పొట్టిదుస్తుల కామెంట్లపై అనసూయ ఫైర్.. దుమ్ము దులిపిన రంగమ్మత్త..
జమ్ము, కశ్మీర్‌లో భారత జవాన్లపై ఉగ్రదాడి తర్వాత భారత సరిహద్దుల్లో యుద్ధవాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. భారత సైనికులపై ఆత్మాహుతి దాడి తర్వాత భారత ప్రభుత్వం సరిహద్దుల్లోని జైషే ఉగ్రవాద సంస్థ స్థావరాలపై మెరుపు దాడి చేసింది. భారత్ చేసిన సర్జికల్ స్ట్రయిక్స్‌పై పలువురు సెలబ్రిటీలు తమ ఎమోషన్‌ను ట్వీట్ల రూపంలో వెల్లడించారు. తాజాగా యాక్టర్, యాంకర్ అనసూయ కూడా సోషల్ మీడియాలో స్పందించడం వివాదంగా మారింది. ఇంతకు ఏమైందంటే..

పుల్వామా దాడిపై అనసూయ పోస్టు
పుల్వామా దాడిలో మరణించిన సైనికులకు గతంలో నివాళులర్పించింది. బుధవారం సర్జికల్ స్ట్రయిక్స్‌పై పోస్టు పెట్టింది. భారత వాయు సేనల దాడి చూస్తే నాకు గర్వంగా ఉందని అనసూయ పోస్టులో పేర్కొన్నది.అనసూయ పోస్టుపై కొందరు నెటిజన్స్ తీవ్రంగా స్పందించారు.

నెటిజన్ల అభ్యంతరకరమైన వ్యాఖ్యలు
అనసూయ పోస్టుపై ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ.. ఇంకేముంది.. పొట్టి దుస్తులు వేసుకొని యాంకరింగ్ చేసుకో అని అన్నారు. అంతేకాకుండా పోస్టులు పెట్టడమేనా.. డబ్బులు విరాళం ఇవ్వరా? అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

ఘాటుగా అనసూయ స్పందన
నెటిజన్ల తిక్క కామెంట్లపై అనసూయ ఘాటుగా స్పందించింది. భారత జవాన్ల కోసం నా వంతుగా పోస్టు పెట్టాను. వీలైతే నివాళులు అర్పించండి. మీరు పోస్టులు పెట్టిన తర్వాత మీకు నచ్చింది మీరు చేస్తున్నారుగా. మీకు నిజంగా దేశభక్తి ఉంటే కశ్మీర్ వెళ్లి యుద్ధం చేయండి అంటూ ఘాటుగా స్పందించారు.

రంగమ్మత్త పాత్రతో విజృంభణ
జబర్దస్త్ టెలివిజన్ షోతో మంచి పేరు సంపాదించుకొన్న అనసూయ ఇటీవల వచ్చిన సొగ్గాడే చిన్ని నాయనా, రంగస్థలం సినిమాల్లో మంచి నటనను ప్రదర్శించింది. రంగమ్మత్త పాత్రకు విమర్శకులు ప్రశంసలు లభించాయి. తాజాగా సచ్చిందిరా గొర్రె, మరో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తున్నది.


Click it and Unblock the Notifications











