Anasuya Bharadwaj: నేను ఎలా ఉంటే మీకెందుకు.. ఆ వీడియోలు చేసే వారికి యాంకర్ అనసూయ కౌంటర్!
గ్లామరస్ యాంకర్ గానే కాకుండా వెండితెరపై మంచి నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న అనసూయ భరద్వాజ్ మరోసారి సోషల్ మీడియా ద్వారా తన ఆగ్రహాన్ని బయటపెట్టింది. ఇటీవల కాలంలో తప్పుడు ప్రచారాలు ఎక్కువగా కొనసాగుతున్నాయని ఎప్పటికప్పుడు ఫేక్ న్యూస్ లపై చురకలు అంటించారు. ఇక అనసూయ మరోసారి తనపై వస్తున్న నెగిటివ్ ప్రచారాలు చేసే వారికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అనసూయ భరద్వాజ్ ఇటీవల ఇంస్టాగ్రామ్ లైవ్ లో పాల్గొని కొన్ని విషయాలపై చాలా ప్రత్యేకంగా మాట్లాడారు.

పుష్పలో దాక్షాయనిగా..
యాంకర్ గా బుల్లితెరపై మాటలతోనే కాకుండా తన అందంతో కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్న అనసూయ భరద్వాజ్ సినిమాలతో కూడా మంచి నటిగా గుర్తింపు అందుకుంటోంది. రీసెంట్ గా వచ్చిన పుష్ప సినిమాతో ఏ స్థాయిలో క్రేజ్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమాలో అనసూయ దాక్షాయని పాత్రలో తన నట విశ్వరూపాన్ని చూపించింది అని చాలామంది ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.

అనసూయ ఆగ్రహం..
ఇక సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ ఫోటోలను పోస్ట్ చేస్తూ తన ఫాలోవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్న అనసూయ భరద్వాజ్ ఇటీవల ఇన్స్టాగ్రామ్ లైవ్ లో కూడా పాల్గొని అనేక రకాల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అయితే రీసెంట్ గా ఒక విషయం పై అనసూయ చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారాలు చేసేవారికి కౌంటర్ కూడా ఆమె స్పందించారు.

యూ ట్యూబ్ లో అలంటి వీడియోలు..
యూట్యూబ్‌లో అసభ్యకరంగా వీడియోలు పోస్ట్ చేస్తూ థంబ్‌నెయిల్స్ కూడా దారుణంగా పెడుతున్నారంటూ అనసూయ ఆగ్రహం వ్యక్తం చేశారు. రీసెంట్ గా కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పెట్టే థంబ్ నెయిల్స్ లలో అనసూయ ఎంత లావు అయిపోయిందో చూడండి.. చూస్తే షాక్ అవుతారు అని పెట్టారు.. అవి చాలా చిరకును తెప్పించాయని అన్నారు.

అది నా క్యారెక్టర్ కాదు..
సాధారణంగా ఇలాంటివి నేను పట్టించుకోవద్దని అనుకుంటాను. కానీ ఎల్లప్పుడూ ఒకే తరహాలో స్ట్రాంగ్‌గా ఉండలేము కదా.. అందరికీ వీక్ మూమెంట్స్ ఉంటాయని అనసూయ చెప్పింది.
ఇక తాను బరువు పెరగడం లేదా తగ్గడం అన్నది తన ఇష్టమని కానీ మీ దిగజారుడుతనాన్ని ఎలా చూస్తారో అర్థం కావడం లేదు. నెగిటివ్ గా కామెంట్స్ చేసేవాళ్లని అడుగుతున్నాను. నేను కూడా మీలా మాట్లాడగలను. బాధ పెట్టేలా చేయగలను కానీ అది నా క్యారెక్టర్ కాదు అంటూ అనసూయ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పవర్ఫుల్ పాత్రలో..
ఇక పుష్ప సినిమాలో అనసూయ భరద్వాజ్ చేసిన పాత్ర కోసం ఓ వర్గం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇక మొదటి పార్ట్ లో ఆమె పాత్ర చాలా తక్కువ సమయంలోనే కనిపించింది. ఇక రెండవ భాగంలో మాత్రం ఆమె పాత్రకు సంబంధించిన సన్నివేశాలను ఇంకా పవర్ఫుల్ గా ఉంటాయని తెలుస్తోంది. అలాగే అనసూయ మెగాస్టార్ ఆచార్య సినిమాలో కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నారు.


Click it and Unblock the Notifications











