Anasuya Bharadwaj: లంగా ఓణిలోనూ అనసూయ రచ్చ.. ఆ పార్ట్ చూపిస్తూ వీడియో

యాంకర్ అంటే చలాకీ మాటలతో పాటు కాస్తా గ్లామర్ తో కూడా ఆకట్టుకుంటారు. ఆలాంటి గ్లామరస్ యాంకర్లలో బ్యూటిఫుల్ అనూసయ భరద్వాజ్ ఒకరు. బుల్లితెరపై పాపులర్ యాంకర్‌గా వెండితెరపై అద్బుతమైన నటిగా అందరి అభిమానాన్ని సంపాదించుకుంది. యాంకర్ గా షోలలో గ్లామర్ ఒలకబోస్తూనే వెండితెరపై తనదైన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. అంతేకాకుండా డ్యాన్సులు చేయడంలోనూ అనసూయ తనకు తానే సాటి. ఇక సోషల్ మీడియాలో అనసూయ పోస్ట్ చేసే వీడియోలు, ఫొటోలు, కామెంట్లు మాములుగా ఉండవు. ఈ మధ్య ఫొటోలతో పాటు డ్యాన్స్ వీడియోలతో అదరగొడుతోంది అనసూయ. తాజాగా పోస్ట్ చేసిన వీడియోలో తన అందాలను పదిలంగా చూపిస్తోంది.

బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లుగా వెలుగొందుతోన్నారు. అందులో కొందరు మాత్రమే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఒకరు. యాంకర్‌గా పరిచయమైన చాలా తక్కువ సమయంలోనే అందంతో పాటు హోస్టింగ్‌తో అలరించిన ఈ బ్యూటీ.. వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోయింది. ఫలితంగా సుదీర్ఘ కాలంగా అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై సందడి చేస్తోంది. కెరీర్ పరంగా ఎలా ఉన్నా సోషల్ మీడియాలోనూ అనసూయ భరద్వాజ్ యమ యాక్టివ్‌గా ఉంటోంది.

జబర్దస్త్ షోకి యాంకర్ గా..

జబర్దస్త్ షోకి యాంకర్ గా..

'నాగ' అనే సినిమాలో చిన్న పాత్రను చేసి.. ఆ తర్వాత న్యూస్ యాంకర్‌గా అనసూయ భరద్వాజ్ కెరీర్‌ను ప్రారంభించింది. అనంతరం జబర్ధస్త్ షోలోకి హోస్టుగా ఎంట్రీ ఇచ్చింది. అందులో అద్భుతమైన హోస్టింగ్ చేసి అందరి దృష్టిలో పడిపోయింది. దీంతో ఒక్కసారిగా ఫేమస్ అయింది. అప్పటి నుంచి వరుసగా షోలు మీద షోలు చేసుకుంటూ స్టార్‌ యాంకర్‌గా వెలుగొందింది.

నాగార్జున సినిమాతో రీ ఎంట్రీ..

నాగార్జున సినిమాతో రీ ఎంట్రీ..

సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న అనసూయ.. సినిమాల్లోనూ సత్తా చాటుతోంది. 'సోగ్గాడే చిన్ని నాయన'తో రీ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం', 'థ్యాంక్యూ బ్రదర్', 'ఖిలాడీ', 'పుష్ప' సహా ఎన్నో చిత్రాలతో పాటు స్పెషల్ సాంగ్‌లనూ చేసింది. తద్వారా తన రేంజ్‌ను పెంచుకుంది.

సినిమాలు ఎక్కువగా ఒప్పుకోవడంతో..

సినిమాలు ఎక్కువగా ఒప్పుకోవడంతో..


కొన్నేళ్లుగా అనసూయ భరద్వాజ్ బుల్లితెరపై పెద్దగా షోలు చేయడం లేదు. దీనికి కారణం ఆమె సినిమాలనే ఎక్కువగా ఒప్పుకోవడమే. ఇప్పటికే ఆమె 'రంగమార్తాండ', 'వేదాంతం రాఘవయ్య', 'గాడ్ ఫాదర్', 'హరిహర వీరమల్లు', 'పుష్ప 2', 'భోళా శంకర్' వంటి భారీ చిత్రాల్లో భాగమైంది. తద్వారా మరిన్ని భారీ ఆఫర్లను అందుకుంటూ హవా చూపిస్తోంది.

సుడిగాలి సుధీర్‌తో కలిసి..

సుడిగాలి సుధీర్‌తో కలిసి..

ఈటీవీలో ప్రసారం అవుతోన్న జబర్ధస్త్ షో ద్వారానే అనసూయ యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. సుదీర్ఘ కాలంగా అందులోనే సత్తా చాటుతోంది. అయితే, ఇటీవలే ఈ బ్యూటీ స్టార్ మాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో సుడిగాలి సుధీర్‌తో కలిసి అనసూయ ఓ పిల్లల కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తోంది. ఇక, ఇటీవలే ఆమె జబర్ధస్త్ నుంచి కూడా తప్పుకున్న విషయం తెలిసిందే.

సోషల్ మీడియాలో యమ సందడి..

ఒకవైపు టీవీ షోలు, మరోవైపు సినిమాలు చేయడంతో పాటు అప్పుడప్పుడూ స్పెషల్ సాంగ్‌లు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నప్పటికీ.. సోషల్ మీడియాలోనూ అనసూయ యమ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది.

బతుకమ్మ వేడుకల్లో..

ఎప్పుడూ హాట్ అండ్ గ్లామర్ ఫొటోలతో ఎంటర్ టైన్ చేసే అనసూయ తాజాగా ఓ డ్యాన్స్ వీడియోతో దర్శనమిచ్చింది. బ్లూ అండ్ వయోలెట్ లంగా ఓణిలో తన నాభి అందాలను పదిలంగా చూపిస్తూ సందడి చేసింది. అయితే అమెరికాలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొంది ఈ బ్యూటిఫుల్ యాంకర్. బతుకమ్మ ఆడుతూ కూడా తన అందాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X