మంచు కొండల్లో కూల్ అవుతున్న అనసూయ.. వీడియోపై సెటైర్లు!

Recommended Video

Anchor Anasuya Enjoying In Gulmarg,Jammu and Kashmir || Filmibeat Telugu

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండి పోతుండటంతో సినిమా తారలంతా చల్లని ప్రదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేసేందుకు పరుగులు తీస్తున్నారు. తెలుగు యాంకర్, నటి అనసూయ తాజాగా తన కుటుంబంతో కలిసి జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని గుల్‌మార్గ్ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. తమ వెకేషన్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.

ఈ సందర్భంగా అనసూయ షేర్ చేసిన ఓ వీడియోపై ఫన్నీ సెటైర్లు పేలుతున్నాయి. కొందరు అభిమానులు తమ కామెంట్లతో ఆమెను ఆటపట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మరో పోస్టులో అనసూయ తన హాట్ ఫోజులతో అభిమానులను కవ్వించారు. మరి ఆ విశేషాలపై మీరూ ఓ లుక్కేయండి.

అపుడు లెటర్స్ దీనిపైనే రాసేవారట...

ఓ వీడియోలో గుల్మార్గ్‌లో పేపర్ ట్రీ బెరడు చూపిస్తూ..... ‘‘మనకు పేపర్, పెన్నులు లేనపుడు దీనిపైనే లెటర్లు రసేవారంట'' అని అనసూయ చెప్పుకొచక్చారు. దీనిపై కొందరు ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ ఫన్నీ కామెంట్స్ చేశారు. ‘పేపర్ లేదన్నారు ఒకే.. మరి పెన్నులు లేని కాలంలో ఎలా రాశారు మేడం' అంటూ సెటైర్లు వేశారు. ఇలాంటి సరదా కామెంట్లతో ఆమెను ఆటపట్టించారు.

హాట్ ఫోజులతో అభిమానులకు కనువిందు

హాట్ ఫోజులతో అభిమానులకు కనువిందు

అనసూయ తరచూ తన అందమైన ఫోటోలు షేర్ చేస్తూ... అభిమానుకు కనువిందు చేస్తుంటారు. గుల్మార్గ్ డైరీస్ పేరుతో అక్కడి ఫోటోలు సైతం ఆమె షేర్ చేశారు. ఈ బ్యూటిఫుల్ యాంకర్ షేర్ చేసిన ఈ పిక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఐలవ్ యూ అనసూయ అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

కొడుకు పుట్టినరోజు స్పెషల్

కొడుకు పుట్టినరోజు స్పెషల్

తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా అనసూయ అండ్ ఫ్యామిలీ గుల్మార్గ్ వెకేషన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ‘నువ్వు నా కొడుకుగా జన్మించావు, నేను తల్లిగా మరో జన్మ ఎత్తాను. నీపై నా ప్రేమ తరగనిది, జీవితాంతం సంతోషంగా ఉండు మై ఛాంపియన్' అంటూ తన కుమారుడిని విష్ చేశారు.

అనసూయ బిజీ బిజీ

అనసూయ బిజీ బిజీ

టీవీ యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ బుల్లితెర రంగంలో టాప్ యాంకర్‌గా ఎదిగారు. జబర్దస్త్ షో ఆమెకు మరింత పాపులారిటీ తెచ్చిపెట్టింది. మరో వైపు సినిమాల్లోనూ వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళుతున్నారు. గతేడాది విడుదలైన ‘రంగస్థలం'తో అనసూయ క్రేజ్ మరింత పెరిగింది. తాజాగా ఆమె నటించిన ‘కథనం' విడుదలకు సిద్దంగా ఉంది. ‘మహర్షి' తర్వాత మహేష్ బాబు చేయబోయే చిత్రంలో కీలక పాత్రకు ఎంపికైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X