ఉద్యోగానికి బిత్తిరి సత్తి రాజీనామా.. అదే కారణమంటూ కమెడియన్‌పై ఆగని రూమర్లు!
అతి సాధారణ యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్ తన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదిగి సెలబ్రిటీ స్థానాన్ని సొంతం చేసుకొన్నారు. మీడియా, సినిమా రంగం, ఈవెంట్లు అనే తేడా లేకుండా తన టాలెంట్‌ను ప్రదర్శిస్తూ టాప్ రేంజ్‌కు ఎదిగాడు. అంతేకాకుండా హీరోగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. ప్రస్తుతం టీవీ 9కు రాజీనామా చేయడం మీడియాలో చర్చనీయాంశమైంది. రాజీనామా అసలు కారణం అదేనంటూ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
Recommended Video

సాధారణ కమెడియన్‌గా కెరీర్
చేవెళ్ల రవికుమార్‌గా అతిసామాన్య జీవితాన్ని ప్రారంభించిన ఈ కమెడియన్ జీ తెలుగులో కామెడీ క్లబ్ ప్రొగ్రాం ద్వారా కమెడియన్ అవతారం ఎత్తారు. ఆ తర్వాత నర్సయ్య తాతగా 6టీవీలో చేరి ముదుసలి పాత్రతో ఒడవని ముచ్చట, మన ఊరు లాంటి న్యూస్ సంబంధిత కార్యక్రమాలతో ఆకట్టుకొన్నారు.

వీ6 చేరిన తర్వాత బిజీగా
ఇక వీ6 ఛానెల్‌లో బిత్తిరి సత్తిగా అవతారం ఎత్తడంతో ఈ కమెడియన్ జాతకం ఊహించని విధంగా మారిపోయింది. బిత్తిరి సత్తి వేష భాషలకు అనూహ్యమైన స్పందన రావడంతో సెలెబ్రిటీగా మారిపోయారు. యూట్యూబ్‌లో అనూహ్యమైన క్రేజ్, ఫాలోయింగ్ ఏర్పడింది. అంతేకాకుండా ఆయన వీడియోలకు మిలియన్ల వ్యూస్ రావడంతో ఆ క్రేజ్ మరింత పెరిగింది.

సెలబ్రిటీ స్టాటస్‌తో స్టార్ కమెడియన్‌గా
సెలబ్రిటీ స్టేటస్‌ను అందుకొన్న బిత్తిరి సత్తి పలు ఈవెంట్లు, కార్యక్రమాల్లో స్టార్ ఎట్రాక్షన్‌గా మారిపోయారు. అత్యధిక రెమ్యునరేషన్ డిమాండ్ చేసే కమెడియన్‌గా ఎదిగిపోయాడు. ఆ తర్వాత తీన్మార్ న్యూస్, తీన్మార్ వీకెండ్ న్యూస్ మరింత ప్రేక్షకాదరణను మూటగట్టుకొన్నారు. ఈ క్రమంలో తుపాకి రాముడు సినిమాలో హీరోగా నటించే అవకాశం రావడంతో దానిని సద్వినియోగం చేసుకొన్నారు. అయితే ఆశించినంత విజయం దక్కకపోవడంతో సినిమా రంగంవైపు దృష్టిని మరల్చి మళ్లీ మీడియాలోనే కొనసాగాలని నిర్ణయం తీసుకొన్నారు.

టీవీ9లో ఇస్మార్ట్ న్యూస్‌తో
అయితే వీ6 ఛానెల్‌లో పనిచేస్తున్న సమయంలోనే టీవీ9 ఛానెల్‌లో చేరారు. అక్కడ ఇస్మార్ట్ న్యూస్ అనే కొత్త కాన్సెప్ట్‌తో షోను ప్రారంభించాడు. అయితే వీ6లో లభించినంత ప్రేక్షకాదరణ లేకపోవడంతో ఆ ప్రొగ్రాం చప్పగా సాగుతూ ముందుకెళ్లింది. అయితే అనూహ్యంగా జూన్ 23వ తేదీన టీవీ9కి రాజీనామా చేయడం వెనుకు అనేక కథనాలు వినిపించాయి. అవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నారనే ఓ వార్త ప్రచారంలో ఉంది.

ఉద్యోగానికి రాజీనామాతో
తెలుగులో బిగ్‌బాస్ నాలుగో సీజన్ ప్రారంభానికి రంగం సిద్ధమవుతున్నది. ఈ క్రమంలోనే బిత్తిరి సిత్తి రాజీనామా వార్త మీడియాలోకి రావడం చర్చనీయాంశమైంది. ఆ కారణంతేనే ఉద్యోగానికి రాజీనామా చేశాడనే వార్తలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. అయితే బిత్తిరి సత్తి రాజీనామాకు కారణం ఆయన స్పందిస్తే అసలు విషయం బయటపడుతుందనే కొందరు తమ వాదనను వినిపిస్తున్నారు.

త్వరలోనే బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్
ఇదిలా ఉండగా, అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించే బిగ్‌బాస్ తెలుగు సీజన్4 రియాలిటీ షో త్వరలోనే ప్రారంభం కానున్నది. ఇప్పటికే ఈ కార్యక్రమం మొదలు కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా కాస్త ఆలస్యమైంది. అయితే బిగ్‌బాస్ 3 సీజన్ జూలై చివరి వారంలో గానీ, లేదా ఆగస్టు మొదటి వారంలో ప్రారంభం కానున్నదనే వార్తలు వెలువడుతున్నాయి.


Click it and Unblock the Notifications











