Bigg Boss Season 7: బిగ్ బాస్‌లోకి హాట్ యాంకర్.. ఇక మసాలాకి లోటేం ఉండదు

త్వరలోనే బిగ్ బాస్ ఏడవ సీజన్ తెలుగులో ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో చాలామంది హౌజ్ లోపలికి వెళ్ళబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఒక హాట్ యాంకర్ గురించి కూడా కొత్త ప్రచారం మొదలైంది. ఆమె బిగ్ బాస్ హౌజ్ లోపలికి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. నిజానికి గత సీజన్ లో చాలామంది యాంకర్లు బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు అదే కోవలో మరొక యాంకర్ కూడా ఎంట్రీ ఇవ్వబోతుందని అంటున్నారు. ఆమె మరెవరో కాదు దీపికా పిల్లి. ఆ వివరాల్లోకి....

మిలియన్స్ ఫాలోయర్స్:హాట్ యాంకర్ దీపికా పిల్లి ఒక సోషల్ మీడియా స్టార్ నుంచి ఇప్పుడు మంచి యాంకర్ గా ఎదిగిన తీరు చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకప్పటి టిక్ టాక్ స్టార్ ఇప్పుడు యాంకర్ అయింది. విజయవాడ దగ్గరలో పుట్టి పెరిగిన దీపిక పిల్లి మొదట్లో టిక్ టాక్ వీడియోలు చేసేది. అలా ఆమెకు అప్పట్లోనే మిలియన్స్ లో ఫాలోవర్స్ అయితే దక్కారు. అలా సోషల్ మీడియా సెలబ్రిటీ గా మారిన ఆమె క్రేజ్ కూడా అదే రేంజ్ లో తెచ్చుకుంది.

Anchor Deepika Pilli Entry to BigBoss Telugu Season 7 News Goes Viral

మంచి క్రేజ్:అయితే అంతా బాగానే ఉందనుకున్న సమయంలో టిక్ టాక్ బ్యాన్ చేయడం దీపికా పిల్లికి పెద్ద షాక్ తగిలింది. అయినా వెనక్కి తగ్గకుండా ఆమె ఇన్ స్టాగ్రామ్ తో తన ఫాలోవర్స్ కి అందుబాటులోకి వచ్చింది. అలా ఆమె సోషల్ మీడియాలో క్రేజ్ చూసి అనూహ్యంగా ఢీ సీజన్ 13 యాంకర్ గా ఆఫర్ ఇచ్చారు. రష్మీ గౌతమ్ తో పాటు ఢీ షోకి దీపికా యాంకర్ గా వ్యవహరించి మంచి క్రేజ్ తెచ్చుకుంది.

వాంటెడ్ పండుగాడు:అందులో రష్మీ-సుడిగాలి సుధీర్ ఒక జంట కాగా దీపికా పిల్లి-హైపర్ ఆది మరొక జంటగా అందరినీ అలరించారు. ఆ తర్వాత దీపికా పిల్లికి సినిమా ఆఫర్ కూడా రావడంతో ఆమె దశ తిరిగిందని అందరూ అనుకున్నారు. వాంటెడ్ పండుగాడ్ మూవీలో దీపికా పిల్లి కీలక పాత్రలో నటించింది. తన అందాలతో ప్రేక్షకులను బాగా అలరించింది.

Anchor Deepika Pilli Entry to BigBoss Telugu Season 7 News Goes Viral

కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్:సీనియర్ దర్శకుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన వాంటెడ్ పండుగాడ్ భారీ డిజాస్టర్ కావడంతో ఆమె కొంత సైలెంట్ అయింది. నిజానికి కనుక సినిమా సూపర్ హిట్ అయి ఉంటే దీపికా పిల్లి కెరీర్ కి బాగా ప్లస్ అయ్యేది. మళ్లీ సినిమా అవకాశాలు రాకపోవడంతో అనిల్ రావిపూడితో ఆ మధ్య కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్ పేరుతో ఓ కామెడీ షో ను చేసింది.

Anchor Deepika Pilli Entry to BigBoss Telugu Season 7 News Goes Viral

బిగ్ బాస్ లోకి:ఆహా లో స్ట్రీమ్ అయిన ఈ షోకి సుడిగాలి సుధీర్-దీపికా పిల్లి యాంకర్స్ గా స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి జడ్జిగా అయితే వ్యవహరించారు. అయితే ప్రస్తుతానికి సైలెంట్ అయిన దీపిక పిల్లిని బిగ్ బాస్ లో రమ్మని సంప్రదించగా అందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈసారి హాట్ కంటెంట్ కి ఏ మాత్రం ఢోకా లేదని ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X