For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Anasuya Bharadwaj: పొట్టి దుస్తుల్లో అనసూయ రచ్చ.. విదేశాల్లో అరాచకంగా అలా పోజులు

  |

  ఓ వైపు యాంకర్​గా, మరోవైపు నటిగా పాపులారిటీ తెచ్చుకుంది అనసూయ భరద్వాజ్. ఇటీవలే వాంటెడ్​ పండుగాడ్​ మూవీతో ప్రేక్షకులను పలకరించిన అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్​ బిజీగా ఉంది. సినిమాలే కాకుండా సోషల్​ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్​గా ఉంటుంది. హాట్​గా ఫొటోలతో అట్రాక్ట్​ చేసే ఈ బ్యూటిఫుల్ యాంకర్​ ఘాటు కామెంట్స్​తో ట్రోలింగ్​ బారిన పడుతుంది. ఏది ఏమైనా తగ్గేదే లే అంటూ తన గ్లామర్ ను, తనకు నచ్చిన వీడియోస్ పోస్ట్ చేస్తూ ఎప్పుడూ హైలెట్ అవుతోంది ఈ గ్లామరస్ యాంకర్. ఈ క్రమంలోనే తాజగా మరో కొన్ని ఫొటోలను వదిలింది యాంకర్ అనసూయ.

   తక్కువ సమయంలోనే..

  తక్కువ సమయంలోనే..

  బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లుగా వెలుగొందుతోన్నారు. అందులో కొందరు మాత్రమే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఒకరు. యాంకర్‌గా పరిచయమైన చాలా తక్కువ సమయంలోనే అందంతో పాటు హోస్టింగ్‌తో అలరించిన ఈ బ్యూటీ.. వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోయింది. ఫలితంగా సుదీర్ఘ కాలంగా అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై సందడి చేస్తోంది. కెరీర్ పరంగా ఎలా ఉన్నా సోషల్ మీడియాలోనూ అనసూయ భరద్వాజ్ యమ యాక్టివ్‌గా ఉంటోంది.

   చిన్న పాత్ర చేసి..

  చిన్న పాత్ర చేసి..

  'నాగ' అనే సినిమాలో చిన్న పాత్రను చేసి.. ఆ తర్వాత న్యూస్ యాంకర్‌గా అనసూయ భరద్వాజ్ కెరీర్‌ను ప్రారంభించింది. అనంతరం జబర్ధస్త్ షోలోకి హోస్టుగా ఎంట్రీ ఇచ్చింది. అందులో అద్భుతమైన హోస్టింగ్ చేసి అందరి దృష్టిలో పడిపోయింది. దీంతో ఒక్కసారిగా ఫేమస్ అయింది. అప్పటి నుంచి వరుసగా షోలు మీద షోలు చేసుకుంటూ స్టార్‌ యాంకర్‌గా వెలుగొందింది.

   క్షణం, రంగస్థలంతో పాపులారిటీ

  క్షణం, రంగస్థలంతో పాపులారిటీ

  సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న అనసూయ.. సినిమాల్లోనూ సత్తా చాటుతోంది. 'సోగ్గాడే చిన్ని నాయన'తో రీ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం', 'థ్యాంక్యూ బ్రదర్', 'ఖిలాడీ', 'పుష్ప' సహా ఎన్నో చిత్రాలతో పాటు స్పెషల్ సాంగ్‌లనూ చేసింది. క్షణం, రంగస్థలం సినిమాలు మాత్రం ఆమెకు ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టాయి.

   పెద్దగా షోలు చేయని అనసూయ..

  పెద్దగా షోలు చేయని అనసూయ..

  కొన్నేళ్లుగా అనసూయ భరద్వాజ్ బుల్లితెరపై పెద్దగా షోలు చేయడం లేదు. దీనికి కారణం ఆమె సినిమాలనే ఎక్కువగా ఒప్పుకోవడమే. ఇప్పటికే ఆమె 'రంగమార్తాండ', 'వేదాంతం రాఘవయ్య', 'గాడ్ ఫాదర్', 'హరిహర వీరమల్లు', 'పుష్ప 2', 'భోళా శంకర్' వంటి భారీ చిత్రాల్లో భాగమైంది. తద్వారా మరిన్ని భారీ ఆఫర్లను అందుకుంటూ హవా చూపిస్తోంది.

   సుడిగాలి సుధీర్ తో కలిసి..

  సుడిగాలి సుధీర్ తో కలిసి..

  ఈటీవీలో ప్రసారం అవుతోన్న జబర్ధస్త్ షో ద్వారానే అనసూయ యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. సుదీర్ఘ కాలంగా అందులోనే సత్తా చాటుతోంది. అయితే, ఇటీవలే ఈ బ్యూటీ స్టార్ మాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో సుడిగాలి సుధీర్‌తో కలిసి అనసూయ ఓ పిల్లల కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తోంది. ఇక, ఇటీవలే ఆమె జబర్ధస్త్ నుంచి కూడా తప్పుకున్న విషయం తెలిసిందే.

  హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో సందడి

  హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో సందడి

  ఒకవైపు టీవీ షోలు, మరోవైపు సినిమాలు చేయడంతో పాటు అప్పుడప్పుడూ స్పెషల్ సాంగ్‌లు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నప్పటికీ.. సోషల్ మీడియాలోనూ అనసూయ యమ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది.

   షార్ట్ గా ఉన్న బ్లాక్ డ్రెస్..

  షార్ట్ గా ఉన్న బ్లాక్ డ్రెస్..

  ఇటీవల డ్యాన్స్ వీడియోలతో అదరగొట్టిన గ్లామరస్ యాంకర్ అనసూయా భరద్వాజ్ తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో కొన్ని ఫొటోలను వదిలింది. చాలా షార్ట్ గా ఉన్న బ్లాక్ డ్రెస్ ధరించిన అనసూయ తన థైస్ అందాలను ఘాటుగా ఎక్స్ పోజ్ చేసింది. ఈ ఫొటోలు ఫారేన్ లో దిగినట్లుగా తెలుస్తోంది.

  లుకింగ్ గార్జియస్ అంటూ..

  లుకింగ్ గార్జియస్ అంటూ..

  ఈ ఫొటోలను పోస్ట్ చేస్తూ నాతోపాటు సూర్యుడిని కూడా తెచ్చుకున్నాను అంటూ రాసుకొచ్చింది. దీంతో క్షణాల్లో వైరల్ అయిన ఈ ఫొటోలను చూసి రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. అన్ని ఫొటోలు సూపర్బ్ గా ఉన్నాయి మేడమ్, లుకింగ్ గార్జియస్ అంటూ అనసూయను పొగుడుతున్నారు.

  English summary
  Anchor Anasuya Bharadwaj Latest Photoshoot In Short Black Dress Goes Viral In Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X