవీ షోకి రండి. పిచ్చిగా, వేదనగా మిమల్ని మిస్ అవుతున్నాం. రోజు ఏడుస్తున్నాను. ప్లీజ్ కమ్ బ్యాక్' అని చర్చిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











