స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో అనసూయ ఫ్రీ షో.. పాలాభిషేకం, నడుము మడతల్లో అంటూ!
మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కామెడీ షో జబర్దస్త్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. మొదట్లో సినిమాల్లో తెగ సందడి చేసిన ఈ గ్లామరస్ బ్యూటి తర్వాతి కాలంలో యాంకర్ గా ఎనలేని క్రేజ్ అందుకుంది. ఇప్పుడు సినిమాలతో ఫుల్ బిజీగా మారిన ఈ సుందరి సోషల్ మీడియాలో అదిరిపోయే అందాలతో కవ్విస్తోంది. తాజాగా యూత్ మతులు చెడగొట్టేలా స్టన్నింగ్ పోజులతో హాట్ షో చేసింది. ఆ ఫొటోలపై ఓ లుక్కేస్తే..
అందరి దృష్టిలో : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, సదా నటించిన 'నాగ' సినిమాలో చిన్న పాత్రను చేసి.. ఆ తర్వాత న్యూస్ యాంకర్‌గా అనసూయ భరద్వాజ్ కెరీర్‌ను ప్రారంభించింది. జబర్ధస్త్ షోలోకి హోస్టుగా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇందులో అద్భుతంగా యాంకరింగ్ చేయడంతోపాటు అందాల విందు చేసింది. దీంతో అందరి దృష్టిలో పడి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది ఈ యాంకర్.

నాగార్జునతో : జబర్దస్త్ షో ద్వారా తెగ క్రేజ్ అందుకున్న బ్యూటిఫుల్ అనసూయ అప్పటి నుంచి వరుసగా షోలు మీద షోలు చేసుకుంటూ స్టార్ యాంకర్‌గా పేరు తెచ్చుకుంది. అలా చాలా కాలంగా బుల్లితెరపై హవాను చూపిస్తూ దూసుకుపోయిన ఈ బ్యూటిఫుల్ మరోవైపు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటింది. టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో నాగార్జున 'సోగ్గాడే చిన్ని నాయన'తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది అనసూయ.

స్పెషల్ సాంగ్ : నాగార్జున సినిమా తర్వాత వరుసగా 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం', 'థ్యాంక్యూ బ్రదర్', 'ఖిలాడీ', 'పుష్ప' సహా ఎన్నో సినిమాలతోపాటు స్పెషల్ సాంగ్‌లు కూడా చేసింది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సమర్ఫించిన వాంటెడ్ పండుగాడ్ మూవీలో ఓ కీలక పాత్ర పోషించింది ఈ సుందరి. అలాగే ఇందులో ఓ స్పెషల్ సాంగ్ చేసి అందులో ఘాటుగా అందాలను ఆరబోసింది.
రాబోయే సినిమాలు: ప్రస్తుతం బుల్లితెరపై ఎక్కువగా కనపడని ముద్దుగుమ్మ అనసూయ సినిమాల్లో హవా చాటే ప్రయత్నం చేస్తోంది. డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన రంగమార్తాండ చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో అహంకారం ఉన్న కోడలి పాత్రలో ఒదిగిపోయింది. ఇదే కాకుండా వేదాంతం రాఘవయ్య, హరిహర వీరమల్లు, పుష్ప 2, భోళా శంకర్ సినిమాల్లో అనసూయ నటించనుంది.

అప్డేట్స్ ఇస్తూ..: ప్రస్తుతం సినిమాలపై దృష్టి సారించిన బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ తన చెల్లెలు వైష్ణవిని యాంకర్ గా ఇంట్రడ్యూస్ చేయనుందని అప్పట్లో టాక్ తెగ నడిచింది. కానీ అదేది కార్యరూపం దాల్చలేదు. ఇదిలా ఉంటే సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో నిత్యం సందడి చేస్తూ విపరీతంగా క్రేజ్ అందుకుంటుంది. పర్సనల్, కెరీర్ విషయాలు పోస్ట్ చేస్తూ అప్డేట్స్ ఇస్తుంటుంది.

పాలాభిషేకం చేసి..: రెగ్యులర్ గా సోషల మీడియాలో హాట్ ఫొటోలతో రెచ్చగొట్టే యాంకరమ్మ అనసూయ తాజాగా అలాంటి కొన్ని పిక్స్ వదిలి హీట్ పెంచింది. రెడ్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకున్న అనసూయ వివిధ పోజుల్లో హాట్ షో చేసింది. వీటికి నెటిజన్లు రకారకాలుగా స్పందిస్తున్నారు. "మీ అందానికి నా జీవితం అంకితం చేస్తున్నా. మీకు పాలాభిషేకం చేసి ఆ పాలను మా ఇంట్లో వాళ్లందరం దేవి ప్రసాదంగా స్వీకరిస్తాం" అని ఒకరు రాసుకొచ్చారు. మరొకరు.. "నీ నడుము మడతల్లో నలిగిపోయే గాలిని అడుగు.. నీ మీద నాకున్న ప్రేమను" అని కవిత్వం రాశారు.


Click it and Unblock the Notifications











