బిగ్ బాస్ అరియానా గ్లోరి సీక్రెట్స్ వింటే షాక్ అవ్వాల్సిందే.. నాగార్జునకు బోల్డ్ పంచ్ వేసింది!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ఆదివారం భారీ హంగులతో మొదలైంది. గత రెండు నెలల నుంచి వైరల్ అవుతున్న కంటెస్టెంట్స్ లిస్ట్ కి ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది. దాదాపు రూమర్స్ చాలా వరకు నిజమయ్యాయనే చెప్పాలి. వచ్చిన 16 మంది పేర్లు చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అయినవె. ఇక ఎవరు ఊహించని విధంగా ఎంట్రీ ఇచ్చింది మాత్రం అరియానా గ్లోరి.
Recommended Video

బోల్డ్..బోల్డ్ అంటూనే..
అరియానా గ్లోరి అనే ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్లు ఉందని చాలా మంది కొన్ని నిమిషాల పాటు అదే పనిగా ఊహించుకొని ఉంటారు. ఇక అమ్మడు బోల్డ్ అనే కాన్సెప్ట్ తో ఎంట్రీ ఇచ్చిన విధానం వైరల్ అవుతోంది. నేను బోల్డ్..బోల్డ్ అంటూనే తనను తాను సరికొత్తగా పరిచయం చేసుకుంది.

అందుకే నేను బోల్డ్..
బిగ్ బాస్ సీజన్ 4 పదవ కంటెస్టెంట్ గా హౌజ్ లోకి అడుగుపెట్టిన ఈ అరియానా గ్లోరి ఇచ్చిన స్పీచ్ కూడా అందరిని షాక్ కి గురి చేసింది. కట్టుబాట్లు, దుప్పట్లు కప్పేసిన మనసుతో సమాజంలో ముందుకు వెళ్ళడానికి భయపడుతున్నారు. కానీ నేను మాత్రం కాలం అందుకోలేనంత వేగంగా పరుగులు తీసే ఎన్నో పనులు చేశా. అందుకే నేను బోల్డ్.

నా బట్టలపై ఎవరైనా కామెంట్ చేస్తే..
నా బట్టలపై ఎవరైనా కామెంట్ చేసినా కూడా వనికిపోయె రకమైతే నేను కాదు. అందుకే నేను ఒక బోల్డ్ యాంకర్ అంటూ ఈ బ్యూటీ ఎంట్రీతోనే అద్భుతమైన మాటలతో కొంత బజ్ క్రియేట్ చేసుకుంధి. ఇక నాగార్జున ఆమెను ఈ అసలు పేరేమిటి అని అడగ్గా.. అదే నా సక్సెస్ సెంటిమెంట్ అనేలా అమ్మడు నేను చెప్పలేను అని పంచ్ వేసింది.

RGV బికినీ గర్ల్..
ఇక ఈ బ్యూటీ అసలు వివరాల్లోకి వెళితే.. ఆ మధ్య రామ్ గోపాల్ వర్మతో చేసిన ఒక ఇంటర్వ్యూలో ఆమె RGV నుంచి బోల్డ్ కామెంట్స్ అందుకుంది. మిమ్మల్ని బికినీలో చూడాలని అనుకుంటున్నాను అంటూ అరియానాకు డే నైట్ లోనే మంచి క్రేజ్ అందించాడు.

పేరు మార్చుకొని యాంకర్ గా..
ఇక ఈ బ్యూటీ అసలు పేరు మంగలి అర్చన. తెలంగాణ తాండూరు ప్రాంతానికి చెందిన ఈ యాంకర్ ఒక సాదారణ కుటుంబంలోని జన్మిచ్చింది. డిగ్రీ ఫైనల్ ఇయర్ లోనే హైదరాబాద్ బాట పట్టి యాంకర్ గా ట్రై చేసింది. అర్చన అనే పేరు వద్దని అరియానా గ్లోరి అని పేరు మార్చుకుంది. అప్పటి నుంచి ఇండస్ట్రీలో స్టార్స్ ని ఇంటర్వ్యూలు చేస్తూ మంచి క్రేజ్ అందుకుంది.


Click it and Unblock the Notifications











