కష్టం రాకుండా చూసుకొంటానన్నాడు.. అతడినే పెళ్లి చేసుకొంటా.. యాంకర్ భాను శ్రీ
బుల్లితెర నటిగా, యాంకర్‌గా, హీరోయిన్‌గా అదృష్టాన్ని పరీక్షించుకొంటున్న భానుశ్రీ ప్రస్తుతం పలు రకాల ఈవెంట్లతో బిజీగా ఉంటున్నారు. బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో పాల్గొన్న తర్వాత ఈమె రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇలా ఓ రేంజ్‌కు చేరుకోవడానికి ఎంత కష్టపడ్డారనే విషయం తెలిస్తే ఎవరికైనా ఆవేదన కలుగక మానదు. ఇటీవల కెరీర్ ఆరంభంలో పడిన కష్టాలను వెల్లడిస్తూ గతాన్ని గుర్తు చేసుకొన్నారు. ఇంతకు భానుశ్రీ చెప్పిన విషయాలు ఏమిటంటే..

యాంకర్‌గా, టెలివిజన్ నటిగా
యాంకర్ భానుశ్రీ వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావిస్తే.. తెలంగాణకు చెందిన భాను శ్రీ అసలు పేరు భాను శ్రీ రెడ్డి. స్కూలింగ్, గ్రాడ్యుయేషన్ అంతా హైదరాబాద్‌లోనే జరిగింది. ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీపై ఇష్టంతో టెలివిజన్ రంగంలొకి ప్రవేశించారు. జాబిలమ్మ సీరియల్‌తో కెరీర్‌ను ప్రారంభించారు.

చాలా కష్టాలు పడ్డాను
టెలివిజన్, సినీ పరిశ్రమలోకి వచ్చిన సమయంలో చాలా కష్టాలు పడ్డాను. ఒకనోక సమయంలో హైదరాబాద్‌లో ఉండటానికి చాలా ఇబ్బంది పడ్డాను. అవకాశాలు లేక, సొంతంగా ఇంటికి అద్దె చెల్లించలేని పరిస్థితుల్లో నా స్నేహితుడు ఒకరిని పరిచయం చేశాడు. అతడి పరిచయంతో నా జీవితం మలుపు తిరిగింది అని భాను శ్రీ చెప్పారు.

జీవితంలో కష్టం రాకుండా
తనకు ఇష్టమైన వ్యక్తి గురించి భాను శ్రీ వెల్లడిస్తూ.. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడమే కాకుండా భవిష్యత్‌లో కూడా నా జీవితంలో కష్టం రాకుండా చూసుకొంటాననే నమ్మకాన్ని కలిగించాడు. కొందరు చాలా తొందరగా మారిపోతారు. మాట తప్పుతారు. కానీ ఆయనలో అలాంటి లక్షణాలు కనిపించలేదు. నేను ఎదిగి సమయంలో ధైర్యం చెబుతూ ప్రోత్సాహం అందించారు అని భాను శ్రీ చెప్పారు.

అలాంటి సమయంలో అండగా
సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన సమయంలో ఎవరిని నమ్మాలో తెలిసే కాదు. కొత్తవారితో మాట్లాడాలన్న, వారితో కలువాలన్న భయంగా ఉండేది. ఆ సమయంలో నన్ను ముందుకు నడిపిస్తూ చక్కగా చూసుకొన్నారు. ఆ వ్యక్తినే నేను పెళ్లి చేసుకోబుతున్నాను అని భాను శ్రీ తెలియజేశారు. అయితే అతడి పేరు చెప్పడానికి నిరాకరించారు.
Recommended Video

భాను శ్రీ సినిమాలు ఇవే
భాను శ్రీ సినిమాల విషయానికి వస్తే.. కుమారి 21F, కాటమరాయుడు, ఇద్దరి మధ్య 18, బాహుబలి, ఏడు చేపల కథ లాంటి చిత్రాల్లో నటించారు. అలాగే జాబిలమ్మ సీరియల్, అదిరింది లాంటి షోలో నటించారు. బిగ్‌బాస్ తెలుగు 2తో ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వడమే కాకుండా అభిమానులను కూడా సంపాదించుకొన్నారు.


Click it and Unblock the Notifications











