Anasuya Bharadwaj: రూటు మార్చిన అనసూయ ?.. ఆ వీడియోస్ తో అలా..

యాంకర్ అంటే చలాకీ మాటలతో పాటు కాస్తా గ్లామర్ తో కూడా ఆకట్టుకుంటారు. ఆలాంటి గ్లామరస్ యాంకర్లలో బ్యూటిఫుల్ అనూసయ భరద్వాజ్ ఒకరు. బుల్లితెరపై పాపులర్ యాంకర్‌గా వెండితెరపై అద్బుతమైన నటిగా అందరి అభిమానాన్ని సంపాదించుకుంది. యాంకర్ గా షోలలో గ్లామర్ ఒలకబోస్తూనే వెండితెరపై తనదైన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. అంతేకాకుండా డ్యాన్సులు చేయడంలోనూ అనసూయ తనకు తానే సాటి. ఇక సోషల్ మీడియాలో అనసూయ పోస్ట్ చేసే వీడియోలు, ఫొటోలు, కామెంట్లు మాములుగా ఉండవు. ఈ మధ్య డ్యాన్స్ వీడియోలతో అదరగొడుతోంది అనసూయ. ఆ వివరాళ్లోకి వెళితే..

భారీ చిత్రాల్లో భాగం..

భారీ చిత్రాల్లో భాగం..

ఓ వైపు యాంకర్​గా, మరోవైపు నటిగా పాపులారిటీ తెచ్చుకుంది అనసూయ భరద్వాజ్. ఇటీవలే వాంటెడ్​ పండుగాడ్​ మూవీతో ప్రేక్షకులను పలకరించిన అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్​ బిజీగా ఉంది. ఇప్పటికే ఆమె 'రంగమార్తాండ', 'వేదాంతం రాఘవయ్య', 'గాడ్ ఫాదర్', 'హరిహర వీరమల్లు', 'పుష్ప 2', 'భోళా శంకర్' వంటి భారీ చిత్రాల్లో భాగమైంది.

కన్యాశుల్కం వెబ్​ సిరీస్​లో..

కన్యాశుల్కం వెబ్​ సిరీస్​లో..

అలాగే సినిమాలే కాకుండా వెబ్​ సిరీస్​లకు కూడా ప్రాధాన్యత ఇస్తానంటోంది అనసూయ. ఇందులో భాగంగానే కన్యాశుల్కం అనే వెబ్​ సిరీస్​లో అనసూయ నటించనుంది. గురజాడ అప్పారావు క్లాసిక్​ నాటకం ఆధారంగా వస్తున్న ఈ సిరీస్​లో మధుర వాణి అనే వేశ్య పాత్రలో అనసూయ నటించనున్నట్లు సమాచారం.

సోషల్ మీడియాలోనూ సందడి..

సోషల్ మీడియాలోనూ సందడి..

అప్పుడప్పుడూ స్పెషల్ సాంగ్‌లు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నప్పటికీ.. సోషల్ మీడియాలోనూ అనసూయ యమ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది.

రూటు మార్చిందా..

రూటు మార్చిందా..

తాజాగా అనసూయ తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసే వీడియోలు చూస్తుంటే రూటు మార్చిందా అనే అనుమానం కలుగుతోంది. నవరస అనే హ్యాష్ ట్యాగ్ తో ఇన్ స్టా లో డ్యాన్స్ వీడియోలు చేస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా ది వారియర్ చిత్రంలో విజిల్ పాటకు డ్యాన్స్ చేస్తూ నవస్త్ర ఎపిసోడ్ 2 అని రాసుకొచ్చింది.

 నవస్త్ర పేరుతో..

నవస్త్ర పేరుతో..

అనసూయ యూట్యూబ్ లో నవస్త్ర పేరుతో పలు వీడియోలు పోస్ట్ చేస్తోంది. అందులో గౌరీ నాయుడుతో పలు విషయాలపై మాట్లుడుతోంది అనసూయ. ఇప్పటికీ రెండు వీడియోలు పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ ఎపిసోడ్స్ పై నెటిజన్ల దృష్టి మరల్చేందుకే ఇన్ స్టా లో డ్యాన్స్ వీడియోలు చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

 నెట్టింట వైరల్..

నెట్టింట వైరల్..

ఇంతకుముందు మహేశ్ బాబు ఒక్కడు మూవీలోని నువ్ ఏ మాయ చేశావో గానీ అనే పాటకు స్టెప్పులేసింది. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా 'నాగ' అనే సినిమాలో చిన్న పాత్రను చేసి.. ఆ తర్వాత న్యూస్ యాంకర్‌గా అనసూయ భరద్వాజ్ కెరీర్‌ను ప్రారంభించింది. అనంతరం జబర్ధస్త్ షోలోకి హోస్టుగా ఎంట్రీ ఇచ్చింది. అందులో అద్భుతమైన హోస్టింగ్ చేసి అందరి దృష్టిలో పడిపోయింది.

 స్టార్ మాలోకి ఎంట్రీ..

స్టార్ మాలోకి ఎంట్రీ..

సుదీర్ఘ కాలంగా అందులోనే సత్తా చాటింది. అయితే, ఇటీవలే ఈ బ్యూటీ స్టార్ మాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో సుడిగాలి సుధీర్‌తో కలిసి అనసూయ ఓ పిల్లల కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తోంది. ఇక, ఇటీవలే ఆమె జబర్ధస్త్ నుంచి కూడా తప్పుకున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X