Bigg Boss Telugu 6: ఆ ఛానెల్ నుంచి మరో యాంకర్.. ఎవరీ ఆరోహి రావు?
విభిన్నమై కంటెంట్, కాన్సెప్ట్‌తో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది బిగ్‌బాస్ రియాలిటీ షో. అత్యధిక అభిమానులను సంపాదించుకున్న ఈ బిగ్‌బాస్ రియాలిటీ షో కొత్త సీజన్ అంటే ఆరో సీజన్ సెప్టెంబర్ 4 ఆదివారం రోజున ప్రారంభమైంది. ఈ సీజన్లో బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో భాగాంగానే ప్రముఖ యాంకర్ ఆరోహి రావు బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అయింది. ఇక ఆమె వివరాళ్లోకి వెళితే..

ఇదే ఛానెల్ నుంచి..
బిగ్‌బాస్ రియాలిటీ షోలో ఇదివరకు టీవీ9 నుంచి యాంకర్ దేవి నాగవల్లీ వచ్చి అలరించిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే ఛానెల్ నుంచి మరో యాంకర్‌ను దింపాడు బిగ్‌బాస్. ఆమె ఎవరో కాదు యాంకర్ ఆరోహి రావు. తెలంగాణలోని వరంగల్‌లో పుట్టి పెరిగిన ఆరోహి రావు టీవీ9 యాంకర్‌గా పాపులర్ అయింది. ప్రధానంగా ఇస్మార్ట్ న్యూస్‌తో చాలా ఫేమస్ అయింది.

యాంకర్‌గా కెరీర్..
ఇక ఆరోహి రావు వ్యక్తిగత విషయాల్లోకి వెళితే.. ఆమె హన్మకొండలోని వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేసింది. తన డిగ్రీ విద్య పూర్తయిన తర్వాత యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆరోహి రావు మొదటగా భీమ్స్ మీడియాలో వర్క్ చేసింది.

వివిధ సంస్థల్లో..
ఆ తర్వాత ఐ5 నెట్వర్క్, పొలిటికల్ బెంచ్, తుపాకీ, స్టూడియో న్యూస్, స్టూడియో వన్ ఛానెల్ వంటి వివిధా వార్తా ఛానెల్స్, మీడియా సంస్థలలో యాంకర్‌గా పనిచేసి గుర్తింపు తెచ్చుకుంది. ఇక 2020లో టీవీ9 తెలుగు మీడియా ఛానెల్లో చేరింది. ఈ ఛానెల్లో ఇస్మార్ట్ న్యూస్‌లో భాగంగా అంజలిగా ఆకట్టుకుంది. ఈ షోతో తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది.

టైటిల్ గెలుస్తుందా?
ఇక ఇప్పుడు కొత్త స్టెప్‌గా బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లోకి అడుగుపెడుతుంది. ఇదివరకు ఇదే ఛానెల్ నుంచి దేవి నాగవల్లీ బిగ్‌బాస్ హౌజ్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈసారి వచ్చిన యాంకర్ ఆరోహి రావు టైటిల్ గెలుస్తుందో వేచి చూడాలి.

3 నెలల నుంచే ..
ఇదిలా ఉంటే సాధారణంగా బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ప్రారంభం అవుతుందంటే ఎంతటి హడావిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరో సీజన్ ప్రారంభానికి ముందే అంటే దాదాపు మూడు నెలల నుంచే ఎన్నో రకాల వార్తలు రావడంతో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే దీని నుంచి విడుదలైన ప్రోమోల వల్ల అవన్నీ రెట్టింపు అయ్యాయి.

గ్రాండ్ ఎంట్రీ..
ఈ అంచనాలను రెట్టింపు చేస్తూ ఎంతో గ్రాండ్‌గా ప్రారంభమైంది బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్. హోస్ట్, టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున వైట్ డ్రెస్‌లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నాడు. ముందుగా సీరియల్ నటి కీర్తి భట్ ఎంట్రీ ఇవ్వగా, తర్వాత సుదీప అడుగుపెట్టింది.


Click it and Unblock the Notifications











