బిగ్‌బాస్‌లోకి మరో యువ యాంకర్: బ్యూటీ ఎంట్రీ వెనుక ఆర్జీవీ హస్తం!
సరికొత్త థీమ్‌తో వచ్చినప్పటికీ... తక్కువ సమయంలోనే ఎవరూ ఊహించని రీతిలో ప్రేక్షకాదరణను అందుకున్న షో 'బిగ్ బాస్'. తెలుగులోకి ఆలస్యంగా ఎంటరైనప్పటికీ... దీనికి బాగా క్రేజ్ వచ్చింది. అందుకే ఈ షో ఇప్పటికే మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకోగలిగింది. ఇక, నాలుగో సీజన్‌కు సన్నద్ధం అవుతోన్న 'బిగ్ బాస్'.. గురించి రోజుకో వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో నాలుగో సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల వివరాలు ఒక్కొక్కటిగా లీక్ అవుతున్నాయి. ఇందులో భాగంగానే మరో కంటెస్టెంట్ పేరు బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే....

మొదటి మూడు సీజన్ల విషయాలు ఇవే
తెలుగులో బిగ్ బాస్ షో మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. మొదటి సీజన్‌ను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేశాడు. అందులో యాక్టర్ శివ బాలాజీ విజేతగా నిలిచాడు. ఆ తర్వాతి దానిని నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేయగా... కౌశల్ మందా ట్రోఫీని అందుకున్నాడు. ఇక, అక్కినేని నాగార్జున హోస్ట్ చేసిన మూడో సీజన్‌లో సింగర్ రాహుల్ సిప్లీగంజ్ గెలుపొందాడు.

ఎంతో పేరొచ్చింది..... వివాదాలు కూడా
ఏమాత్రం అంచనాలు లేకుండా తెలుగులో ప్రారంభం అయింది బిగ్ బాస్ షో. దీనికి ఎంత పేరొచ్చిందో... అదే స్థాయిలో వివాదాస్పదం కూడా అయింది. హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య గొడవల కారణంగా కొన్ని... హోస్ట్, కంటెస్టెంట్ల వ్యవహార శైలితో కొన్ని వివాదాలు చెలరేగాయి. ఇక, కాస్టింగ్ కౌచ్ అంటూ కొందరు కోర్టు మెట్లు ఎక్కడంతో తెలుగు బిగ్ బాస్ దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది.

నాలుగోది కూడా సిద్ధం అవుతుందిగా
బిగ్ బాస్ నాలుగో సీజన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దాని గురించి ఎన్నో ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్టార్ మా సీజన్ -4పై అధికారిక ప్రకటన చేసింది. ఇది త్వరలోనే ప్రారంభం కాబోతుందని అందులో వెల్లడించింది. ఈ మేరకు ఓ టీజర్ కూడా విడుదల చేసింది.

హోస్ట్ కన్ఫార్మ్.. కంటెస్టెంట్ల పేర్లు కూడా
మూడు సీజన్లకు ముగ్గురు కంటెస్టెంట్లు మారడంతో... నాలుగో దానికి కూడా మరొక హీరో ఎంట్రీ ఇస్తాడని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. కానీ, కింగ్ నాగార్జున షూటింగ్‌లో పాల్గొన్నట్లు చేసిన ట్వీట్‌తో, ఆయనే దీనిని హోస్ట్ చేస్తున్నట్లు కన్ఫార్మ్ అయింది. ఇక, కంటెస్టెంట్లుగా మంగ్లీ, మంజూష, వర్షిణి, నందూ, తాగుబోతు రమేష్, పూనమ్ బజ్వా తదితరులు ఉంటారని అంటున్నారు.

బిగ్ బాస్‌లోకి మరో అందమైన అమ్మాయి
బిగ్ బాస్ సీజన్ -4లో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి రోజుకో వార్త బయటకు వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో కంటెస్టెంట్ వివరాలు లీక్ అయ్యాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌లో యాంకర్‌గా పని చేస్తున్న అరియానా గ్లోరీ ఈ సీజన్‌లో పాల్గొనబోతుందట. ఇప్పటికే ఆమెతో స్టార్ మా సిబ్బంది ఒప్పందం కూడా చేసుకున్నారని టాక్.
ఆమె ఎంట్రీకి ఆర్జీవీ చేసిన ట్వీటే కారణం.!
ఇటీవల సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మను అరియానా ఇంటర్వ్యూ చేసింది. ఆ సమయంలో ‘మీకు ఈ మధ్య కాలంగా బాగా నచ్చిన అమ్మాయి ఎవరు' అని ప్రశ్నించిదామె. దానికి ఆర్జీవీ ‘చాలా మంది నచ్చారు. అందులో నువ్వు కూడా' అని బదులిచ్చాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. దీన్ని రాంగోపాల్ వర్మ స్వయంగా ట్వీట్ చేయడం విశేషం.
Recommended Video

ఎవరీ అందమైన అమ్మాయి.. వివరాలివే
హైదరాబాద్‌కు చెందిన అరియానా గ్లోరీ.. పలు టీవీ ఛానెళ్లలో యాంకర్‌గా పని చేసింది. ఈ క్రమంలోనే తన అందంతో పాటు వాక్చాతుర్యంతో ఎన్నో అవకాశాలు అందుకుంది. ఇలా వరుస ఆఫర్లతో బిజీ బిజీగా సాగుతున్న సమయంలోనే ఫేమస్ యూట్యూబ్ ఛానెల్‌లో పని చేసేందుకు సంతకం చేసింది. ఆ తర్వాత మరికొన్ని ఛానెళ్లలోకి ఎంట్రీ ఇచ్చి పాపులారిటీని సంపాదించుకుంది.


Click it and Unblock the Notifications











