విభేదాలు ముగిసాయి.. రష్మీ, అనసూయ హాలిడే వెకేషన్.. గోవా ఫొటోలు వైరల్

మరోసారి మేము ఇద్దరం ఫ్రెండ్సే అని ఒక ఫొటో ద్వారా చెప్పేశారు జబర్దస్త్ సుందరాంగులు అనసూయ, రష్మి. గోవాలో సముద్రం ఒడ్డున రాళ్లపైన కూర్చొని చల్లని వేదర్ ని చక్కగా ఎంజాయ్ చేస్తూ.. నవ్వుకుంటున్నారు.

తెలుగు యాంకర్ అనగానే ఓ మూడేళ్ళ కిందటివరకూ సుమ లేదంటే ఝాన్సీ గుర్తుకు వచ్చేవాళ్ళు, అడపాదడపా అనితా చౌదరీ లాంటి వాళ్ళు ఓ మెరుపు మెరిసినా మరీ ఎక్కువ క్రేజ్ ఉన్న వాళ్ళేం కాదు. అయితే ఎప్పుడైతే జబర్దస్త్ అనే కామెడీ షో మొదలయ్యిందో ఇక అప్పుడు తెలుగు టీవీ యాంకర్ అనే ఫార్మాట్ కొత్త వెర్షన్ కి మారింది. అప్పటిదాకా చీర, చుడీదార్, మహా అయితే జీన్స్ టీషర్ట్ లో కనిపించిన తెలుగు వ్యాఖ్యాత ఒక్కసారిగా స్కర్ట్ లూ, షార్ట్స్లోకి మారి పోయింది... అనసూయ ఆ తర్వాత రష్మీ జబర్దస్త్ షోకే కాదు అప్ కమింగ్ యాంకర్లకు కూడా రోల్ మోడల్ అయ్యారు...

Recommended Video

Ram Charan Working With Anchor Anasuya
జబర్దస్త్ సుందరాంగులు

జబర్దస్త్ సుందరాంగులు

ఇక జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లో కమేడియన్ల కామెడీనే కాదు ఈ ఇద్దరు భామల ఆకర్షణ కూడా ఆ షో హిట్ అవటానికి ఒక కారణం. గతం లో కొన్ని సారు ఈ ఇద్దరి మధ్యా విభేదాలు వచ్చాయని చెప్పుకున్నారు గానీ. కేవలం మామధ్య ఉన్నది. ఫ్రొఫెషన్ పరమైన పోటీ తప్ప మరే గొడవాలేదని తేల్చి పడేసారు ఈ జబర్దస్త్ సుందరాంగులు..

 ఇద్దరం ఫ్రెండ్సే అని చెప్పటానికేమో

ఇద్దరం ఫ్రెండ్సే అని చెప్పటానికేమో

ఇకపోతే మరోసారి మేము ఇద్దరం ఫ్రెండ్సే అని ఒక ఫొటో ద్వారా చెప్పేశారు. గోవాలో సముద్రం ఒడ్డున రాళ్లపైన కూర్చొని చల్లని వేదర్ ని చక్కగా ఎంజాయ్ చేస్తూ.. నవ్వుకుంటున్నారు. వారిద్దరూ ఆ స్మైల్ తో ఏం మాట్లాడుకుంటున్నారో గాని చూసిన వారంతా చాలా పాజిటివ్ గా కామెంట్స్ చేశారు.

అసలే జబర్దస్త్

అసలే జబర్దస్త్

ఇలా ఈ ఇద్దరినీ ఒక్క చోట చూస్తూంటే అసలే జబర్దస్త్ అనుకుంటే ఇంకో ఎక్స్ట్రా కూడా కలుపుకుని మరింత అందంగా ఉండే రష్మి కూడా అక్కడే ఉంటే ఇక బీచ్ అందాలనేం చూస్తాం. ఈ ఇద్దరు యాంకర్లూ, అటు సినిమాలలో కూడా గట్టిగానే ట్రై చేస్తున్నారు ఇద్దరి కెరీర్లూ ఇప్పటికైతే ఆశా జనకంగానే ఉన్నాయి...

 గుర్తించడం చాలా ఈజి

గుర్తించడం చాలా ఈజి

ఇక అనసూయ ఈ ఫోటోకి ఒక హార్ట్ టచింగ్ కామెంట్ పెట్టింది. ‘స్ట్రాంగ్ వుమేన్ ను గుర్తించడం చాలా ఈజి.. ఒకరికొకరు ఉన్నత స్థాయికి చేరేందుకు సహకరించుకుంటారు. అంతేకానీ అణగదొక్కేందుకు ట్రై చేయరు' అని ఆ ట్వీట్ లో అనసూయ పేర్కొంది. పైగా వర్కులోనే కాదు.. బయట కూడా స్నేహితులం అంటూ సెలవిచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X