యాంకర్ ఝాన్సీ ఆరోగ్యంపై రూమర్లు.. సోషల్ మీడియాలో ఫైర్.. ఆగ్రహంతో ఎమోషన్ పోస్ట్
టెలివిజన్ ని నవ్య స్వామి కరోనా బారిన పడిన వార్త తెలుగు మీడియాలో సంచలనం రేపింది. తన ఆరోగ్యంపై వచ్చిన రూమర్లపై నవ్య తీవ్రంగ స్పందించారు. నవ్య పాల్గొన్న ఓ షోకు యాంకర్ ఝాన్సీ హోస్ట్‌గా వ్యవహరించడంతో దృష్టి అంతా ఆమెపైకి మళ్లింది. ఈ క్రమంలోనే యాంకర్ ఝాన్సీ ముందు జాగ్రత్త చర్యగా స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లారు. అయితే తన ఆరోగ్యంపై మీడియాలో వస్తున్న వార్తలపై యాంకర్ ఝాన్సీ ఘాటుగా స్పందిస్తూ...

పరివార్ 2 షూట్ సందర్భంగా
తెలుగు బుల్లితెరపై పరివార్ లీగ్ 2 అనే రియాలిటీ షోకు యాంకర్ ఝాన్సీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆ షోకు సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్‌ను ఝాన్సీ నేతృత్వంలో షూట్ చేశారు. ఆ షోలో పాల్గొన్న నవ్య స్వామికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. దాంతో ఆ కార్యక్రమంలో పాలొన్న వారిని, అలాగే యూనిట్ సభ్యులపై అధికారులు ఆరా తీస్తున్నారు.

యాంకర్ ఝాన్సీకి ఫోన్ కాల్స్ వెల్లువ
నవ్య స్వామికు కరోనావైరస్ పాజిటివ్ అని తెలియగానే యాంకర్ ఝాన్సీకి మీడియా, సినీ వర్గాల నుంచి పెద్ద ఎత్తున కాల్స్ వెళ్లాయి. తన ఆరోగ్యం గురించి, తన హెల్త్ పరిస్థితి ఎలా ఉందని ఆరా తీయడానికి సన్నిహితులు, స్నేహితులు, మీడియా వర్గాల ఫోన్స్ కాల్‌తో ఆమె కొంత ఆందోళనకు గురైనట్టు కనిపిస్తున్నది. ఆ విషయంపై క్లారిటీ ఇస్తూ నాకు ఎవరూ ఫోన్లు చేయకూడదు అని సోషల్ మీడియాలో వేడుకొన్నారు.

ఉద్దేశపూర్వకంగా మీడియాకు తప్పుడు సమాచారం
యాంకర్ ఝాన్సీ తన ఆరోగ్యం గురించి వెల్లడిస్తూ ఇన్స్‌టాగ్రామ్‌లో స్పందించారు. కొందరు నా ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ నాపై గాసిప్ప్ ప్రచారం చేస్తున్నారు. నాపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని మీడియాకు అందజేస్తున్నారు. వైరస్ పేరుతో ఒకరిని భయాందోళనలకు గురిచేయవద్దు. వారిపై వివక్షకు గురిచేయవద్దు అని యాంకర్ ఝాన్సీ వేడుకొన్నారు.

నాపై ప్రేమకు ధన్యవాదాలు.. కానీ
నా ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ, ఆందోళన గురి అవుతూ ప్రేమను, అభిమానాన్ని కురిపిస్తున్న నా స్నేహితులు, సన్నిహితులకు నిజంగా రుణపడి ఉంటాను. నేను ఆరోగ్యంగా ఉన్నాను. గాసిప్స్ ప్రచారం చేయడానికి మాత్రం దయచేసి నాకు ఎవరూ కూడా కాల్ చేయొద్దు అని యాంకర్ ఝాన్సీ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పేర్కొన్నారు.

యాక్టర్లకు తీవ్రంగా ముప్పు
కోవిడ్ 19 పరిస్థితులు యాక్టర్లకు అత్యంత ముప్పుగా మారాయి. యాక్టర్లకు చాలా ప్రమాదకరంగా కరోనా మారింది. నటీనటుందరూ షూట్స్‌లో ఉండే సమయంలో తప్పకుండా మాస్కులు, ఇతర దుస్తులు ధరిస్తూ కరోనా నుంచి రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువ మంది మధ్య పనిచేసే యాక్టర్లకే ఈ వ్యాధి త్వరగా సోకే అవకాశం ఉంది. యూనిట్ సభ్యులందరూ పీపీఈ దుస్తులు ధరించాలి. యాక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ తర్వాత ఎవరినీ నిందించ వద్దు అని ఝాన్స్ వేడుకొన్నారు.
Recommended Video

ఝాన్సీపై రూమర్లు ఇవే
ఇదిలా ఉండగా, యాంకర్ ఝాన్సీ కరోనావైరస్ సోకిన పరిస్థితుల్లోనే ఆమె పరివార్ లీగ్ 2 షో షూట్ చేశారు. ఆ కారణంగానే నవ్య స్వామికి కరోనా సోకింది. అలా మరికొంత మందికి కూడా కరోనా సోకి ఉండవచ్చనే వార్తలను కొందరు స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నించారు అని ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. నవ్యస్వామికి కరోనా సోకిన నేపథ్యంలో ఆమె స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లారు.


Click it and Unblock the Notifications











