For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఖరీదైన కారును కొన్న అరియాానా గ్లోరి.. దాని ధర ఎంతంటే?

  |

  మొదట ఒక యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన అరియానా గ్లోరీ బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమె యాంకర్ గా అడుగు పెట్టే ముందు వరకు కూడా నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చింది. ఇక పేదరికంతో అలసిపోయిన అరియానా ఒక్కసారిగా బోల్డ్ గా మారిపోయింది. జీవితంలో తనకు తాను సొంత కాళ్లపై నిలబడాలని ఆ ప్రయత్నాలు చేసింది.

  ఇక ఫైనల్ గా బిగ్ బాస్ లోకి అడుగు పెట్టి మెల్లగా తన కలలను నెరవేర్చుకుంటోంది రీసెంట్ గా అరియానా గ్లోరీ మొత్తానికి ఒక మంచి కార్లు కొనుగోలు చేసింది. రీసెంట్ గా ఈ కారుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇక ఆ కారు ధర ఎంత అనే వివరాల్లోకి వెళితే..

  Bigg Boss Telugu 5 Promo: ఆమె విషయంలో పెద్ద తప్పు చేసిన షణ్ముఖ్.. హౌస్‌లో షాకింగ్ విజువల్స్

  రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ ద్వారా క్రేజ్..

  రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ ద్వారా క్రేజ్..

  అరియానా గ్లోరీ బిగ్ బాస్ కు సీజన్ 4 లో అడుగుపెట్టే ముందు వరకు ఒక యాంకర్ అని అందరికీ తెలిసిన విషయమే. అయితే అంతకుముందు ఆమె ఎన్నో ఇంటర్వ్యూలు చేసింది. కానీ వాటన్నిటినీ కంటే కూడా భారీ స్థాయిలో వైరల్ అయినా ఒకే ఒక్క ఇంటర్వ్యూ మాత్రం రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూ అనే చెప్పాలి. అరియానా గ్లోరీ బోల్డ్ ప్రశ్నలకు అలాగే రామ్ గోపాల్ వర్మ సూటి ప్రశ్నలకు ఒక్కసారిగా ఆ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లిస్టులో చేరిపోయింది.

  థైస్ బాగున్నాయి అనడంతో..

  థైస్ బాగున్నాయి అనడంతో..

  అరియానా గ్లోరీ థైస్ బాగున్నాయి అంటూ రాంగోపాల్ వర్మ మొదటి సారి ఒక యాంకర్ బోల్డ్ గా కామెంట్ చేశాడు. ఒక విధంగా రామ్ గోపాల్ వర్మ సరికొత్త కోణం కూడా అక్కడి నుంచే మొదలైందని చెప్పవచ్చు. ఇక తర్వాత అరియానా గ్లోరీకి అనేక ఇంటర్వ్యూలు చేసే అవకాశం కూడా వచ్చింది. ఒక విధంగా రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ అరియానా గ్లోరీకి మంచి క్రేజ్ ను అందించాయనే చెప్పాలి. ఇక ఆ తర్వాత మెల్లగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.

   అతనితో కెమిస్ట్రీ హైలెట్..

  అతనితో కెమిస్ట్రీ హైలెట్..

  బిగ్ బాస్ లోకి అడుగు పెట్టిన అనంతరం అరియాన ఎక్కువ రోజులు ఉండదేమో అని అందరూ అనుకున్నారు. కానీ తనకంటే సీనియర్ సెలబ్రిటీలకు కూడా సరైన పోటీ ఇచ్చిన అరియానా కొంతమంది కంటెస్టెంట్స్ తో లవ్ ట్రాక్ కూడా అందంగా కొనసాగించింది ఒకవైపు తన ఆటను ఆడుతూనే మరోవైపు గ్లామర్ తో కూడా సరికొత్తగా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా అవినాష్ తో ఆమె కెమిస్ట్రీ బిగ్ బాస్ సీజన్ 4 లో హైలెట్ గా నిలిచింది.

  అలా ఆదాయం పెంచుకుంటూ

  అలా ఆదాయం పెంచుకుంటూ

  ఇక బిగ్ బాస్ హౌస్ ద్వారా అరియానా రెమ్యునరషన్ ను కూడా గట్టిగానే అందుకుంది. మొదట్లోనే వెళ్ళిపోవాల్సిన ఆమె చివరి వరకు పోరాడి టాప్ 5 కంటెస్టెంట్ లో ఒకరిగా నిలిచింది. అరియానా బయటకు వచ్చిన తర్వాత కూడా అవినాష్ తో ఇంటర్వ్యూలు కొనసాగిస్తూ యూట్యూబ్ ఛానల్ కు కూడా మంచి క్రేజ్ ను తీసుకొచ్చింది. అలాగే ఇతరుల యూట్యూబ్ చానల్స్ లో కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ మంచి ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేసింది.

  బిగ్ బాస్ సీజన్ 4 హౌస్ మేట్స్ తో కారులో సరదాగా

  బిగ్ బాస్ సీజన్ 4 హౌస్ మేట్స్ తో కారులో సరదాగా

  ఇక రీసెంట్ గా అరియానా గ్లోరీ ఒక ఖరీదైన కారును కొనుగోలు చేసింది. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక చాలా మంది వారి సెలబ్రేట్లు వారి డ్రీమ్ కారును కొనుగోలు చేశారు. ఇక ఇప్పుడు అరియానా కూడా కియా కంపెనీకి చెందిన మంచి కారును కొనుగోలు చేసింది. అలాగే కొత్త కారు కొన్న శుభ సందర్భంలో తన సన్నిహితులకు కూడా పార్టీ ఇచ్చింది. బిగ్ బాస్ సీజన్ 4 హౌస్ మేట్స్ ను కూడా ప్రత్యేకంగా పిలిచినట్లు తెలుస్తోంది. సోహెల్ కూడా కారులో కనిపిస్తున్నాడు.

  Megastar Chiranjeevi Launches The Trailer Of Sai Dharam Tej’s Republic
  అరియానా కొత్త కారు.. ఖరీదు ఎంతంటే?

  అరియానా కొత్త కారు.. ఖరీదు ఎంతంటే?

  ఇక దాని ఖరీదు ఎంత అంటే.. దాదాపు రూ.13 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఎప్పటి నుంచో సొంతంగా మంచి కారు కొనుక్కోవాలని చూస్తున్న అరియానా మొత్తానికి ఇప్పుడు తన కలను నెరవేర్చుకుంది. కొత్త కారుకు సంబంధించిన ఫోటోలను కూడా అరియానా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. దేవుడికి ధన్యవాదాలు తెలుపుకుంటు.. కొత్త కారును జీవితంలోకి ఆహ్వానిస్తున్నట్లు స్పెషల్ గా కామెంట్ చేసింది. ఇక న్యూ కార్ ఎలా ఉందని కూడా తన ఫాలోవర్స్ ను అడిగింది.

  English summary
  Anchor ariyana glory new costly car photos shared in social media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X